ఆటపాక

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, కైకలూరు మండలం లోని గ్రామం

ఆటపాక లేదా అటపాక (ఆంగ్లం: Atapaka), కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 333., ఎస్.టి.డి.కోడ్ నం. 08677.

ఆటపాక
—  రెవిన్యూ గ్రామం  —
ఆటపాక is located in Andhra Pradesh
ఆటపాక
ఆటపాక
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°33′38″N 81°13′43″E / 16.560500°N 81.228500°E / 16.560500; 81.228500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కొదమల శ్యామలత
జనాభా (2011)
 - మొత్తం 5,460
 - పురుషులు 2,698
 - స్త్రీలు 2,762
 - గృహాల సంఖ్య 1,496
పిన్ కోడ్ 521333
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

ఇది కైకలూరుకు 2 కి.మీ. దూరంలో ఉంది. [1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలుసవరించు

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, ఆకివీడు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

శ్రీ సి.హెచ్.టెక్నో స్కూల్, అహోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జిల్లాప్రిషత్ హైస్కూల్, వివేకానంద ఉన్నత పాఠశాల, ఆటపాక

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. అటపాక అనేది చిన్న గ్రామం.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొదమల శ్యామలత, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వేలూరి శ్రీనివాసరావు ఎన్నికైనారు. [3]
  3. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పరిపాలన చేయుచున్న తీరుపై ఈ గ్రామ పంచాయతీ, జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ఎంపికైనది. [4]

గ్రామంలోని దేవాలయములుసవరించు

శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2017, ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు ప్రారంభమైనవి. శ్రీ జంపన రామలింగరాజు దంపతుల ఆర్థిక సహకారంతో నిర్మించిన రాజగోపుర ప్రతిష్ఠను బుధవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, నగర సంకీర్తన, విఘ్నేశ్వరపూజ, దీక్షాధారణ, పుణ్యాహవచనం మొదలగు ప్రత్యేకపూజలు నిర్వహించారు. సాయంత్రం చతుర్వేద పారాయణం, ప్రవచనం, నీరాజన మంత్ర పుష్పం నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అందించిన 70 లక్షల రూపాయలకు పైగా నిధులతో ఈ పనులు చేపట్టినారు. 23వతేదీ గురువారంనాడు వీరభద్ర పళ్ళెం గ్రామోత్సవం, 24వతేదీ శుక్రవారం సాయంత్రం స్వామివారి దివ్యకల్యాణం నిర్వహించెదరు. [5]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

శ్రీ రామాలయంసవరించు

శ్రీ అంజనేయస్వామివారి ఆలయంసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములుసవరించు

పక్షి సంరక్షణా కేంద్రం, పరిశీలనా ప్రాంతంసవరించు

అటపాక పక్షుల విహార స్థలం. ఇక్కడ పక్షుల పరిశీలనకు అనువుగా బర్డ్స్ వ్యూ పాయింట్ ఏర్పాటుచేయబడింది. ఇక్కడ సంరక్షణా కేంద్రం కొల్లేరు మద్యస్థంగా కైకలూరు అడవీ ప్రాంత పరిధిలో ఉంది. ఈ సంరక్షణా కేంద్రం 673 కిలోమీటర్ల పరిధిలో పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలలో తడినేలల్లో విస్తరించుకొని ఉంది. ఇక్కడ వ్యూపాయింట్, పార్క్ ఉంది. పిల్లలు ఆడుకొనేటందుకు ఏర్పాట్లు చేసారు. కొల్లేటి పక్షులకు సంబంధించిన సమాచారము, వాటి చిత్రాల ప్రదర్శన ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

ఈ గ్రామం, అన్ని రకాల వ్యాపార వృత్తులకు, చేపల పెంపకాలకు అనుకూలమైన ప్రదేశము.

గ్రామ ప్రముఖులుసవరించు

  1. సుప్రసిద్ధ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు గారి జన్మస్థలం.
  2. ప్రముఖ వైద్యులు - రుద్రపాక కనకలింగేశ్వరరావుగారి జన్మస్థలం.

గ్రామ విశేషాలుసవరించు

ప్రపంచ ప్రసిద్ధి గాంఛిన 2వ మంఛి నీరు కొల్లెరు సరస్సు గలదు. లంక గ్రామాలకు మంచి నీరు సరాఫరా అవుతుంది.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,460 - పురుషుల సంఖ్య 2,698 - స్త్రీల సంఖ్య 2,762 - గృహాల సంఖ్య 1,496;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4883.[2] ఇందులో పురుషుల సంఖ్య 2453, స్త్రీల సంఖ్య 2430, గ్రామంలో నివాసగృహాలు 1144 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Atapaka". Retrieved 6 July 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014, ఆగస్టు-21; 6వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-25; 7వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మార్చి-28; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2017, ఫిబ్రవరి-23;3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆటపాక&oldid=3174903" నుండి వెలికితీశారు