ఆనంద్ రంగ

తెలుగు సినిమా దర్శకుడు.

ఆనంద్ రంగ, తెలుగు సినిమా దర్శకుడు.[2] 2009లో ఓయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఆనంద్ రంగ
జననం (1975-05-23) 1975 మే 23 (వయసు 49)
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. నటుడు
క్రియాశీల సంవత్సరాలు2000 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిసౌమ్యశర్మ[1]
వెబ్‌సైటుhttp://www.randomthoughts.in

జీవిత విషయాలు

మార్చు

ఆనంద్ రంగ 1975, మే 23న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన తరువాత, చెన్నైలోని తమిళనాడు ఫిల్మ్ & టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుండి డైరెక్షన్ & స్క్రీన్ ప్లే రైటింగ్ లో డిప్లొమా చేశాడు.[3] 1999, డిసెంబరు 31న నిర్మాత డి. సురేష్ బాబును కలిసి, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్ గా చేరాడు. ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో బ్యాచ్ మేట్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు, ఆనంద్ రంగ అతనితో కలిసి పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సందర్భంగా ఆనంద్ రంగ, సిద్ధార్థ్‌ను కలిసి తన కథ వినిపించి, సిద్ధార్థ్ హీరోగా ఓయ్! సినిమా తీశాడు.

తెలుగు సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ సౌమ్యశర్మ[4]తో ఆనంద్ రంగ వివాహం జరిగింది.

సినిమాలు

మార్చు

సినిమారంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఆనంద్ రంగ, సినిమా నిర్మాణంలో అనుభవం గడించాడు.[5]

దర్శకుడు: ఓయ్! (తెలుగు) (2009)

చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: బొమ్మరిల్లు (2006)

అసోసియేట్ డైరెక్టర్: నీకు నేను నాకు నువ్వు (2003), జెమిని (2002), నువ్వు లేక నేను లేను (2001), జయం మనదేరా (2000).

పాటల దర్శకత్వం, అదనపు స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కాదలి (2017)

ప్రత్యేక కృతజ్ఞతలు: శ్రీరస్తు శుభమస్తు (2016), మోసగాళ్ళకు మోసగాడు (2015), దూసుకెళ్తా (2013), సోలో (2011), ఆరెంజ్ (2010), గాయం-2 (2010), పరుగు (2008).[6]

నిర్మాతగా

మార్చు

2001లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా నిర్మించిన శేషురెడ్డితో కలిసి ఆనంద్ రంగ 'రాండమ్ థాట్స్' అనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి పొగ (2014), డికె బోస్ (2015) అనే రెండు సినిమాలను నిర్మించాడు.[7]

మూలాలు

మార్చు
  1. "Anand Ranga weds Sowmya Sharma". Idle Brain. 2010-05-23. Retrieved 25 April 2021.
  2. "Anand Ranga Interview". IdleBrain.com. 10 July 2009. Retrieved 25 April 2021.
  3. "Archived copy". Archived from the original on 2011-02-23. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Anand Ranga weds Sowmya Sharma". Idle Brain. 2010-05-23. Retrieved 25 April 2021.
  5. "Archived copy". Archived from the original on 2011-05-17. Retrieved 25 April 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-25. Retrieved 2021-04-25.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-25. Retrieved 2021-04-25.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనంద్_రంగ&oldid=3502482" నుండి వెలికితీశారు