నువ్వు లేక నేను లేను

నువ్వు లేక నేను లేను 2002 లో వై. కాశీవిశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] ఇందులో తరుణ్, ఆర్తీ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు సారథ్యంలో, డి. రామానాయుడు సమర్పణలో నిర్మితమైంది.[2]

నువ్వు లేక నేను లేను
NlekaNlenu.JPG
దర్శకత్వంవై. కాశీ విశ్వనాధ్
రచనవై. కాశీవిశ్వనాథ్ (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతదగ్గుబాటి సురేశ్ బాబు
నటవర్గంతరుణ్
ఆర్తి అగర్వాల్
లయ (నటి)
శరత్ బాబు
చంద్రమోహన్
సునీల్ (నటుడు)
ఛాయాగ్రహణంశేఖర్ వి. జోసెఫ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2002 జనవరి 14 (2002-01-14)
నిడివి
150 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

రాధాకృష్ణ (తరుణ్), కృష్ణవేణి(ఆర్తి అగర్వాల్) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వారి తల్లిదండ్రులు కూడా మంచి స్నేహితులు, కలిసి వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారుతుంది. వారి తల్లిదండ్రులు చేస్తున్న వ్యాపారం కొంచెం ఒడిదుడుకులకు లోనవడంతో ఓ పెద్దమనిషి (కె.విశ్వనాథ్) సహాయం చేస్తాడు. ప్రతిఫలంగా ఆయన మనవడికి కృష్ణవేణినిచ్చి పెళ్ళిచేయమని కోరతాడు. ఆయన చేసిన సాయానికి రాధాకృష్ణ తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణవేణి కూడా అందుకు అయిష్టంగానే అంగీకరిస్తుంది. అయితే చివర్లో పెద్దలు వారి త్యాగాన్ని గుర్తించి ప్రేమికుల్నిద్దరినీ కలపడంతో కథ సుఖాంతమవుతుంది.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  • నువ్వంటే నాకిష్టం
  • నిండు గోదారి కథ ఈ ప్రేమ
  • ఏదో ఏదో అయిపోతుంది
  • చిన్ని చిన్ని
  • ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను
  • చీ చీ బుల్లెమ్మా చీ చీ

మూలాలుసవరించు

  1. జి. వి, రమణ. "నువ్వు లేక నేను లేను చిత్ర సమీక్ష". idlebrain.com. Retrieved 18 January 2018.
  2. యు, వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. pp. 256–258.[permanent dead link]