ఆరుమిల్లి సూర్యనారాయణ

ఏ.సూర్యనారాయణ (1939 - 2023 జనవరి 20) భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ప్రొడ్యూసర్. ఆయన శ్రీ సత్య చిత్ర బ్యానర్ లో తన భాగస్వామి నెక్కంటి వీర వెంకట సత్యనారాయణతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. 1977లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, జయప్రద, జయసుధ ప్రధాన తారాగణంతో ఆయన నిర్మించిన అడవిరాముడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తన భాగస్వామి 1988లో మరణించిన తర్వాత కూడా ఆయన చిత్ర నిర్మాణం కొనసాగించాడు.

ఎ.సూర్యనారాయణ
జననం
ఆరుమిల్లి సూర్యనారాయణ

నాగులంక గ్రామం, కోనసీమ
మరణం2023 జనవరి 20
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంవయోభారం
క్రియాశీల సంవత్సరాలు1971 - 1997
శ్రీ సత్యచిత్ర పతాకం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అడవి రాముడు (1977)
జీవిత భాగస్వామిలక్ష్మి
పిల్లలుకుమార్తెలు శ్రీదేవి, అరుణ, పద్మ
బంధువులునెక్కంటి వీర వెంకట సత్యనారాయణ

ఆయన నిర్మించిన చిత్రాలలో విశేషంగా కుమారరాజా (1978) చిత్రంలో కృష్ణ ట్రిపుల్ యాక్షన్ చేయడం, కొత్త అల్లుడు (1979) చిత్రంలో చిరంజీవి ప్రతినాయకుడిగా నటించడం చెప్పుకోవచ్చు. హిందీలో అమితాబ్ బచ్చన్ తో మహాన్ అనే సినిమాని కూడా నిర్మించాడు. కాగా ఆయన నిర్మించిన చివరి చిత్రం 1997లో వచ్చిన అత్తా నీ కొడుకు జాగ్రత్త.

మరి కొన్ని చిత్రాలు

మార్చు

84 ఏళ్ళ వయసులో ఏ.సూర్యనారాయణ 2023 జనవరి 20న అనారోగ్యంతో హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.[1]

మూలాలు

మార్చు
  1. "A SuryaNarayana: 'అడవిరాముడు' నిర్మాత కన్నుమూత | Producer Arumilli Suryanarayana No More KBK". web.archive.org. 2023-01-21. Archived from the original on 2023-01-21. Retrieved 2023-01-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)