ఆశయం 1993 లో ఎ. మోహన్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన రాజకీయ చిత్రం. ఈ చిత్రాన్ని సూర్యా మూవీస్ పతాకంపై ఎ. ఎం. రత్నం నిర్మించాడు. ఇందులో విజయశాంతి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు..[1][2][3]

ఆశయం
దర్శకత్వంఎ. మోహన్ గాంధీ
నటులువిజయశాంతి
జగపతి బాబు
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ సంస్థ
విడుదల
1993
భాషతెలుగు

కథసవరించు

జగపతి బాబు, విజయశాంతి కాలేజీలో క్లాస్‌మేట్స్. విజయశాంతిని జగపతి బాబు ప్రేమిస్తాడు. విజయశాంతి చాలా హుషారయిన యువతి. ఆమె తండ్రి ఆమెకు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని చెబుతాడు. ఆమె తల్లి తన ధైర్యం గురించి ఆందోళన చెందుతుంది.

ఒకసారి, విజయశాంతి కళాశాలలో చెడిపోయిన ఆకతాయి విద్యార్థి శ్రీకాంత్ తో గొడవ పెట్టుకుంటుంది. ఇది రాజకీయ వ్యవస్థలో కొంతమంది అవినీతిపరులతో ఆమె శత్రుత్వానికి దారితీస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని విజయశాంతి ఎలా లక్ష్యంగా పెట్టుకుందో ఈ సినిమాలో తెలిపారు.

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • పోరాటాలు: త్యాగరాజన్
 • నృత్యం: రఘురాం
 • కూర్పు : గౌతంరాజు
 • సంగీతం: రాజ్ కోటి
 • ఛాయాగ్రహణం: డి.ప్రసాద్ బాబు
 • కథ, చిత్రానువాదం, మాటలు:పరుచూరి సోదరులు
 • నిర్మాత: ఎం.ఎం.రత్నం
 • దర్శకత్వం: ఎ.మోన్ గాంధీ

మూలాలుసవరించు

 1. "Heading-2". IMDb.
 2. "Heading-3". The Cine Bay.
 3. "Heading-4". gomolo.

బాహ్య లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఆశయం&oldid=3027962" నుండి వెలికితీశారు