ఉప్పల్ భగాయత్ (ఉప్పల్ మండలం)
ఉప్పల్ భగాయత్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం.[1] విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం మధ్యతరగతి వర్గాలకు నివాస ప్రాంతంగా నిలుస్తోంది.
ఉప్పల్ భగాయత్ | |
---|---|
Coordinates: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | ఉప్పల్ |
Elevation | 455 మీ (1,493 అ.) |
భాష | |
• అధికారక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 039 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 91 040 |
Vehicle registration | టిఎస్-08 |
అభివృద్ధి
మార్చుఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని మూసీతీరంలో 733 ఎకరాల గడ్డి భూములను సేకరించిన ప్రభుత్వం, అందులో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు 104 ఎకరాలు, కుల సంఘాలకు 55 ఎకరాలు, ఉప్పల్ మినీ శిల్పారామంకు 7.5 ఎకరాలు కేటాయించింది. కేటాయింపులు పోగా మిగతా భూములను హెచ్‌ఎండీఏ అన్ని వసతులు, విశాలమైన రహదారులతో అభివృద్ధి చేసింది. ఇన్నర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఉప్పల్ భగాయత్ లేవుట్ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఉప్పల్ భగాయత్ లేఅవుట్ రెండోదశలో భాగంగా చేపట్టిన 72 ఎకరాల మల్టీపుల్ యూజ్ జోన్‌లో 100కుపైగా భారీ అపార్టుమెంట్లు, వ్యక్తిగత ఇళ్లు నిర్మాణం కానున్నాయి. మధ్యతరగతి వారికి, సంపన్నులకు అందుబాటులో ఉండేలా 150 గజాల మొదలుకొని 5వేల గజాల వరకు ప్లాట్లు ఈ లేఅవుట్‌లో ఉన్నాయి. నాగోల్ -ఉప్పల్ మధ్య ఇన్నర్‌రింగురోడ్డు నుంచి ఔటర్ వరకు రేడియల్ రోడ్డు నిర్మిస్తే భగాయత్ లేఅవుట్ నుంచి నేరుగా ఓఆర్‌ఆర్‌కు చేరుకోవచ్చు. భగాయత్ లేఅవుట్ నుంచి నాగోల్ మూసీ వంతెన నుంచి ఉప్పల్ ఏషియన్ థియేటర్, నల్లచెరువు, పీర్జాదిగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని కలుపుతూ లింకురోడ్లు నిర్మిస్తున్నారు. నాగోలు-బండ్లగూడ నుంచి మరో లింకు రోడ్డు పీర్జాదిగూడ వద్ద కలిసేలా మూసీపై వంతెనను నిర్మించనున్నారు.[2]
ఆర్థిక వ్యవస్థ
మార్చుదాదాపు 733 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉప్పల్ భగాయత్‌లో 250 ఎకరాల్లో అన్ని మౌలిక వసతులతో వెంచర్‌ను అభివృద్ధి చేయబడ్డాయి. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి భారీ వాణిజ్య భవనాల నిర్మాణం కోసం విశాలమైన ప్లాట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.[3]
నిర్మాణరంగం
మార్చుమెట్రో రైలు సదుపాయంతో పాటు ఉప్పల్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సదుపాయం ఉండడంతో ఉప్పల్‌లో పెద్ద సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘లుక్ ఈస్ట్’ లక్ష్యంతో ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించడంతో బిల్డర్లు, నిర్మాణ సంస్థలు 10 అంతస్థుల నుంచి 26 అంతస్థుల అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు.
2021 డిసెంబరు 2న హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో లక్షా ఒక వెయ్యి రూపాయలకు చదరపు గజం చొప్పున అమ్మడయింది. మరోవైపు 1,787 గజాలున్న మరో ప్లాట్‌కు గజానికి 53 వేల రూపాయల చొప్పున కనిష్ట ధర లభించింది.[4]
ఇతర భవనాలు
మార్చుఈ ప్రాంతంలో రూ.50 కోట్ల వ్యయంతో 2,576 చదరపు గజాల విస్తీర్ణంలో చేనేత భవనం (చేనేత కన్వెన్షన్ సెంటర్), రూ.15 కోట్లతో 500 చదరపు గజాల స్థలంలో చేనేత-హస్తకళల మ్యూజియం నిర్మాణానికి జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా 2023, ఆగస్టు 7న రాష్ట్ర చేనేత జౌళి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశాడు.[5][6] ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిలతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ telugu, NT News (2022-05-11). "దశ మార్చిన భగాయత్". Namasthe Telangana. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-18.
- ↑ "వేలానికి 44 ప్లాట్లు.. అందరి చూపు ఉప్పల్‌వైపు.. నిబంధనలు ఇవే!". Sakshi. 2021-11-16. Archived from the original on 2021-11-16. Retrieved 2022-05-18.
- ↑ "Uppal: అ'ధర'హో.. గజం రూ.1.01 లక్షలు". Sakshi. 2021-12-03. Archived from the original on 2021-12-03. Retrieved 2022-05-18.
- ↑ telugu, NT News (2023-08-07). "Minister KTR | ఉప్పల్‌లో చేనేత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన". www.ntnews.com. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.
- ↑ "నేతన్నలకు ఆరోగ్య కార్డు". EENADU. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
- ↑ telugu, NT News (2023-08-08). "Minister KTR | చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా వ్యవహరిస్తున్న కేంద్రం: మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.