ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పుణ్యక్షేత్రాల జాబితా
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాల జాబితా
జాబితా
మార్చు- అంతర్వేది - శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం - సఖినేటిపల్లి మండలంలో ఉంది. రాజోలు, పాలకొల్లు మీదుగా బస్సు సౌకర్యం ఉంది.
- అన్నవరం - శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం - శంఖవరం మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - విశాఖపట్నం ప్రధాన రహదారి పై ఉంది. రైలు, రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.
- అప్పనపల్లి - శ్రీ బాల బాలాజీ దేవస్థానం - మామిడికుదురు మండలంలో ఉంది. రాజోల నుండి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం - రాజోలు రహదారి పై పాశర్లపూడి వద్ద దిగి వెళ్ళవచ్చు.
- అయినవిల్లి - శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం - అయినవిల్లి మండలంలో ఉంది. కొత్తపేట - ముక్తేశ్వరం రోడ్ లో ఉంది. రావులపాలెం, ముమ్మిడివరం ల నుండి బస్సు సౌకర్యం ఉంది. అమలాపురం - ముక్తేశ్వరం రహదారిలో ముక్తేశ్వరం వద్ద దిగి వెళ్ళవచ్చు.
- ఏడిద - ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం రాజమండ్రికి 25 కి.మీ.ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
- బిక్కవోలు - శ్రీ గోలింగేశ్వర ఆలయం, ఏకశిలా గణపతి ఆలయం - బిక్కవోలు మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై ఉంది. రైలు, బస్సు సౌకర్యం ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం ఉంది.
- చదలవాడ తిరుపతి - శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం. - పెద్దాపురం మండలంలో ఉంది. కాకినాడ నుండి ప్రత్తిపాడు వెళ్ళే దారిలో దివిలి వద్ద దిగి వెళ్ళవచ్చును.
- చొల్లంగి - శ్రీ సోమేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవస్థానములు - తాళ్ళరేవు మండలంలో ఉంది. కాకినాడ నుండి యానాం వెళ్ళే దారిలో ఉంది.
- ధవళేశ్వరం - శ్రీ జనార్ధన స్వామి దేవస్థానం, (నవ జనార్ధన ఆలయములో ఒకటి), శివాలయం, ముత్యాలమ్మ తల్లి దేవస్థానం. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో ఉంది. జిల్లాలో సుమారు అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం ఉంది. సమీపంలో రాజమహేంద్రవరం వరకు రైలు సౌకర్యం ఉంది.
- ద్రాక్షారామం - పంచారామాలలో ఒకటైన శ్రీ భీమేశ్వరాలయం ఉంది. - రామచంద్రపురం మండలంలో ఉంది. రామచంద్రపురం - యానాం దారిలో, కాకినాడ - కోటిపల్లి దారిలో ఉంది. కాకినాడ, రాజమహేంద్రవరం, యానం, రామచంద్రపురం, కోటిపల్లి ల నుండి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ - కోటిపల్లి రైలు మార్గం కూడా ఉంది. కాని ప్రస్తుతం నడువట్లేదు.
- ద్వారపూడి - శ్రీ ద్వారపూడి ధర్మశాస్తా అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. మండపేట మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై ఉంది. రైలు, బస్సు సౌకర్యం ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం ఉంది.
- గండి పోచమ్మ తల్లి గుడి - దేవీపట్నం మండలంలో గొందూరు గ్రామంలో గోదావరి తీరమునందు ఉంది. రాజమహేంద్రవరం నుండి సీతానగరం మీదుగా మార్గం ఉంది. ఆటో సౌకర్యం ఉంది.
- గొల్లల మామిడాడ - శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం, కోదండ రామాలయం ఉన్నాయి. పెదపూడి మండలంలో ఉంది. రామచంద్రపురం - బిక్కవోలు మార్గంలో ఉంది. రామచంద్రపురం, బిక్కవోలు నుండి బస్సు సౌకర్యం, కాకినాడ నుండి ఆటో సౌకర్యం ఉంది.
- కడలి - కపోతేశ్వర స్వామి దేవస్థానం - రాజోలు మండలంలో ఉంది. తాటిపాక, రాజోల నుండి మార్గం ఉంది.
- కాండ్రకోట - నూకాలమ్మ తల్లి ఆలయం. పెద్దాపురం మండలంలో ఉంది. పెద్దాపురం నుండి మార్గము ఉంది.
- కొత్తలంక - శ్రీ వలీబాబా దర్గా - ముమ్మిడివరం మండలంలో ఉంది. అమలాపురం సమీపంలో ముమ్మిడివరం నుండి మార్గం ఉంది.
- కోరుకొండ - శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం. కోరుకొండ మండలంలో ఉంది. రాజమహేంద్రవరం - గోకవరం ప్రధాన రహదారి పై కోరుకొండ ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
- కోటిపల్లి - శ్రీ రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు - పామర్రు మండలంలో ఉంది. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం ఉంది. యానాం - జొన్నాడ ల నుండి రోడ్డు మార్గం కలదు, ముక్తేశ్వరం నుండి రేవు దాటి రావచ్చు.
- మందపల్లి - శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవాలయం - కొత్తపేట మండలం - రావులపాలెం - కొత్తపేట మార్గంలో ఉంది.
- మట్లపాలెం - శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం - తాళ్ళరేవు మండలం, కాకినాడ - యానాం మార్గం కాకినాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం ఉంది.
- ముక్తేశ్వరం - శ్రీ క్షణ ముక్తేశ్వర ఆలయం - అయినవిల్లి మండలం. అమలాపురం, రావులపాలెం, ముమ్మిడివరం నుండి బస్సు సౌకర్యం కలదు, కోటిపల్లి నుండి రేవు దాటి రావచ్చును.
- ముమ్మిడివరం - శ్రీ బాలయోగీశ్వర స్వామి ఆలయం - ముమ్మిడివరం మండలం - అమలాపురం సమీపంలో ముమ్మిడివరం నుండి మార్గం ఉంది.
- మురమళ్ళ - శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర ఆలయం - ఐ పోలవరం మండలం - అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ నుండి బస్సు సౌకర్యం ఉంది.
- పిఠాపురం - పాదగయ క్షేత్రం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఆలయం - పిఠాపురం మండలం - కాకినాడ - కత్తిపూడి ప్రధాన రహదారి పై కలదు, రైలు, బస్సు సౌకర్యం ఉంది.
- పెద్దాపురం - మరిడమ్మ తల్లి ఆలయం, పాండవుల మెట్ట - పెద్దాపురం మండలం, బస్సు సౌకర్యం కలదు, సమీపంలో సామర్లకోట నుండి రైల్ సౌకర్యం ఉంది.
- రంప - పురాతన శివాలయం ఉంది. రంపచోడవరం మండలం, రంపచోడవరం వద్ద బస్సు దిగి సుమారు 5 కిలోమీటర్లు వెళ్ళవలెను.
- రాజమహేంద్రవరం - శ్రీ వేణుగోపాలస్వామి, ఉమా మార్కండేయ స్వామి దేవాలయములు, ఇస్కాన్ దేవాలయం, కోటిలింగాల రేవు ప్రధాన ఆలయములు, అన్ని ప్రాంతముల నుండి రైల్, బస్సు, విమాన సౌకర్యం ఉంది.
- ర్యాలి - జగన్మోహినీ కేశవ స్వామి దేవాలయం - ఆత్రేయపురం మండలంలో ఉంది. రావులపాలెం వరకు బస్సులో వెళ్లి అక్కడినుండి ఆటో లలో వెళ్ళవచ్చు.
- సామర్లకోట - పంచారామాలలో ఒకటైన కుమారా భీమారామము - బస్సు, రైలు సౌకర్యం ఉంది.
- తలుపులమ్మ లోవ - తలుపులమ్మ తల్లి దేవాలయం - తుని మండలం, తుని వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. అచ్చటినుండి సుమారు 10 కిలోమీటర్లు వెళ్ళవలెను.
- తంటికొండ - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము - గోకవరం మండలం - గోకవరం వరకు బస్సు సౌకర్యం ఉంది. అచ్చటి నుండి సుమారు 8 కిలోమీటర్లు వెళ్ళవలెను.
- వాడపల్లి - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము - ఆత్రేయపురం మండలం, లోల్ల గ్రామం వద్ద బస్సు దిగి వెళ్ళవలెను, రావులపాలెం, లోల్ల నుండి ఆటో సౌకర్యం ఉంది.[1]
మూలాలు
మార్చు- ↑ "తీర్థయాత్ర పర్యాటక రంగం | Welcome to East Godavari District Web Portal | India". Archived from the original on 2019-10-08. Retrieved 2020-02-18.