ఊయల (సినిమా)

1998 సినిమా

ఊయల 1998 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.[1] ఇందులో శ్రీకాంత్, రమ్యకృష్ణ, నాజర్, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. కవల పిల్లలను కలిగిన ఓ తండ్రి పుట్టగానే బిడ్డల్ని కోల్పోయి బాధ పడుతున్న మరో జంటకు తమ శిశువును ఇవ్వడం, పర్యవసానంగా వారు ఎదుర్కొనే సంఘర్షణ ఈ చిత్రం యొక్క ముఖ్య కథాంశం.

ఊయల
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
రచనఎస్. వి. బాలకృష్ణన్ (మూలకథ)
ఎస్. వి. కృష్ణారెడ్డి (కథ/స్క్రీన్ ప్లే)
నిర్మాతశివలెంక కృష్ణప్రసాద్
తారాగణంశ్రీకాంత్,
నాజర్,
సుహాసిని,
రమ్యకృష్ణ
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1998
భాషతెలుగు
ఎస్.వి.కృష్ణారెడ్డి

కథ మార్చు

రాజా కి కవల పిల్లలు పుడతారు. అదే సమయానికి జ్యోతి అనే ఆమె కూడా కాన్పు కోసం ఆసుపత్రిలో చేరుతుంది. ఆమెకు అంతకుముందే ఒక బిడ్డ పుట్టి చనిపోయి ఉంటుంది. రాజా సంతోషంతో జ్యోతి భర్తను పలకరించగా అతను మళ్ళీ బిడ్డను కోల్పోయిన విచారంలో ఉంటాడు. డాక్టరు, జ్యోతి భర్త ఇద్దరూ కలిసి రాజాకు కలిగిన ఇద్దరి మగ సంతానంలో ఒకరిని జ్యోతికి పుట్టిన బిడ్డగా ఇచ్చేందుకు ఒప్పిస్తారు.

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఇందులో పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు.

  • నాగమల్లి కోనల్లో గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , రచన: భువన చంద్ర
  • జరిగినదంతా నిజమని కాస్త గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • తారక దిగివచ్చి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, రచన: చంద్రబోస్
  • పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబు గానం: కె. ఎస్. చిత్ర ,రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • గోపాల బాలుడమ్మా గానం: కె. ఎస్. చిత్ర , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఏమనుకున్నా ఏమైనా, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి .

మూలాలు మార్చు

  1. "Ooyala Full length Telugu Movie". youtube.com. Telugu One. 20 July 2015. Retrieved 26 March 2018.