ఎం.ఆర్.రాధా
మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా, రంగస్థల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి. ఈయన 1967లో తన సహనటుడు, ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు.
మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ నాయుడు | |
---|---|
జననం | |
మరణం | 1979 సెప్టెంబరు 17 | (వయసు 72)
ఇతర పేర్లు | నడిగ వేల్ |
వృత్తి | నటుడు |
రాధ, 1907, ఫిబ్రవరి 21న తిరుచ్చిలో జన్మించాడు. చిన్నతనంలోనే తినటానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి రాధా ఇల్లువదిలి పారిపోయాడు. రంగస్థల నటుడై 5000కు పైగా నాటక ప్రదర్శనలిచ్చాడు. 10వ ఏట ప్రారంభమైన చిన్నచితకా వేషాలేసి, చివరికి ఆయన్నే దృష్టిలో పెట్టుకొని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగాడు.
రాధా రక్త కన్నీరు నాటకం విజయవంతమవడంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ నాటకాన్నే సినిమాగా తీసినప్పుడు అందులో కూడా అద్భుతంగా నటించి అగ్రతారగా ఎదిగాడు. ఈ సినిమా ఈయనకు అంతర్జాతీయ గుర్తింపు, పురస్కారాలను సంపాదించి పెట్టింది. ఇటీవలి రక్తకన్నీరు సినిమాను కన్నడలో ఉపేంద్ర పునర్నిర్మించాడు. రక్తకన్నీరులో రాధా నటనను దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది నటులు భారతీయ సినీ చరిత్రలోనే అత్యద్భుతమైన నటనగా కొనియాడారు. ఈ నటనను మరే నటుడు అనుకరించలేడని అన్నారు.
ఎమ్‌జిఆర్‌పై కాల్పులు జరిపిన ఘటన
మార్చు1967 జనవరి 12 న ఎం ఆర్ రాధా, ఎమ్‌జిఆర్ ఇంటికి వెళ్ళి, అతడిపై తుపాకితో కాల్పులు జరిపాడు. నిర్మాత కె.ఎన్.వాసుతో కలిసి సినిమా నిర్మాణం గురించి మాట్లాడే ఉద్దేశంతో ఎమ్‌జిఆర్ ఇంటికి వెళ్ళాడు. మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా లేచి నిలబడి, తుపాకీతో ఎమ్‌జిఆర్‌ను ఒకసారి కాల్చాడు. తూటా ఎమ్‌జిఆర్ ఎడమ చెవి పక్కగా గిగబడింది. ఆ వెంటనే రాధా తనను తానే రెండు సార్లు - ఒకటి కణతవద్ద, రెండోది మెడమీదా - కాల్చుకున్నాడు.[1] ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసారు.
కేసును విచారించిన చెంగల్పట్టు సెషన్స్ కోర్టు, రాధాకు 7 సంవత్సరాల కారాగర శిక్ష విధిస్తూ 1967 నవంబరు 4న తీర్పు ఇచ్చింది. తరువాత హైకోర్టు ఆ తీర్పును ఐదేళ్ళ మూడు నెలలకు తగ్గించింది.[2]
నటించిన చిత్రాలు
మార్చు- రక్త కన్నీర్
- ఆయిరాం రూబాయ్
- దైకొదూత దైవం
- పావ మన్నిప్పు
- ఎన్ కడమై
- చీఠీ
- పుదియ పరవాయ్
- బాలే పాండియ
- థాయిక్కు పిన్ తారం
- కవలై ఇల్లద మనితన్
- కుముదం
- కర్పగం
- తాయై కత్త తనయన్
- పాశం
- పాలుం పళముం
- పట్టినాథర్
- పడిత్తాల్ మట్టుం పోదుమా
- నానం ఓరు పెణ్
- కోడుథు వైథవల్
- ఆలయమణి
- సంతనథేవన్
- వెలుం మయిలం థునై
- రత్నపురి ఇళవరసి
- థాయి సొల్లి థాథాథే
- పెట్రాల్థన్ పిల్లయ
- పెరియ ఇదతు పెన్న్
- ఆంధ జోధి
- ఉలగం సిరిక్కిరథు
- పార్ మగళె పార్
- తాయిన్ మదియిల్
- నల్లవన్ వాళ్వాన్
మరణం
మార్చురాధా 1979 సెప్టెంబరు 17 న, తన 72 వ ఏట, కామెర్ల కారణంగా తిరుచిరాపల్లి లోని తన స్వగృహంలో కన్నుమూసాడు.
మూలాలు
మార్చు- ↑ "ది డే ఎం.ఆర్ రాధా షాట్ ఎమ్‌జిఆర్". 23 Dec 2012. Archived from the original on 21 Aug 2019. Retrieved 21 Aug 2019.
- ↑ "రాధా ప్లీడెడ్ ఇన్నోసెన్స్;వస్ ఫౌండ్ గిల్టీ". 24 Dec 2012. Archived from the original on 21 Aug 2019.