సాహితీపరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్.గంగప్ప అనంతపురం జిల్లాకు చెందినవాడు.

ఎస్.గంగప్ప
జననంఎస్.గంగప్ప
1936, నవంబర్ 8
అనంతపురం జిల్లా, పెనుకొండ తాలూకా నల్లగొండ్రాయని పల్లి గ్రామం
మరణం2022 అక్టోబరు 7
Guntur
వృత్తిఅధ్యాపకుడు
ప్రసిద్ధిపరిశోధకుడు, రచయిత
మతంహిందూ
తండ్రివెంకటప్ప
తల్లికృష్ణమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయని పల్లి లో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య సోమందేపల్లిలోను, మాధ్యమిక విద్య పెనుకొండలోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. వాల్తేరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా "కోలాచలం శ్రీనివాసరావు - నాటక సాహిత్య సమాలోచనము" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి కాకినాడ, విశాఖపట్నం,హైదరాబాదు, కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జునాయూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో తెలుగు ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు. 07-10-2022 ఉదయం గుంటూరులో మరణించారు.

సాహిత్యసేవ

మార్చు

అనేక పత్రికలలో వివిధ సాహిత్యాంశాలపై వ్యాసాలను ప్రచురించాడు. అనేక సాహిత్య సదస్సులలో, గోష్టులలో పత్రాలు సమర్పించాడు. అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు చేశాడు. సుమారు 100కుపైగా గ్రంథాలను వ్రాసి ప్రచురించాడు. అనేక సాహిత్యాంశాలపై రేడియో ప్రసంగాలు చేశాడు. ఆయనను అనేక సంస్థలు సత్కరించాయి. అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. కేంద్రసాహిత్య అకాడెమీ సీనియర్ ఫెలోషిప్‌ను పొందాడు. పదసాహిత్యంపై పరిశోధన జరిపాడు.

రచనలు

మార్చు
  1. క్షేత్రయ్య పదసాహిత్యం
  2. సారంగపాణి పదసాహిత్యం
  3. అన్నమాచార్యులు - ఇతర ప్రముఖ వాగ్గేయకారులు - తులనాత్మక అధ్యయనం
  4. తెలుగులో పదకవిత
  5. కోలాచలం శ్రీనివాసరావు[1] (ఆం.ప్ర.సంగీత అకాడెమీ ప్రచురణ)
  6. సాహిత్యసమాలోచన[2]
  7. తెలుగుదేశపు జానపదగీతాలు
  8. జానపద గేయరామాయణము
  9. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం
  10. సాహిత్యసుధ[3]
  11. సాహిత్యానుశీలన[4]
  12. ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్యజీవితం
  13. సాహిత్యోపన్యాసములు
  14. భాషావ్యాసాలు
  15. తెలుగు నాటకం - ఆరంభం నుంచి అబ్సర్డు నాటకాలదాకా
  16. విశ్వనాథవారి వేయిపడగలు - విశ్లేషణాత్మక విమర్శ
  17. విశ్వనాథవారి నాటకాలు - విశ్లేషణ
  18. సుహాసినీహాసం (నవల)
  19. వేమన భావన
  20. సిద్ధేంద్రయోగి
  21. పురంధరదాసు
  22. నాగార్జునుడు
  23. ఎఱ్ఱన రసపోషణ
  24. తిక్కన భారతం శాంతిపర్వం ద్వితీయాశ్వాసం వ్యాఖ్యానం
  25. Literature of Asian Studies
  26. అన్నమాచార్య సంకీర్తన సుధ
  27. రాజరాజప్రశస్తి (నవల)
  28. ఆత్మార్పణం (నవల)
  29. పదకవితాపితామహుడు (నాటకం)
  30. దివ్యదీపావళి (నాటకం)
  31. దేశం బాగుపడాలంటే (నాటకం)
  32. బాలగేయాలు
  33. తీరిన భయం (కథలసంపుటి)
  34. నవోదయం (కవిత్వం)
  35. రెండు గులాబీలు (కవిత్వం)
  36. అంతరంగతరంగాలు (కవిత్వం)
  37. పగటివేషాలు
  38. శ్రీకృష్ణస్తోత్రత్రయము
  39. ప్రసంగసాహితి

పురస్కారాలు సత్కారాలు

మార్చు
  • 1972 - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
  • 1981 - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు
  • 1983-85 - కేంద్రప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ ఫెలోషిప్
  • 1984 - విశ్వనాథ సాహిత్యపీఠం అవార్డు
  • 1991 - యు.జి.సి. జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు
  • 1992 - ఆం.ప్ర.ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు
  • 1992 - తెలుగు విశ్వవిద్యాలయం తిక్కవరపు రామిరెడ్డి స్మారక ధర్మనిధి పురస్కారం
  • 1993 - తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ పరిశోధన పురస్కారం
  • 2013 - హంస (కళారత్న) పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[5]

మూలాలు

మార్చు
  1. [https://archive.org/details/in.ernet.dli.2015.386209 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం
  2. [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం
  3. [2] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం
  4. [3] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లభ్యం
  5. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 ఏప్రిల్ 2020. Retrieved 17 April 2020.
  1. రాయలసీమ రచయితల చరిత్ర 4వ సంపుటి - కల్లూరు అహోబలరావు - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం 1986
  2. వార్త దినపత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక సంచిక అనంతనేత్రం