ఎ. విన్సెంట్ (14 జూన్ 1928 – 2015 ఫిబ్రవరి 25) సినిమా ఛాయాగ్రాహకుడు. కేరళకు చెందిన విన్సెంట్ తెలుగు, తమిళ, మలయాళ భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు.[1][2] ఆయన ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్‌నగర్" (1974) సినిమాకు అవార్డు అందుకున్నారు. ఆయన చివరి మలయాళం చిత్రం 1985లో విడుదలైన 3డి చిత్రం "పౌర్ణమి రావిల్"

Aloysius Vincent.
ఎ. విన్సెంట్
జననం(1928-06-14)1928 జూన్ 14
కోఝికోదె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా.
మరణం2015 ఫిబ్రవరి 25(2015-02-25) (వయసు 86)
వృత్తిసినిమా ఛాయాగ్రాహకుడు, దర్శకుడు
పిల్లలుజయనన్ విన్సెంట్, అజయన్ విన్సెంట్

జీవిత విశేషాలు మార్చు

విన్సెంట్ 1928 లో మద్రాసు ప్రెసిడెన్సీ లోని కాలికట్లో జన్మించారు. ఆయన జెమిని స్టుడియోస్ కు అనుసంధానమైన ఛాయాగ్రాహకుడు కమల్ ఘోష్ వద్ద శిక్షణ పొందాడు. ఆయన తన ప్రస్థానాన్ని తమిళ సినిమాతో ప్రారంభించారు. ఆయన శివాజీ గణేషన్ నటించిన చిత్రం"ఉత్తమ పుత్తిరన్"తో ప్రసిద్ధుడైనాడు. ఆయన సి.వి.శ్రీధర్ తో కలసి "కళ్యాణ పరిసు", "నెంజిల్ ఆర్ ఆలయం", "కాధలిక్క నేరమిల్లై", "సుమైతాంగి", "దెన్ నిలవి" సినిమాలను చేసారు. అప్పుడు ఆయన మలయాళం, తెలుగు చలనచిత్రాలలో మంచి విజయాలను సాధించారు. ఆయన హిందీ చలన చిత్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో మంచి గుర్తింపును పొందారు. ఆ కాలంలో భారతీయ సినిమా ఛాయాగ్రాహకత్వం శైశవ దశలో ఉన్నప్పుడు ఆయన వివిధ ప్రదేశాలు, కోణాలలో కెమేరాతో అనేక ప్రయోగాలు చేసాడు. అంతకు పూర్వం దక్షిణ భారతదేశంలోని చలన చిత్రాలలో లేనివిధంగా వినూత్నంగా ఛాయాగ్రాహకత్వం చేసారాయన. 2003 లో ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫెర్స్ ఆయనకు కె.కె.మహాజన్, వి.కె.మూర్తిలతో పాటు గౌరవ సభ్యత్వం యిచ్చారు.[3]

ఆయన సుమారు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అధిక భాగం మలయాళ భాషా చిత్రాలే. ఆయన మొదటి సారి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా 1965 లో విడుదలైన "భార్గవి నిలయం". ఇది మలయాళ సినిమా చరిత్రలో విజయాన్ని సాధించింది.

ఆయన ఫిబ్రవరి 25 2015 న తన 86 యేండ్ల వయస్సులో మరణించారు. ఆయన కుమారులు కూడా ఛాయాగ్రాహకులే. ఆయనకు ఒక కుమార్తె కూడా ఉంది.

సినిమాలు మార్చు

1953లో 'చండీ రాణి' చిత్రానికి గెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు విన్సెంట్. పూర్తి స్థాయి సినిమాటోగ్రాఫర్గా 'బ్రతుకు తెరువు', బక్త ప్రహ్లాద, అమర దీపం, పెళ్ళి కానుక, కుల గోత్రాలు, ప్రేమ నగర్, లేత మనసులు, అడవి రాముడు, నారీ నారీ నడుమ మురారి, మేజర్ చంద్రకాంత్, బొబ్బిలి సింహం, సాహస వీరుడు సాగరకన్య, అన్నమయ్య.. ఇలా వంద చిత్రాలకు పైగా విన్సెంట్ కెమెరా కనువిందు చేసింది. నలుపు-తెలుపు చిత్రాలు, రంగుల చిత్రాలకూ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించి, చిత్రసీమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన ఇద్దరు కుమారులు జయనన్ విన్సెంట్, అజయనన్ విన్సెంట్ కూడా తండ్రి బాటలో ఛాయాగ్రాహకులుగా మారారు. తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు.

మూలాలు మార్చు

  1. B. Vijayakumar (16 November 2009). "Bhargavi Nilayam 1948". Chennai, India: The Hindu. Archived from the original on 29 జూన్ 2011. Retrieved 14 జూలై 2015.
  2. B. Vijayakumar (30 March 2009). "Murappennu 1965". The Hindu. Archived from the original on 8 నవంబరు 2012. Retrieved 25 February 2015.
  3. "ISC – KODAK National Seminar on "Cinematographer as a Co-author of Cinema"". ISC. Archived from the original on 19 నవంబరు 2008. Retrieved 4 May 2014.

ఇతర లింకులు మార్చు