ఐనపూరు

భారతదేశంలోని గ్రామం

ఐనపూరు, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 247. ఎస్.టి.డి.కోడ్ = 08676.

ఐనపూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,322
 - పురుషులు 1,177
 - స్త్రీలు 1,145
 - గృహాల సంఖ్య 809
పిన్ కోడ్ 521247
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలంసవరించు

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భొగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో బిళ్ళపాడు, మందపాడు, సత్యనారాయణపురం, బొమ్ములూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

పెదపారుపూడి, నందివాడ, గుడ్లవల్లేరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

గుడివాడ, గుడ్లవల్లేరు నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

పరివార దేవతా సహిత శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో, 2016, ఫిబ్రవరి-22వతేదీ, మాఘశుద్ధపౌర్ణమినాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. 23వతెదీ మంగళవారంనాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, ఆంజనేయస్వామివారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వతేదీ బుధవారం, 25వ తెదీ గురువారంనాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించారు. 26వతేదీ శుక్రవారం ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్తంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించారు. [1]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. భక్తులు సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఈ ఆలయంలోని మహాశివుని దర్శనం చేసుకుంటారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2403.[3] ఇందులో పురుషుల సంఖ్య 1198, స్త్రీల సంఖ్య 1205, గ్రామంలో నివాసగృహాలు 692 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 159 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,322 - పురుషుల సంఖ్య 1,177 - స్త్రీల సంఖ్య 1,145 - గృహాల సంఖ్య 809

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-08-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-08-22. Cite web requires |website= (help)
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Inapuru". Retrieved 24 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-08. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఫిబ్రవరి-27; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, ఫిబ్రవరి-25; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఐనపూరు&oldid=2861158" నుండి వెలికితీశారు