కన్నూరు జిల్లా (కేరళ)

కేరళ లోని జిల్లా
(కణ్ణూర్ (కేరళ) నుండి దారిమార్పు చెందింది)

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కన్నూరు జిల్లా ఒకటి. కన్నూరు పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా కేంద్రం పేరిటే జిల్లాకు పేరు పెట్టారు. పాతపేరు కన్ననూరు ఆగ్లీకరణలో కన్నూరుగా రూపాంతరం అయింది. కన్నూరు జిల్లా 1957లో రూపొందించబడింది. జిల్లా ఉత్తర సరిహద్దులో కాసరగాడ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో కోళికోడ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో వయనాడు జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు సరిహద్దులో ఉన్న పశ్చిమకనుమలు జిల్లాకు కర్నాటక రాష్ట్రానికి చెందిన కొడగు జిల్లాకు మద్య సరిహద్దు ఏర్పరుస్తూ ఉన్నాయి. కన్నూరు జిల్లా లాండ్ ఆఫ్ లూం, లాండ్ ఆఫ్ లోర్ అని కూడా అంటారు. ఇక్కడ నేత పరిశ్రమలు, ఆలయాలలో నిర్వహించబడే సంప్రదాయ ఉత్సవాలు పండుగలు అధికంగా ఉన్నాయి కనుక జిల్లాకు ఈపేరు వచ్చింది. జిల్లాలో ఉత్తర కేరళాలో ప్రసొద్ధమైన " తెయ్యం " అనే సంప్రదాయ నృత్యానికి కేంద్రంగా ఉంది. జిల్లాలో తెయ్యం సంబంధిత కవు అనే మందిరాలు ఉన్నాయి. కన్నురుకు 26 కి. మీ దూరంలో " కన్నూరు ఇంటర్నేషనల్ విమానాశ్రయం " నిర్మాణానికి ప్రతిపాదన జరిగింది.

Kannur district
district
Sunset at Payyambalam Beach
Country India
Stateకేరళ
HeadquartersKannur
ప్రభుత్వం
 • CollectorRathan Kelkar
విస్తీర్ణం
 • మొత్తం2,966 కి.మీ2 (1,145 చ. మై)
జనాభా
 • మొత్తం24,12,365
 • సాంద్రత813/కి.మీ2 (2,110/చ. మై.)
Languages
 • OfficialMalayalam, English
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
ISO 3166 కోడ్IN-KL-KNR
Sex ratio1090 /
Literacy92.80%
జాలస్థలిwww.kannur.nic.in

పేరు వెనుక చరిత్రసవరించు

కన్నూరు జిల్లాపేరు గురించిన పలు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేరుకు "కణ్ణన్", "కృష్ణ"లు మూలమని విశ్వసిస్తున్నారు. ఊరు అంటే నివాసితప్రాంతం అని అర్ధం. కృష్ణభగవానుడు నివసించిన ప్రాంతం అని అర్ధం. కడలై శ్రీకృష్ణా ఆలయం ఆరంభకాలంలో కడలై కోటలో చిన్న మందిరంగా ఉండేది. ఇది ప్రస్తుత కన్నూరు జిల్లా ఆగ్నేయ భాగంలో ఉండేది. బ్రిటిషు పాలనాకాలంలో నగరాన్ని కన్ననూరు అని పిలిచేవారు. పోర్చుగీసు యాసలో ఇది కన్ననోర్‌గా రూపాంతరం చెందింది. కేరళ రాష్ట్రంలోని అరక్కల్ సుల్తానేట్ కాలంలో ఇది ముస్లిం రాజ్యానికి రాజధానిగా ఉండేది.

చరిత్రసవరించు

కన్నూరు 12వ శతాబ్దంలో ప్రముఖవాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. కన్నూరు నుండి పర్షియా, అరేబియా దేశాలతో వాణిజ్యం జరిగింది. ఇది 1887 వరకు బ్రిటిషు ఇండియా పశ్చిమ సముద్రతీర సైనిక కేంద్రంగా ఉంది. తనసోదరి నగరం తల్లిచేరితో విలీనం తరువాత ఇది బ్రిటిషు ఇండియా పశ్చిమ తీరంలో అత్యంత విశాలమైన నగరంగా తృతీయ స్థానానికి మారింది. మొదటి స్థానాలలో బొంబయి, కరాచి నగరాలు ఉన్నాయి.

పోర్చుగీసు కోటసవరించు

1505 లో మొదటి పోర్చుగీసు వైస్రాయి ఆఫ్ ఇండియా డాం ఫ్రాంసిస్కో అల్మెయిడా సెయింట్. ఆగ్లో కోట నిర్మించాడు. 1663లో డచ్చి వారు పోర్చుగీసు నుండి కోటను స్వాధీనం చేసుకున్నారు. వారు కోటను ఆధునీకరణ చేసి హోలండియా, జీలండియా, ఫ్రీస్లాండియా బురుజులను నిర్మించారు. అవి ప్రస్తుత కోటలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. తరువాత అసలైన పోర్చుగీసు కోటను పడగొట్టారు. ఇక్కడ ఉన్న ఫిషింగ్ ఫెర్రీ నేపథ్యం ఉన్న వర్ణచిత్రం ప్రస్తుతం అమస్టర్‌డామ్ మ్యూజియంలో ఉంది. 1772లో డచ్చివారు ఈ కోటను అలిరాజాకు విక్రయించారు. 1790లో బ్రిటిషు ప్రభుత్వం ఈ కోటను స్వాధీనం చేసుకుని కోటను వారి ప్రధాన సైనిక కేంద్రాలలో ఒకటిగా చేసింది. 17వ శతాబ్దంలో కన్నూరు ముస్లిం సుల్తానేటుకు రాజధానిగా (అరక్కల్) ఉంది. [1] బ్రిటిషు పాలనా కాలంలో కన్నూరు మద్రాసు ప్రావిన్సులో భాగంగా ఉండేది.

 
కన్ననోర్ నగరం, 1572

పళసి రాజాసవరించు

కొట్టాయం పాలకుడు పళసి రాజా బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన గొరిల్లా యుద్ధం కన్నూరు ప్రాంతాన్ని బాగా ప్రభావితం చేసింది. 20వ శతాబ్దం ఆరంభంలో కేరళలో సాంఘిక ఆర్థిక, రాజకీయరంగాలలో సంభవించిన మార్పులు కమ్యూనిస్టు ఉద్యమం బలపడడానికి కారణం అయింది. 1906 మిషనరీలు ప్రారంభించిన ఆగ్లభాషా మాధ్యమ విద్య తరువాత బ్రిటిషు ప్రభుత్వ నిర్వహణలోకి మారింది. 1888లో శరీరపైభాగం కప్పుతూ దుస్తులను ధరించడానికి తిరిగుబాటు కొనసాగింది. ఇందుకు స్మారకంగా అరువిప్పురం సమీపంలో విగ్రహప్రతిష్ఠ, 1891లో మలయాళీ మెమోరియల్, 1903లో ఎస్. ఎన్. డి. పి. యోగం స్థాపన, యాక్టివిటీస్, అల్లర్లు మొదలైన సంఘటనలు జరిగాయి.

సోషలిజంసవరించు

తరువాత సోషలిజం, సోవియట్ విప్లవం కేరళలో ప్రవేశించాయి. స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్ళై, సహోదరన్ అయ్యప్పన్, పి. కేశవదేవ్ తదితర నాయకులు ప్రజలను ప్రభావితం చేసారు. 1930లో ప్రయోజనకరమైన అభివృద్ధి చోటుచేసుకుంది. ట్రావంకోర్‌లో నివర్తన ఆందోళన జరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించడానికి బలహీన వర్గాల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పదవులలో, ఉద్యోగాలలో రిజర్వేషను సదుపాయం కలిగించారు. అణిచివేతకు గురైన బలహీన వర్గాలకు చెందిన ప్రజలలో ఇది కొత్త ఆశలను చిగురింపజేసింది. [2]

 
పిలథార లో యుద్ధ వ్యతిరేక ఊరేగింపు

భౌగోళికం, వాతావరణంసవరించు

భౌగోళికంసవరించు

కన్నూరు జిల్లా 11-40 నుండి 12-48 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 74-52 నుండి 76-07 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 2, 996 చ.కి.మీ. భౌగోళికంగా కన్నూరు హైలాండ్, మిడ్‌లాండ్, లోలాండ్‌గా విభజించబడింది. హైలాండ్ పశ్చిమకనుమలలో భాగంగా కొండలమయంగా ఉంటుంది. ఇక్కడ వర్షారణ్యాలు, టీ, కాఫీ, యాలుకల తోటలు ఉంటాయి. ఇక్కడ టింబర్ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. హైలాండ్, లోలాండ్ మద్య ఉన్న మిడ్‌లాండ్ ప్రాంతం కొండలు, లోయలతో ఎగుడు దిగుడుగా ఉంటుంది. లోలాండ్ ఇరుకైన సన్నని సముద్రతీరప్రాంతం, నదీప్రవాహాలు, నదీముఖద్వారాలతో ఉంటుంది.

నదులుసవరించు

కన్నూరు జిల్లాలో ప్రధానంగా 6 నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో అతిపెద్ద నది 110కి. మీ పొడవైన నదిగా వలపట్టణం ప్రత్యేకత కలిగి ఉంది. ఇతర నదులలో కుప్పం, మాహేనది, అంజరకండి, తలస్సేరి, రామాపురం, పెరవూరు.

శీతోష్ణస్థితిసవరించు

 
తాలిపరంబ మార్కెట్

జిల్లా తేమ శీతోష్ణస్థితి ఉంటుంది. మార్చి నుండి మే చివరి వరకు వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. తరువాత నైరుతి ఋతుపవనాలు ఆరంభమై సెప్టెంబరు వరకు వర్షపాతం ఉంటుంది. తరువాత అక్టోబరు - నవంబరు మాసాలలో ఈశాన్య ఋతుపవనాల కారణంగా వర్షాలు పడతాయి. ఏప్రిల్ మే మాసాలలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 20, 16 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 3438 మి.మీ ఉంటుంది. 80% వర్షపాతం నైరుతి ఋతుపవనాల కారణంగా ఉంటుంది. జూలై మాసంలో మాత్రమే 68% వర్షపాతం ఉంటుంది.

కన్నౌర్ నగరంసవరించు

 
కొట్టాళి గుడి
 • కన్నూరు (కన్నౌర్) నగరం గతంలో కన్ననూర్ అని పిలువబడింది. ఇది కన్నూర్ జిల్లాకు కేంద్రంగా ఉంది.
 • అయిక్కరా నగరం కన్ననూర్ నగరంలో భాగంగా ఉంది. పురాతన కాలంలో వాస్తవంగా ఇది నగరకేంద్రంగా (డౌన్‌టౌన్) ఉండేది. ప్రస్తుతం ఇది నివాసిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ ముస్లిం జాలర్లు అధికంగా నివసిస్తున్నారు. ప్రాంతీయవాసులు అధికంగా ఈప్రాంతాన్ని సిటీ అంటారు.

జిల్లాలో పట్టణాలుసవరించు

కన్నూర్ జిల్లాలో పలు పట్టణాలు ఉన్నాయి.

మునిసిపాలిటీలుసవరించు

 • తలస్సేరి
 • మట్టనూరు
 • పయ్యనూరు
 • కూతుపరంబా
 • తాలిపరంబా
 • శ్రీకండపురం
 • ఇరిట్టీ
 • అంతూరు
 • పానూర్

పంచాయితీలుసవరించు

 • చెరుకున్నూరు
 • పెరవూరు
 • కెలకం
 • వలపట్టణం
 • పళయంగాడి
 • చక్కరక్కల్
 • చిరక్కల్ పుదియతెరు
 • పిలతర
 • అలకొడే (కన్నురు జిల్లా)
 • పప్పినిస్సేరి

2001 - 2011 గణాంకాలుసవరించు

Religions in Kannur District
Religion Percent
Hindus
  
59.8%
Muslims
  
29.4%
Christian
  
10.4%
Others
  
0.4%
Distribution of religions
Source: 2011 Census.
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 25,25,637 [3]
ఇది దాదాపు. కువైట్ దేశ జనసంఖ్యకు సమానం. [4]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం. [5]
640 భారతదేశ జిల్లాలలో. 170 వ స్థానంలో ఉంది. [3]
1చ. కి. మీ జనసాంద్రత. 852 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 4. 84%. [3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1133:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 95. 41%. [3]
జాతియ సరాసరి (72%) కంటే.
2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 24,12,365 [6]
2001 గణాంకాలను అనుసరించి నగరీకరణలో ప్రథమ స్థానం
2011లో గణాంకాలను అనుసరించి నగరీకరణలో 4 వ స్థానం (ఎర్నాకుళం, త్రిసూర్, కోళికోడ్)
నగర నివాసితుల శాతం 50. 35% (సంఖ్య 1, 212, 898)
నరప్రజల సంఖ్యలో ద్వితీయ స్థానం (ప్రథమస్థానం ఎర్నాకుళం)[2]
హిందువుల శాతం 61. 47%
క్రైస్తవులు 10. 84%
ముస్లిముల సంఖ్య 27. 63%
2001 జిల్లాలోని పట్టణాల సంఖ్య 45[7]
2011 జిల్లాలోని పట్టణాల సంఖ్య 67 (త్రిసూర్ 135)

విభాగాలుసవరించు

కన్నూరు జిల్లాలో 7 పట్టణాలు ఉన్నాయి: కనూరు, కన్నూరు కంటోన్మెంటు, తలస్సేరి, పయ్యనూర్, థాలిపరంబా, కుతుపరంబా, మట్టనూరు.[6]

భాషసవరించు

కన్నూరు జిల్లాలో మలయాళం ప్రధానభాషగా ఉంది. స్వల్పంగా కన్నడం, కొంకణి, తులు, గుజరాతి, తమిళం మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఆంగ్లో ఇండియన్ ప్రజలకు ఆగ్లం వాడుకభాషగా ఉంది. కన్ననొర్ ఇండో - పోర్చుగీస్ క్రియోల్ కూడా ఇప్పటికీ స్వల్పంగా వాడుకలో ఉంది. కేరళలో నగరీకరణం చెందిన జిల్లాలలో కన్నూరు 6 వ స్థానంలో ఉంది. జిల్లాలో 50% కంటే అధికంగా ప్రజలు నగరాలలో నివసిస్తుంటారు. నగరవాసుల సంఖ్యాపరంగా (12,12,898) కేరళ రాష్ట్రంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటిస్థానంలో ఎర్నాకుళం ఉంది.

పర్యాటకంసవరించు

 • వి- ప్రా కాయల్ ఫ్లోటింగ్ పార్క్. వయలపరా చెంబల్లికుండు.
 • స్నేక్ పార్క్, పరాసినిక్కడవు.
 • సెయింట్. ఆంగ్లో ఫోర్ట్. కన్నూర్.
 • పైథల్మల హిల్స్, నడువిల్.
 • పలక్కయం తట్టు, నడువి.
 • ఎళిమల హిల్స్, పయ్యనూర్.
 • మదయిప్పరా, పళయంగాడి.
 • డిస్ట్రిక్ ఫాం, తాలిపరంబా.
 • ఎలపీదిక, పెరవూర్.
 • హాంగింగ్ బ్రిడిజ్, పెరలస్సేరి.
 • హాంగింగ్ బ్రిడ్జ్, కుట్టియేరి.
 • కంజిరకొల్లి జలపాతం, పయ్యావూర్.
 • చతమంగళం (కన్నూర్)
 
ఆగస్టులో మదాయి పర

[8][9]

ఆర్ధికంసవరించు

కన్నూర్ జిల్లా " లాండ్ ఆఫ్ లూం "గా ప్రసిద్ధి చెందింది. జిల్లాలో నేత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని ఆలయాలలో పండుగలు కోలాహలంగా నిర్వహించబడుతుంటాయి. ఉత్తర కేరళాలో ప్రాధాన్యత కలిగిన తెయ్యం సంప్రదాయ నృత్యానికి జిల్లా కేంద్రంగా ఉంది. తెయ్యం అనుబంధిత కవ్వు అనే చిన్న మందిరాలు జిల్లా అంతటావిస్తరించి ఉన్నాయి.

వ్యవసాయంసవరించు

జిల్లాలో అత్యధిక ప్రజలకు నేరుగా అయినా పరోక్షంగా అయినా వ్యవసాయమే జీవనాధారం. జిల్లాలో వరి, కొబ్బరి, మిరియాలు, జీడిపప్పు, టాపికా, అరెకానట్, తోటల (రబ్బర్) పెంపకం మొదలైన పంటలు ప్రధానంగా ఉన్నాయి. 1767లో బ్రిటిషు ఇండియాకు చెందిన లార్డ్ బ్రౌన్ స్థాపించిన యాలుకల ఉత్పత్తి సంస్థ ఆసియాలో అత్యంత బృహత్తరమైనదిగా భావిస్తున్నారు. ఇది కన్నూర్ జిల్లాలోని అంజరకండిలో ఉంది.

పంటలుసవరించు

వార్షిక పంటలలో వరిపంట ప్రథమస్థానంలో ఉంది. పంటవిధానంలో చేపట్టిన పంటవిధానం ఫలితంగా గణనీయమైన వరిఉత్పత్తి సాధ్యమైంది. అయినప్పటికీ క్రమంగా వరిపంట పండించబడుతున్న భూమిశాతం క్షీణిస్తూ ఉంది. వరి పొలాలు ఇతర ఉపయోగాలకు ఉపయోగించబడుతున్నాయి. సరాసరిగా హెక్టారుకు 2, 146 కి. గ్రా పండించబడుతుంది. వరిపంట తరువాత స్థానంలో కొబ్బరి పంటకు ప్రాధాన్యత ఉంది. జిల్లా అంతటా కొబ్బరి విస్తారంగా పండించబడుతుంది. జిల్లా జీడిపప్పు పరిశ్రమకు ప్రసిద్ధిచెందింది. జీడిపప్పు పండించడంలోను, తయారీలోనూ జిల్లా ప్రధానపాత్ర వహిస్తుంది. జిల్లాలో అధికంగా ఉన్న ఉపయోగంలేని బీడుభూములను జీడిమామిడి పంటభూములుగా మార్చి జీడిపంటను అధికం చేయడం, సంబధిత పరిశ్రమలను అధికం చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

మసాలాదినుసులుసవరించు

మసాలా దినుసులలో మిరియాలపంట ప్రధానపాత్ర వహిస్తుంది. మిరియాలపంట కొబ్బరిపంటకు అంతరపంటగా పండించబడుతుంది. కొండప్రాంతాలలో రబ్బర్ పంట, జీడిమామిడి అంతరపంటగా పండించబడుతుంది. తోటపంటలలో రబ్బర్ పంట పారిశ్రామికవాణిజ్య పంటగా ప్రాధాన్యత వహిస్తుంది. కన్నూరు జిల్లాలోని 55% రబ్బరు పంట ఇరిట్టీ తాలూకాలో పండించబడుతుంది. రబ్బరు పంట హెక్టారుకు 2000 - 4000 కి. గ్రా పండించబడుతుంది.

పరిశ్రమలుసవరించు

 
A village scene from Kannur district

కన్నూఋ జిల్లా ఆరంభకాలం నుండి పారిశ్రామిక ప్రాధాన్యత కలిగి ఉంది. పంటపొలాలు, అనుకూలవాతావరణం, సుసంపన్నమైన అరణ్యసంపద, మత్స్య సమృద్ధి, ఖనిజ సంపద, రహదారి, రైలు, జలమార్గాల సౌకర్యం మొదలైన సహజససంపద, మానవాధారిత వనరులు జిల్లాకు విస్తారంగా పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తున్నాయి. జిల్లాలో కెల్టాన్ కాంప్లెక్స్, మంగత్తుపరంబ, వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్, వలప్పట్టణం మొదలైన ప్రముఖ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 12 మద్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. పత్తి, వస్త్రాల తయారీ, ప్లైవుడ్ తయారీ వీటిలో ప్రధానంగా ఉన్నాయి.

చేనేత పరిశ్రమసవరించు

జిల్లాలో చేనేత, బీడి, కొబ్బరినార ప్రధాన వాణిజ్య పరిశ్రమలుగా ప్రధాన్యత వహిస్తున్నాయి. టెక్స్‌టైల్ పరిశ్రమను ఆధారంచేసుకుని 1, 00, 000 మంది జీవిస్తున్నారు. జిల్లాలోని నిన్నతరహా పరిశ్రమలలో చేనేతపరిశ్రమలు 40% భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇవి 19వ శతాబ్దంలో జర్మన్ బాసెల్ మిషన్లను ఉపయోగించింది. 19వ శతాబ్దం చివరినాటికి కన్నూరులో మొదటి రెడీమేడ్ దుస్తుల తయారీ యూనిట్, కుతుంపరంబాలో మొదటి హొసియరీ యూనిట్ స్థాపించబడ్డాయి. బీడీ పరిశ్రమద్వారా 50, 000 మందికి ఉపాధి లభిస్తుంది. జిల్లాలో ది దినేష్ బీడీ కోపరేటివ్, ప్రైవేటు యాజమాన్యం వహిస్తున్న సాధు బీడి ఉన్నాయి. టెకాయనార వ్యాపారం సంప్రదాయంలో భాగంగా ఉంటూ 11, 000 మందికి ఉపాధి కల్పిస్తుంది.

కుటీర పరిశ్రమలుసవరించు

జిల్లాలో 6, 934 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో 202 (9. 3%) సిక్ (బలహీన) యూనిట్లు ఉన్నాయి. 4, 828 ఇతర యూనిట్లు పనిచేస్తున్నాయి. 162 ఇండస్ట్రియల్ సొసైటీలు 4 పవర్ లూం సొసైటీలు ఉన్నాయి. కన్నూరు, తలస్సేరి, పయ్యనూర్, తాలిపరంబా, ఎడక్కాడ్ అభివృద్ధి కేంద్రాలుగా గుర్తించబడుతున్నాయి.

వృక్షజాలం, జంతుజాలంసవరించు

 
Mangroves on the banks on Valapattanam River

కన్నూర్ జిల్లా వృక్షజాలంతో సుసంపన్నమై ఉంది. సముద్రతీరాలలో మినహా మిగిలిన ప్రాంతాలలో సహక్షమైన వృక్షజాలం దట్టంగా ఉంది. అనుకూలవాతావరణం వైవిధ్యమైన వృక్షజాలానికి సహకరిస్తుంది. సతహరితారణ్యంలో ప్సామ్మోఫైటె, మాంగ్రోవ్ వృక్షాలు కనిపిస్తుంటాయి.

తీరప్రాంతంసవరించు

సముద్రతీర ప్రాంతం సన్నగా ఉండి ఇందులో రెండవతరహా మట్టి (వదులుగా లేక గట్టిగా కాక మధ్యంతరం) ఉంటుంది. ఇది స్వల్పమైన వృక్షజాలానికి (ప్సామ్మోఫైటె) మాత్రం పెరగడానికి అనుకూలంగా ఉంది. స్వల్పంగా ఉండే చెట్లు చిన్నవిగా, పొట్టిగా ఉంటాయి. ఇక్కడ మాంగ్రోవ్ వృక్షాలు దర్శనం ఇస్తుంటాయి. నదీప్రవాహ ప్రాంతాలు, వెనుకజలాలు (బ్యాక్ వాటర్) ప్రాంతాలలో ఇవి కనిపిస్తుంటాయి. మానవ ఆక్రమణల కారణంగా సముద్రతీర ప్రాంతాలలో మార్పులు సంభవిస్తున్నాయి.

మిడ్ లాండ్సవరించు

జిల్లాలో ప్రధానభాగం మిడ్ లాండ్‌లో ఉంది. ఇక్కడ అనేక కొండలు, గుంటలు ఉంటాయి. ఇది ఎత్తుపల్లాలతో అసమానంగా ఉండి పశ్చిమ కనుమల నిటారైన పర్వతప్రాంతంలో కలిసిపోతుంది. ఇక్కడ మట్టి మధ్యంతరంగా ఉంటుంది. ఇక్కడ ఆకురాల్చు అరణ్యాలు, సతతహరితారణ్యం మిశ్రితమై ఉంటుంది. ఇక్కడ వార్షిక, బహువార్షిక మొక్కలు పెరుగుతుంటాయి.

పర్వత ప్రాంతంసవరించు

మిడ్‌లాండ్ ప్రాంతంలో పర్వతశ్రేణి క్రమంగా పశ్చిమకనుమల పర్వతాలలో కలిసిపోతాయి. ఇక్కడ మట్టి ఎరుపురంగులో, వదులుగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా అరణ్యం నిండి ఉంటుంది. ఇక్కడ చెదురుమదురుగా టేకు, వెదురుపొదలు నిండి ఉంటాయి. క్రమంగా నాణ్యమైన అరణ్యప్రాంతం పచ్చికమైదాన ప్రాంతంగా మారుతూ ఉంది.

అరళం అభయారణ్యంసవరించు

 
A cluster of mangroves on the banks of Vellikeel river in Taliparamba

అరళం అభయారణ్యం 55 చ. కి. మీ వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడ అసమానమై ప్రాంతంలో విస్తరించి ఉన్న అరణ్యం, పశ్చిమ కనుమల కొండచరియలు విస్తరించి ఉన్నాయి. ఇది 1984లో స్థాపించబడింది. అభయారణ్యం ప్రధానకార్యాలయం కన్నూరు నగరానికి 55 కి. మీ దూరంలో ఉన్న చీన్నపట్టణం అయిన ఇరిట్టిలో ఉంది. అభయారణ్యం అరళంలో ఉన్న " సెంట్రల్ స్టేట్ ఫాం " ఆనుకుని ఉంది. అరళం అభయారణ్యం ముళకున్ను పంచాయితీలో ఉంది. ముళకున్ను పర్యాటకేంద్రంగా ఉంది.

ఉన్నత శిఖరంసవరించు

జిల్లా ప్రాంతం సముద్రమట్టానికి 50 నుండి 1145 మీ వరకు ఉంటుంది. జిల్లాలోని ఎత్తైన శిఖరం కట్టి బెట్టా ఎత్తు సముద్రమట్టానికి 1145 మీ ఎత్తులో ఉంటుంది. ఇది ఉష్ణమండల, అర్ధ సతతహరితారణ్యాలతో నిండి ఉంటుంది. అరళం అభయారణ్యంలో వైవిధ్యమైన వృక్షజాలం, జంతుజాలం ఉంటుంది. జింకల మందలు, ఏనుగులు, అడవి పందులు, దున్నపోతులు ఉంటాయి. చిరుత, అడవిపిల్లి, ఉడుతలు కూడా అరుదుగా కనిపిస్తుంటాయి.

విద్యసవరించు

 
Sir Syed College, Taliparamba

14వ -15వ శతాబ్ధాలలో కోలాతిరి పాలనలో జిల్లాలో 1, 293 పాఠశాలలు, 187 హైస్కూల్స్ ఉన్నాయి. కేరళా మొత్తంలో తాలిపరంబా విద్యాకేంద్రంగా ప్రసిద్ధిచెందింది. ఆరంభకాలంలోనే ఇది ప్రజలను విద్యావంతులను చేసి, చైతన్యపరచి, సాంస్కృతికంగా అభివృద్ధి పరచడంలో విజయం సాధించింది. ఆరంభకాలంలో ఎళుతచ్చన్ ఆధ్వర్యంలో ఎలుత్తు పళ్ళి (గ్రామ పాఠశాల) నిర్వహించబడ్డాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రాథమిక విద్యను నేర్పించే వాడు. ఇక్కడ శిక్షణపొందిన తరువాత విద్యార్థులు ఆయుధాలను ప్రయోగించడం, జిమ్నాస్టిక్స్ శిక్షణకొరకు కళరి పాఠశాలలకు పంపబడ్డారు. తరువాత వారు చాక్కగా శిక్షణ పొందిన ఉపాద్యాయులవద్ద సంస్కృతం నేర్చుకోవడానికి వేదపాఠశాలకు పంపబడేవారు. కళరికి, వేద పాఠశాలలకు ఈ జిల్లా ప్రసిద్ధి చెందింది. కళరిపయట్రు కళలకు ఈ జిల్లా ప్రత్యేకత సంతరించుకుంది.

పశ్చిమదేశాల విద్యావిధానంసవరించు

16వ శతాబ్దం మద్యకాలం నుండి జిల్లాలో పాశ్చాత్యవిద్య ప్రవేశించింది. 1856 మార్చి 1న స్థాపించిన " బాసిల్ జర్మన్ మిడిల్ స్కూల్ " జిల్లాలో మొదటి పాశ్చాత్య పాఠశాలగా గుర్తించబడింది. తలస్సేరి వద్ద ఉన్న " బ్రెన్నెన్ స్కూల్ " స్థాపించబడింది. 1862లో మిస్టర్ బ్రెన్నెన్ (మాస్టర్ అటెండెంట్ ఆఫ్ తలస్సేరి " ఇచ్చిన డొనేషన్‌తో ఈ పాఠశాల స్థాపించబడింది.

కన్నౌర్ విశ్వవిద్యాలయంసవరించు

1996 కన్నౌర్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. పయ్యనూర్ వద్ద 1999 లో పరియం మెడికల్ కాలేజ్ , 2006లో కన్నౌర్ మెడికల్ కాలేజ్ 500 పడకల సౌకర్యంతో " సూపర్ స్పెషల్ హాస్పిటల్ " స్థాపించబడింది.

కాలేజీలుసవరించు

 • ఆర్ట్స్ అండ్ సైంస్ కాలేజ్ : గవర్నమెంట్ బ్రెన్ కాలేజ్, ఎస్. ఎన్. కాలేజ్ కన్నౌర్, పయ్యనూర్ కాలేజ్, సర్ సయద్ కాలేజ్, తాలిపరంబా, నిర్మలగిరి కాలేజ్ కుతుపరంబా, మహాత్మాగాంధి కాలేజ్, ఇరిట్టీ.
 • ఇంజనీరింగ్ కాలేజ్ : గవర్నమెంటు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (కన్నౌర్), మలబార్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంజరకండీ. [10] కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (తలస్సేరి), విమల్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ (చంపేరి), శ్రీ నారాయణ గురు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (పయ్యనూర్).
 • కన్నూర్ జిల్లాలోని ధర్మశాల వద్ద 13వ " సెంటర్ ఫర్ నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ " కి ఆతిథ్యం ఇచ్చింది. పయ్యనూరులో ప్రఖ్యాతిగాంచిన " కాలడి శంకారాచార్య సంస్క్రీట్ యూనివర్శిటీ " రీజనల్ సెంటర్ స్థాపించబడింది.

క్రీడలుసవరించు

జిల్లాలో అంతర్జాతీయంగా క్రీడారంగంలో గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారు. స్వాతంత్రానికి ముందుగా సైనికకేంద్రాలలో ఉన్న ఆంగ్లేయులు హాకీ, క్రికెట్, ఫుట్ బాల్ మొదలైన క్రీడలను ప్రవేశ్పెట్టారు. ఫోర్ట్ మైదానం, పోలీస్ మైదానం యువకులకు క్రీడలలో శిక్షణపొందడానికి విస్తారమైన అవకాశాలు జల్పించాయి. ఆకాలంలోనే సి. డి. ఆర్. ఇ. ఫుట్ బాల్ టీం, హాకీటీం ఏర్పాటుచేయబడ్డాయి. అదే సమయంలో కళరిపయట్రు మొదలైన సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ కళలు కూడా జిల్లాలో సుసంపన్నంగా ఉన్నాయి.

స్వతత్రం తరువాతసవరించు

స్వతంత్రం తరువాత ఫుట్ బాల్ క్లబ్ జిల్లా అంతటా క్రీడాస్పూర్తి కలిగించడంలో విజయం సాధించింది. జిల్లాలో కన్ననోర్ స్పిరిటెడ్ యూత్స్, లక్కీ స్టార్ కన్ననోర్, ది బ్రదర్స్ క్లబ్ కన్ననోర్, జింఖనా క్లబ్ కన్ననోర్ ప్రాబల్యత కలిగి ఉన్నాయి. జిల్లాలో గుర్తింపు పొందిన డీ. క్రజ్, సోమన్, దాసన్, వి. పి. సత్యన్, గోల్‌కీపర్ ముస్తాఫా మొదలైన క్రీడాకారులు ఉన్నారు. శ్రీ నారాయణా కాలేజ్(తొట్టడా) క్రీడాకారుల నర్సరీగా భావించబడుతుంది.

దేవానంద్సవరించు

వీరిలో కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయిలో బి. దేవానంద్ కేఫ్టాన్ స్థానానికి ఎదిగాడు. దేవానంద్ తరువాత ఇండియన్ యూత్ టీం తరఫున బ్యాంకాక్‌లో క్రీడలలలో పాల్గొన్నాడు. తరువాత దేవానందును టాటా ఫుట్ బాల్ టీంలో (ముంబయి]] ఆడాడానికి ఎన్నికచేయబడ్డాడు.

ఇతర క్రీడాకారులుసవరించు

జిల్లాలో క్రీడలలో రాణించిన క్రీడాకారులలో కేరళకు చెందిన మణి కేప్టన్ షిప్‌లో టీం " సంతోష్ కప్ " సాధించింది. డెంసన్ దేవదాస్ " స్పోర్టింగ్ క్లబ్ డీ గోవా " లీగ్, ఢిల్లీ డైనమోస్ (ఐ. ఎస్. ఎల్) తరఫున క్రీడలలో పాల్గొటున్నాడు. సి. కె. వినీత్ బెంగుళూరు ఎఫ్. సి తరఫున ఐ- లీగ్‌లో కన్నూర్ నుండి స్ట్రైకర్‌గా పాల్గొంటున్నాడు. వినీత్ కేరళా బ్లాస్టర్స్ టీం తరఫున ఇండియన్ సూపర్ లీగ్‌ క్రీడలలో పల్గొన్నాడు. కేరళ ఫుట్ బాల్‌కు ఒకప్పుడు కన్నూర్ మక్కాగా భావించబడింది.

జిమ్మీ జార్జ్సవరించు

జిమ్మీ జార్జ్ వెటరన్ వాలీబాల్ క్రీడాకారుడు. కణ్ణుర్ జిల్లాలో పుట్టి పెరిగి " ఇటాలియన్ క్లబ్ " తరఫున క్రీడలలో పాల్గొని ప్రపంచంలోని 10 మంది స్టైకర్లలో ఒకడుగా ఎన్నిక చేయబడ్డాడు.

హాకీసవరించు

కన్నూర్, తలస్సేరిల నుండి మిలటరీ టీ తరఫున పలు హాకీ పోటీలలో పాల్గొన్నారు. క్రికెట్, బ్యాడ్‌మింటెన్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, రెస్ట్లింగ్, వాలీబాల్ మొదలైన క్రీడలు గ్రామీణ, నగర ప్రాంతాలలో ఆదరణ కలిగి ఉన్నాయి. గ్రామీణప్రాంతంలో యువకులు వాలీబాల్ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. కన్నూరుకు చెందిన మునుపటి ఇండియన్ హాకీ గోల్‌కీపర్ " మాన్యుయల్ ఫ్రెడరిక్ " కేరళా తరఫున క్రికెట్, హాకీ క్రీడలలో పాల్గొన్నాడు.

శిక్షణాలయాలుసవరించు

1976 లో పాఠశాలలలో క్రీడావిభాగాలు ఆరంభం అయ్యాయి. ఒక విభాగం కన్నూర్ జిల్లాలో కూడా ఆరంభించబడింది. క్రీడావిభాగాలు ప్రభుత్వ హైయ్యర్ సెకండరీ స్కూల్‌తో (కన్నూర్) అనుసంధానితమై ఉంది. కన్నూర్ జిల్లా పి. టి. ఉషా, ఎం. డి. వలసమ్మా మొదలైన అథ్లెట్లను తయారుచేసింది. లీలమ్మా థోమస్, మోలీ బెనెడిక్ట్ మొదలైన బ్రీడాకారిణులు బ్యాడ్‌మింటన్‌లో రాణించారు. అనితారత్నం, ఆనందవల్లి వాలీబాల్‌లో గుర్తింపు పొందారు. ఎ. డి. వలసమ్మా, మెర్సీ మాథ్యూలకు వేదికగా సహకరించింది. జిల్లాకు చెందిన బి. కె. బాలచంద్రన్, వి. పి. సత్యన్, డీ. క్రజ్, రాజన్, రమణన్, సుగునన్, సి. ఎం. చిదానందన్, బి. దేవానంద్, జార్జి మొదలైన క్రీడాకారులు ఫుట్ బాల్ లోను, ఒలింపియన్ మాన్యుయల్ ఫెడరిక్ (హాకీ) లోనూ పాల్గొన్నారు. క్రికెట్ క్రీడాకారులు వెస్ట్‌లైన్, లెస్లీ ఫోర్ట్ మైదానంలో శిక్షణ పొందారు.

బాడ్మింటన్సవరించు

" సౌత్ ఇండియన్ బ్యాడ్ మింటన్ " తరఫున టి. కె. రామక్రిష్ణన్, కుమరన్ పాల్గొన్న కారణంగా కన్నూర్ ప్రత్యేకత సంతరించుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఎ. ఎం. భరతన్ (ఎర్లీ ఫిఫ్టీస్) చరిత్ర సృష్టించాడు. కన్నూర్‌కు చెందిన నెల్లియరీ క్రిష్ణన్ నాయర్ 1951 లో నిర్వహించబడిన ఆసియన్ క్రీడలలో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొన్న మొదటి మలయాళీగా గుర్తింపు పొందాడు. అరియబంధు, తికండీ జిమ్నాసియం, పోతేరి జిమ్నాసియం, కణ్ణనోర్ బార్బెల్ క్లబ్ పురాతనకాలంలో వెయిట్ లిఫ్టింగ్, రెస్ట్‌లింగ్, బాక్సింగ్, బాడీబిల్డింగ్ కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

క్రికెట్సవరించు

క్రికెట్ క్రీడ మొదటిసారిగా కణ్ణుర్‌లో ఆరంభమైందని విశ్వసించబడుతుంది. యునైటెడ్ కింగ్డం ఇది ఆరంభించింది. అందువలన భారతదేశంలో క్రికెట్ జన్మస్థలం కన్నూర్ జిల్లా అని భావిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకు ముందు జిల్లా క్రికెట్ అసోసియేషన్ 200 వ యానివర్సరీ జరిపుకుంది. ఇక్కడ నిర్వహించబడిన ఉత్సవానికి ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు " దిలీప్ వెంగ్‌సర్కార్ " పాల్గొన్నాడు.

ఆరాధనా ప్రదేశాలుసవరించు

కన్నూర్ జిల్లాలో పెద్దసంఖ్యలో ఆలయాలు, చర్చీలు, మసీదులు ఉన్నాయి. వీటిలో " పరాసినిక్కడవు " ఆలయం, ది తలాప్ ఆలయం, కొట్టియూర్ ఆలయం ప్రఖ్యాతి చెందాయి. చర్చిలలో బుర్నస్సేరి, తాలిపరంబా, తలస్సేరి చర్చిలు ప్రాబల్యత కలిగి ఉన్నాయి. ఆయిక్కర తాలిపరంబా, తలస్సేరిలో ఉన్న మసీదులు అత్యత విశాలమైనదిగా గుర్తించబడుతుంది.

ప్రముఖులుసవరించు

 • పళసి రాజా - ప్రస్తుత కన్నూర్ ప్రాంతాన్ని పాలించిన రాజు.
 • ఎ. కె. గోపాలన్ - రాజకీయవాది, కమ్యూనిస్ట్ నాయకుడు, లోక్ సభ మొదటి ప్రతిపక్షనాయకుడు.
 • ఎ. కె. నయనార్- గతంలో 3 మార్లు కేరళ ముఖ్యమంత్రి పదవి వహించాడు.
 • కె. కరుణాకరన్ - గతంలో కేరళ ముఖ్యమంత్రి పదవి వహించాడు. కాంగ్రెస్ నాయకుడు.
 • ఇ. అహ్మద్ - గత రాష్ట్ర రైల్వే మంత్రి.
 • కండపల్లి రామచంద్రన్ - పోర్ట్ ఆఫ్ కేరళ మంత్రి.
 • కండనపల్లి రామచంద్రన్-
 • కావ్యామాధవన్- సినిమా నటి.
 • కైతప్రం దామోదరన్ నంబూద్రి- లిరిక్ రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు, మాటలరచయిత, కర్నాటక గాయకుడు.
 • కె. పి. పి. నంబియార్. - పారిశ్రామిక మంత్రి.
 • ఎం. వి. రాఘవన్ - గత మంత్రి
 • పి. కె. శ్రీమతి- ఎం. పి. -
 • పినరాయి విజయన్ - గత సి. పి. ఎం. జనరల్ సెక్రెటరీ, కేరళ ముఖ్యమంత్రి.

చలన చిత్ర కళాకారులుసవరించు

 • శ్రీనివాసన్ - నటుడు.
 • ఎం. ఎన్. నంబియార్. - నటుడు.
 • షమ్నా కాసిం - నటుడు.
 • వినీత్ శ్రీనివాసన్ - నటుడు.
 • ధ్యాన్ శ్రీనివాసన్ - నటుడు.
 • వినీత్ కుమార్- నటుడు.
 • వినీత్- నటుడు.
 • గీతూ మోహన్ దాస్- నటుడు.
 • నివేద్ థోమస్ - నటుడు.
 • శ్రుతి లక్ష్మీ- నటుడు.
 • మంతా మోహందాస్ - నటుడు.
 • సనూప్ సంతోష్ - నటుడు.
 • సంవృతా సునీల్ - నటుడు.
 • మంజు వారియర్ - నటి
 • సలీం - అహమద్ - చిత్రదర్శకుడు, చిత్ర నిర్మాత, మాటల రచయిత.
 • కన్నూర్ రాజన్ - సంగీత దర్శకుడు
 • కె. రాఘవన్ - సంగీత దర్శకుడు.

రచయితలుసవరించు

 • సుకుమార్ అళికోడే - రచయిత.
 • సంజయన్ - రచయిత.
 • పద్మనాభన్ - రచయిత

క్రీడాకారులుసవరించు

 • వి. పి. సత్యన్- ఫుట్ బాల్ ప్లేయర్.
 • జిమ్మీ జార్జ్ - వాలీ బాల్ ప్లేయర్.
 • తిను లుక్కా - అథ్లెట్.
 • మూర్కొత్ రామున్ని - ఫైటర్ పైలట్
 • సి. పి. కృష్ణన్ నాయర్ - లీలా గ్రూప్ హోటెల్ వ్యవస్థాపకుడు.
 • రోనాల్డ్ లింస్డేల్ పెరియరా - అడ్మిరల్
 • మట్టనూర్ శంకరన్ కుట్టి - పర్క్యూషనిస్ట్.
 • సి. కె. లక్ష్మణన్ - మొదటి మలయాళీ ఒలింపియన్.

చలన చిత్రాలుసవరించు

 • తట్టాతిన్ మరయదు.
 • ఒరు వడక్కన్ మరయదు.
 • మలర్వాడి ఆర్ట్స్ క్లబ్
 • వీండుం కన్నూర్.
 • మకల్కు
 • బల్రాం వర్సెస్ తారాదాస్
 • కన్నూర్ డీలక్స్
 • ఇరువట్టం మనవాట్టి
 • వెల్లిమూంగ
 • అయల్ కథ ఎళుదుకయను

వెలుపలి లింకులుసవరించు

మూలాల జాబితాసవరించు

 1. "Arakkal royal family". Archived from the original on 2012-06-05. Retrieved 2016-12-30.
 2. "Pazhassi Raja Museum and Art Gallery, Kozhikode - Kerala Tourism". Archived from the original on 15 నవంబర్ 2013. Retrieved 5 April 2015.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada 2,700,551
 6. 6.0 6.1 Indian Census
 7. [1]
 8. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2010-11-28. Retrieved 2014-06-30.
 9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-25. Retrieved 2014-06-30.
 10. "Malabar Institute of Technology Anjrakandy". Archived from the original on 18 మే 2015. Retrieved 15 May 2015.