కపిల రాంకుమార్
ఖమ్మం కవులచే ఖమ్మం శ్రీశ్రీ అని పిలిపించుకుంటున్న కపిల రాంకుమార్ తెలుగు కవులలో ఒకరు, రంగస్థల నటుడు. అంతర్జాలంలో, కవిసంగమం [1] లో చురుగ్గా కవితలను రాస్తున్నారు.
కపిల రాంకుమార్ | |
---|---|
జననం | రాంకుమార్ 1952 జనవరి 31 పెంట్లం గ్రామం, చంద్రుగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ |
వృత్తి | కవి |
మతం | హిందూ |
భార్య / భర్త | జానకి |
పిల్లలు | స్వాతి, రామకృష్ణ కాశ్యప్ |
తండ్రి | శ్రీరామమూర్తి |
తల్లి | వెంకట విజయలక్ష్మి |
జననం
మార్చుఈయన వెంకట విజయలక్ష్మి, శ్రీరామమూర్తి దంపతులకు జనవరి 31, 1952 న పెంట్లం గ్రామం, చంద్రుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
మార్చుప్రస్తుత నివాసం ఖమ్మం, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి
భార్య - పిల్లలు
మార్చుభార్య: జానకి, కూతురు: స్వాతి (వివాహిత), కుమారుడు: కపిల రామకృష్ణ కాశ్యప్
నట ప్రస్థానం
మార్చు- గుండెలు మార్చబడును (పాత్ర: మల్లు) - రచన: జంధ్యాల
- అతిథి దేవుళ్ళొస్తున్నారు (పాత్ర: కవి) - రచన: ఆదివుష్ణు
- దండోరాలో జమీందారు (పాత్ర: విలన్) - రచన: జేసుదాసు
- పుటుక్కు జరజర డుబుక్కుమే (పాత్ర: చాకలి) - రచన: ఎం.దివాకర్ బాబు
- శిరిడి సాయి టెలిఫిలీంలో మహల్సాపతిగా నటించారు.
ప్రచురితమయిన మొదటి కవిత
మార్చుమొదటి కవిత "అ-రక్షణం" 1973 ప్రజాశక్తి దినపత్రిక నందు ప్రచురితమైంది.
కవితల జాబితా
మార్చు- నగారా
- కొత్తగాలి
- జనపద్యం
కవితలే కాక సాహిత్య వ్యాసాలు, నాటికలు సుమారు 5 దాకా (అన్నీ అముద్రితాలు)
ప్రచురితమయిన పుస్తకాల జాబితా
మార్చు- నగారా(2004) ( చేతిరాత జెరాక్స్)
బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు
మార్చుబహుమానాలు
- ఆంధ్రప్రదేశ్‌ఆరోగ్య & వైద్య శాఖా వారిచే పాటకు బహుమతి
- ఆంధ్రప్రదేశ్‌టైపిస్ట్స్ & స్టెనోగ్రాఫర్స్ అసీసియేషన్, ఖమ్మం వారిచే సన్మానం
- కల్లూరు సాహితీ సాంస్కృతిక సంస్థ వారిచే సన్మానం
- యాక్టివ్ స్వచ్ఛంధ సంస్థ కల్లూరు వారిచే సన్మానం
- జన విజ్ఞాన వేదిక ఖమ్మం వారిచే సన్మానం
గుర్తింపులు
- వివిధ పత్రికలలో, ఆలిండియా రేడియో ఎఫ్.ఎం.కొత్తగూడేం ద్వారా, సుమారుగా గత 25 సంవత్సరాలుగా ఖమ్మంలో జరిగే కవి సమ్మేళనంలో పాల్గొనటం, నిర్వహించటం.
- సాహితీ స్రవంతి - ఖమ్మం జిల్లా శాఖకు 5 సంవత్సరాలు అధ్యక్షుడుగా సాహితీ సేవ.
- విజయవాడ, హైదరాబాదు, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, కాకినాడ, నల్గొండ, వరంగల్, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలలో కవితా గానం చేయటం.
ఇతర కార్యక్రమాలు
మార్చు- ఆడ్మిన్ - కవిసంగమం
- సాహితీ స్రవంతి అధ్యయన వేదిక - ప్రతి నెల మూడవ ఆదివారం నిర్వహణ