కాజ ( మొవ్వ)

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం

కాజ పేరుతో ఇతర వ్యాసాలున్నవి. వాటి లింకుల కోసం కాజ (అయోమయ నివృత్తి) చూడండి.

కాజ
—  రెవెన్యూ గ్రామం  —
కాజ is located in Andhra Pradesh
కాజ
కాజ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′50″N 81°00′14″E / 16.197119°N 81.003925°E / 16.197119; 81.003925
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మంద సుధారాణీ గారు
పిన్ కోడ్ 521 150
ఎస్.టి.డి కోడ్ 08671

కాజ గ్రామం, కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన గ్రామం ఉంది. ఇది మండల కేంద్రమైన మొవ్వ నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 19 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2344 ఇళ్లతో, 7687 జనాభాతో 2484 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3974, ఆడవారి సంఖ్య 3713. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2311 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 69. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589692[1].పిన్ కోడ్: 521150. గ్రామాన్ని ఆనుకొని మంద పాలెం, కళాయి గుంట, మట్ల మాలపల్లి అనే దలిత వాడలు ఉన్నాయి.

సమీప గ్రామాలు మార్చు

ఈ గ్రామానికి సమీపంలో చిట్టూరు, మల్లంపల్లి, పోలవరం, కంచకోడూరు, ఐదుగుళ్ళపల్లి, కోసూరు, గ్రామాలు ఉన్నాయి.

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామంలో ప్రధానంగా రెడ్డి కులస్తులు ఎక్కువుగా ఉన్నారు.వీరు పూర్వం నెల్లూరు నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లు ప్రచారం వాడుకలో ఉంది. ఇంకా ఈ గ్రామంలో బ్రాహ్మణులు, గౌడ్లు, పద్మశాలీలు, నాయీ బ్రాహ్మణులు,లింగబలిజ, ఇతర కులస్తులు ఉన్నారు.

ఈ గ్రామంలో మర్రివాడ సీతమ్మ ఒక శతాధిక వృద్ధురాలు ఉన్నారు. ఈమె 104 సంవత్సరాల వయస్సులో, 2017,జూన్-30న అనారోగ్యంతో కన్నుమూసినారు. ఈమె ఇటీవలి వరకు తన పనులు తానే చేసుకునేవారు. చివరి వారం రోజులు మాత్రం అనారొగ్యంతో బాధపడినారు. [10]

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

సా.శ. 1900 ప్రాంతంలో కాజమ్మ అను గ్రామ దేవత విగ్రహం ఇక్కడి పొలంలో దొరుకుటచే ఆ దేవత పేరు మీద ఈ గ్రామంనకు కాజ అను పేరు వచ్చినది అను ప్రచారం వాడుకలో ఉంది.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి మొవ్వలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మొవ్వలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మచిలీపట్నంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

కాజలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలోం ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

కాజలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.

సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

కాజలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 271 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 22 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 40 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 21 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2128 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 2128 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

కాజలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.పూర్ణ చెరువు ద్వారా ప్రధానంగా ఈ గ్రామానికి తాగునీటి సౌకర్యం అందించబడుతుంది. నాగుల చెరువు:- పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి పనులను, 2015,మే నెల-16వ తేదీనాడు, నీరు-చెట్టు పథకం క్రింద ప్రారంభించారు.

  • కాలువలు: 2128 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

కాజలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, మినుము

గ్రామ ప్రముఖులు మార్చు

గ్రామానికి రవాణా సౌకర్యం మార్చు

మచిలీపట్టణం-మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్:, మచిలీపట్టణం (బందరు) 15 కి.మీ, విమానాశ్రయం విజయవాడ 58 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు మార్చు

శ్రీ పేకేటి నరసారెడ్డి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-, ప్రాథమిక పాఠశాల . ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా వైఙానిక ప్రదర్శనలో, ఈ పాఠశాల విద్యార్థిని ధనికొండ భాను, వ్యర్ధపు వేడి నుండి విద్యుత్తు (Electricity from wastw heat) అను అంశాన్ని ప్రదర్శించగా, అది రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. [4]

మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవాన్ని, 2017, ఫిబ్రవరి-18వతేదీ శనివారం రాత్రి, పాఠశాల విద్యా కుటుంబం, ఘనంగా నిర్వహించింది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు మార్చు

రక్షిత మంచినీటి పథకం మార్చు

గ్రామంలోని కంచర చెరువు వద్ద, ఈ పథకాన్ని, 1993 లో ఏర్పాటుచేసారు. కానీ ఇప్పుడు ఈ పథకం నిరుపయోగమైనది.

బ్యాంకులు మార్చు

ఆంధ్రా బ్యాంక్.

గ్రామ పంచాయతీ మార్చు

2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో మంద సుధారాణి, సర్పంచిగా ఎన్నికైంది.

గ్రామంలో దర్శించదగిన దేవాలయాలు మార్చు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ రాజగోపాలస్వామి ఆలయం - ఈ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను 2017,మార్చి-2 నుండి 5 వరకు నిర్వహించారు. లోక కల్యాణార్ధం కాజ గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ రాజగోపాలస్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవారు, ఆంజనేయస్వామి, జయ, విజయ ద్వారపాలకుల విగ్రహ పునఃప్రతిష్ఠ, ఆలయ శిఖర, జీవధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభాన్ని శ్రీ పురిటిపాటి వెంకటకృష్ణారెడ్డి దంపతులు అందించారు. గ్రానైట్‌ను శ్రీ పురిటిపాటి గంగాధరరెడ్డి దంపతులు అందించారు. మార్చి-5వతేదీ ఆదివారం ఉదయం యంత్రస్థాపన, అనంతరం ఉదయం 8-05 కి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [6]&[7]

ఈ ఆలయంలోని శ్రీ ఆంజనేయస్వామివారికి, 2017, జూన్-19న, గ్రామానికి చెందిన కోదాటి గోపాలకృష్ణయ్య కుమారుడు సత్యప్రసాద్, శ్రీలక్ష్మి దంపతులు, అరవైవేల రూపాయల విలువైన వెండి పాదాలు, కవాలు సమర్పించారు.

శ్రీ రామాలయం

శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయం

శ్రీ భావనాఋషి స్వామి ఆలయం:ప్రతి సంవత్సరం మార్చి 14 న శ్రీ భావనాఋషి స్వామి వారి కల్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు.

శ్రీ కాజమ్మ (గ్రామ దేవత) ఆలయం

గ్రామ దేవత శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు న శ్రీ నాంచారమ్మ అమ్మవారి సంబరం అంగరంగ వైభవంగా జరుపుతారు.

శివాలయం - కాజ గ్రామంలో ఈ ఆలయం, రెడ్డి కులస్తులచే నిర్మించ బడింది.

వేణుగోపాల స్వామి ఆలయం,

కోదండ రామాలయం,

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, చేనేత దుస్తులు

ఆదర్శ రైతు పేకేటి సీతారామిరెడ్డి మార్చు

  • ఈ గ్రామానికి చెందిన, ఐ.టి.ఐ.వరకు చదివిన రైతు శ్రీ పేకేటి సీతారామిరెడ్డి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడకుండా, సుభాష్ పాలేకర్ విధానంతో, పెట్టుబడి లేని, ప్రకృతి విధాన వ్యవసాయం చేసుకుంటూ, భూమిలోని సూక్ష్మజీవులను బతికించుకొని నేలతల్లినీ, గోమాతనూ నమ్ముకుని ప్రకృతి విధాన వ్యవసాయం చేస్తూ అధికదిగుబడులు సాధించుచున్నారు. ఈ రకంగా వీరు మొత్తం 40 ఎకరాలు వ్యవసాయంచేస్తూ, పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు 2011లో ఉత్తమరైతుగా మంత్రి శ్రీ పార్ధసారథి గారినుండి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సులో పాల్గొన్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించుచూ, ఆ విధానాలలో సాగుచేయుచున్న సర్టిఫికేషన్ రైతులచే, రాష్ట్రస్థాయిలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ మేళాలను నాలుగు సంవత్సరాలుగా నిర్వహించుచున్నది. శ్రీ సీతారామిరెడ్డి, ఈ సంవత్సరం కడపలో నిర్వహించిన మేళాలో పాల్గొని, మినుములు, పెసలు, అలసందలు, ఆవాలు, బియ్యం విక్రయించారు. గత సంవత్సరం గన్నవరం మరియూ విజయవాడలోని సింగ్ నగరులలో నిర్వహించిన మేళాలో వీరు ఏర్పాటుచేసిన స్టాళ్ళను, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు స్వయంగా సందర్శించి, వీరిని ప్రశంసించటం విశేషం. మచిలీపట్నం, హైదరాబాదు లలో గూడా వీరు తన ఉత్పత్తులను ప్రదర్శించారు.

గణాంకాలు మార్చు

2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7687. ఇందులో పురుషుల సంఖ్య 3974, స్త్రీల సంఖ్య 3,713, గ్రామంలో నివాసగృహాలు 2344 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2484 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు మార్చు