కారుమూరి సీతారామయ్య

కారుమూరి సీతారామయ్య ప్రముఖ రంగస్థల నటులు.

కారుమూరి సీతారామయ్య

సీతారామయ్య గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. చీరాలలో కాలేజీ విద్య పూర్తిచేశారు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

1952లో హైస్కూలు చదువులోనే వాపస్ నాటకంలో సైన్స్ లెక్చరర్ పాత్ర ధరించారు. పరుచూరు అభ్యుదయ నాటక సమితి, రాఘవ ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపక అధ్యక్షులైన డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారి 'కళావని' సంస్థలో సభ్యులుగా చేరి నాటకరంగంలో కృషిచేశారు. 1956లో విజయవాడలో జరిగిన శిక్షణ శిబిరంలో శిక్షణ పొంది నటనలో మెరుగులు దిద్దుకున్నారు. తెనాలిలో జనతా ఆర్ట్ థియేటర్ వారి భయం నాటకంలో ప్రొపైటర్ పాత్ర, రైలుప్రమాదంలో రాజు పాత్ర, ఉలిపికట్టెలో రంగనాధం పాత్ర, దోనేపూడి రాజారావు ధర్మకాటా నాటకంలో యం.యల్.ఎ. భర్త పాత్రలు పోషించారు. 50-60 సార్లు నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 1993, 1995 సంవత్సరాలలో ఒరిస్సా లోని కటక్లో జరిగిన బహుభాషానాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర కళాపరిషత్ (తిరుపతి), 1963లో లలిత కళానికేతన్ (రాజమండ్రి), 1970లో నెల్లూరు నెస్థావారు నిర్వహించిన నాటక పోటీలలో పాల్గొన్నారు.

నటించిన నాటకాలు - పాత్రలు

మార్చు
  1. వాపస్ - లెక్చరర్
  2. భయం - ప్రొపైటర్
  3. రైలుప్రమాదం - రాజు
  4. ఉలిపికట్టె - రంగనాధం
  5. ధర్మకాటా - యం.యల్.ఎ. భర్త

పొందిన బహుమతులు

మార్చు
  • 1967లో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కొల్లూరు వారు ప్రదర్శించిన లేపాక్షి ప్రత్యేక నాటక ప్రదర్శనలో పాల్గొని ఉత్తమ నటనకు బహుమతి పొందారు.
  • పొన్నూరు వారు ప్రదర్శించిన అక్షింతలు నాటికలో జడ్డి పాత్ర పోషించి ప్రత్యేక బహుమతి సంపాదించారు.
  • తెనాలిలో జరిగిన నాటకపోటీలలో ఉలిపికట్టె నాటికలో రంగనాధం పాత్ర ధరించి ఉత్తమ హాస్యనటనకు బహుమతి స్వీకరించారు.
  • శ్రీ వెంకటేశ్వర కళాసమితి కొల్లూరు వారు ప్రదర్శించిన కళాకార్ నాటికలో పాల్గొని "తాత" పాత్రకు ఉత్తమ నటన బహుమతి పొందారు.

సన్మానాలు - బిరుదులు

మార్చు
  • 1995లో ఒరిస్సా ముఖ్యమంత్రి జె.బి. పట్నాయక్ గారిచే "ఎమినెంట్ థియేటర్ పర్సనాలిటి'గా సన్మానం
  • సాంఘిక నాటక కృషీవలుడు (బిరుదు) కళాసదస్సు చిలకలూరిపేట వారిచే ప్రదానం
  • సింగరాజు నాగభూషణం మెమోరియల్ కళాపరిషత్ (బాపట్ల), టి. కృష్ణ మెమోరియల్ కళాపరిషత్ (పాలెం), ఉషోదయ కళాపరిషత్ (సత్తెనపల్లి), కళాంజలి కళాపరిషత్ ( పరుచూరు), కమల్ హాసన్ కళాపరిషత్ (చిలకలూరిపేట) వారి సన్మానాలు

మూలాలు

మార్చు
  • కారుమూరి సీతారామయ్య, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 289.