సుచిత్ర వర్ధమాన చలనచిత్ర నేపథ్యగాయని. ఈమె హైదరాబాదులో జన్మించింది. సెయింట్ ఆన్స్ స్కూలులో చదివింది. తరువాత ఈమె కేరళలో విభిన్న ప్రదేశాలలో పెరిగింది. ఈమె పాఠశాల, కళాశాల చదువు కేరళలోనే సాగింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఎం.బి.ఎ.పూర్తి చేసింది. వివాహం తరువాత చెన్నైలో స్థిరపడింది[1]. ఈమె భర్త కార్తీక్ కుమార్ తమిళ సినిమా నటుడు, కమెడియన్.

సుచిత్రా కార్తీక్ కుమార్
సుచిత్ర
జననం
సుచిత్రా రామదురై

(1982-08-14) 1982 ఆగస్టు 14 (వయసు 42)
వృత్తినేపథ్య గాయని, నటి, రేడియో జాకీ, కాలమిస్ట్
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
ఎత్తు5'5
జీవిత భాగస్వామికార్తీక్ కుమార్
వెబ్‌సైటుఅధికారిక జాలస్థలి

వృత్తి

మార్చు

ఈమె మొదట ప్రకటనల రంగంలో ప్రవేశించింది. కొంత కాలం ఒక ప్రముఖ ఐ.టి.సంస్థలో విధులు నిర్వర్తించింది. ఆ తరువాత రేడియోమిర్చీలో రేడియో జాకీగా పనిచేసింది. అక్కడ స్క్రిప్ట్ రైటర్‌గా కూడా బాధ్యతలు నెరవేర్చింది. 'కాఫీ విత్ సుచీ' పేరుతో ఈమె నిర్వహించిన టాక్ షో ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఈమె సినిమా పాటలు పాడే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె తమిళ, మలయాళ, తెలుగు సినిమాలలో వందకు పైగా పాటలను పాడింది. కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించింది.

తెలుగు సినిమా పాటలు

మార్చు

ఈమె పాడిన పాటలలో కొన్ని పాటలజాబితా:

సంవత్సరం సినిమా పేరు పాట సంగీతం సాహిత్యం సహ గాయకులు
2004 ఘర్షణ చెలియ..చెలియ..చెలియ..చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా హారిస్ జయరాజ్ కె.కె.
2006 పోకిరి డోలే డోలే దిల్ జర జరా మణిశర్మ రంజిత్
2006 పోకిరి ఇప్పటికింకా నావయస్సు నిండా పదహారే మణిశర్మ కార్తీక్
2006 రణం చెలి జాబిలి గిల్లిపోకుమా ..చలి వెన్నెల చల్లిపోకుమా మణిశర్మ కందికొండ నవీన్
2006 హ్యాపీ చిరుత కన్నులవాడే చిలిపి చిన్నోడే యువన్ శంకర్ రాజా పోతుల రవికిరణ్ జస్సీ గిఫ్ట్
2007 చిరుత మారో మారో మారోరే మణిశర్మ భాస్కరభట్ల రాహుల్ నంబియార్
2009 మల్లన్న ఎక్స్‌క్యూజ్ మీ మిష్టర్ మల్లన్న కాఫీ తాగుదాం ఆవోనా దేవీశ్రీ ప్రసాద్ దేవీశ్రీ ప్రసాద్, విక్రం
2010 అదుర్స్ పిల్లా నా వల్ల కాదు పిల్లా నా వల్ల కాదు దేవీశ్రీ ప్రసాద్ చంద్రబోస్ మికా సింగ్
2010 కొమరం పులి ఓ చెకుముకీ ఓ చెకుముకీ నువ్వు చేరగ సరసకే ఎ.ఆర్.రహమాన్ చంద్రబోస్ జావేద్ అలీ
2010 బృందావనం నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా తమన్ అనంత్ శ్రీరామ్ కార్తీక్
2011 కందిరీగ చంపకమాలా నను చంపకె బాలా తమన్ రామజోగయ్య శాస్త్రి కార్తీక్
2011 కందిరీగ హేయ్ ఏంజలీనా ఏంజలీనా హౌ డు యూ డూ హాలివుడ్ సోనా తమన్ రామజోగయ్య శాస్త్రి రానీనా రెడ్డి, రంజిత్
2011 శక్తి సుర్రో సుర్రన్నాదే సుర్రన్నా యమగున్నాదే సూదంటు కళ్ళోడే సూపుల్తో గిల్లాడే మణిశర్మ రామజోగయ్య శాస్త్రి జావేద్ అలీ
2012 దేవుడు చేసిన మనుషులు డిస్టర్బ్ చేత్తన్నాడే రఘు కుంచే భాస్కరభట్ల
2012 నువ్వా నేనా అయోమయం భీమ్స్ సెసిరోలియో కృష్ణ చైతన్య
2012 బిజినెస్ మేన్ సారొస్తారొస్తారా దావత్తే ఇస్తారా తమన్ కైలాష్ రిషి తమన్
2013 నాయక్ హే యవారమంటే ఏలూరే అరె నవ్వారు మంచం నెల్లూరే తమన్ సాహితి జస్ప్రీత్ జాస్
2013 మిర్చి ఆరడుగుల అందగాడు నన్ను బార్బీ గార్ల్ అన్నాడు దేవీశ్రీ ప్రసాద్ రామజోగయ్య శాస్త్రి జస్ప్రీత్ జాస్
2013 బాద్‍షా యూ ఆర్ మై డైమండ్ గర్ల్ తమన్ రామజోగయ్య శాస్త్రి శింబు
2015 శ్రీమంతుడు జత కలిసే జత కలిసే జగములు రెండూ జత కలిసే దేవీశ్రీ ప్రసాద్ రామజోగయ్య శాస్త్రి సాగర్

అవార్డులు

మార్చు
  • బిగ్ తెలుగు మ్యూజిక్ అవార్డ్ - బిజినెస్ మేన్ సినిమాలోని సారొస్తారా పాటకు బెస్ట్ సింగర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
  • 2013 ఫిలిం ఫేర్ అవార్డ్ - బెస్ట్ ప్లేబాక్ సింగర్ అవార్డు - బిజినెస్ మేన్ సినిమాలోని సారొస్తారా పాటకు.
  • 2వ సీమా (SIIMA) అవార్డ్ - బెస్ట్ ఫిమేల్ సింగర్ ఇన్ తెలుగు అవార్డుకు నామినేషన్ - బిజినెస్ మేన్ సినిమాలోని సారొస్తారా పాటకు.

మూలాలు

మార్చు
  1. ఎడిటర్ (12 February 2012). "విలక్షణ గళంతో సారొచ్చారు". ఈనాడు ఆదివారం. Retrieved 13 April 2017.[permanent dead link]