జి. నాగేశ్వరరెడ్డి

భారతీయ సినిమా దర్శకుడు

జి. నాగేశ్వరరెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] ఎస్. వి. కృష్ణారెడ్డి సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన ఈయన 6 టీన్స్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[2]

జి. నాగేశ్వరరెడ్డి
జననం
జి. నాగేశ్వరరెడ్డి
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2001 -

సినిమారంగం

మార్చు

చిన్నతనం నుండి సినిమాలపై ఆసక్తివున్న నాగేశ్వరరెడ్డి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, నంబర్ వన్, ఘటోత్కచుడు, వజ్రం, మావిచిగురు, సంప్రదాయం వంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 6 టీన్స్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, హాస్య ప్రధాన సినిమాలకు దర్శకత్వం వహించాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు

మార్చు
క్రమసంఖ్య సంవత్సరం చిత్రపేరు నటవర్గం
1 2001 6 టీన్స్ రోహిత్, రుతిక, సంతోష్ పవన్
2 2001 ఇదే నా మొదటి ప్రేమలేఖ జయరాం, రిమ్మిసేన్
3 2002 గర్ల్‌ఫ్రెండ్ రోహిత్, బబ్లూ, సంతోష్ పవన్
4 2003 ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత
5 2003 నేను సీతామహాలక్ష్మి రోహిత్, శ్రావ్య
6 2005 గుడ్ బోయ్ రోహిత్, నవనీత్ కౌర్
7 2007 సీమ శాస్త్రి అల్లరి నరేష్, ఫర్జానా
8 2009 కాస్కో వైభవ్ రెడ్డి
9 2011 సీమ టపాకాయ్ అల్లరి నరేష్
10 2012 దేనికైనా రేడీ మంచు విష్ణు, హన్సికా మోట్వాని
11 2014 కరెంట్ తీగ మంచు మనోజ్ కుమార్, జగపతి బాబు, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్
12 2016 ఈడోరకం ఆడోరకం[3] మంచు విష్ణు, సోనారిక భాడోరియా, రాజ్ తరుణ్, హెబ్బా పటేల్
13 2016 ఆటాడుకుందాం రా సుశాంత్, సోనం బజ్వా
14 2016 ఇంట్లో దెయ్యం నాకేం భయం[4] అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్ , కృష్ణ జయకుమార్, మౌర్యని
15 2017 ఆచారి అమెరికా యాత్ర[5] మంచు విష్ణు
16 2019 తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సందీప్ కిషన్

మూలాలు

మార్చు
  1. ఈనాడు, సినిమా. "కథలున్నాయి.. దర్శకులున్నారు." Archived from the original on 23 February 2018. Retrieved 22 February 2018.
  2. జీ సినిమాలు (15 December 2016). "జి. నాగేశ్వరరెడ్డి". Archived from the original on 28 డిసెంబరు 2016. Retrieved 22 February 2018.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - తారలతో ముచ్చట్లు (10 April 2016). "నమ్మకంతో వస్తున్నాం.. పొగరుతో కాదు: జి.నాగేశ్వరరెడ్డి". Retrieved 22 February 2018.[permanent dead link]
  4. సాక్షి, సినిమా (4 November 2016). "నరేశ్ కథల ఏటీఎం - దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి". Retrieved 22 February 2018.
  5. ప్రజాశక్తి, సినిమా (20 January 2018). "'అల్లరి మొగుడు' గుర్తుకొస్తుంది - కె. రాఘవేంద్రరావు". Retrieved 22 February 2018.

ఇతర లంకెలు

మార్చు