కె.ఎల్. నరసింహారావు

(కె.ఎల్. నరసింహారావు (రైతుసంఘం నాయకులు) నుండి దారిమార్పు చెందింది)

కె.ఎల్. నరసింహారావు (కొండపల్లి లక్ష్మీ నరసింహారావు) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కమ్యూనిస్టు (రైతుసంఘం) నాయకులు, మాజీ శాసనసభ్యులు.

కొండపల్లి లక్ష్మీ నరసింహారావు
Kondapalli Lakshmi Narasimharao.jpg
జననం1927
బేతంపూడి, టేకులపల్లి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
మరణంమార్చి 16,2011.
ప్రసిద్ధిసీనియర్‌ కమ్యూనిస్టు (రైతుసంఘం) నాయకులు, మాజీ శాసనసభ్యులు.
భార్య / భర్తదుర్గాదేవి
పిల్లలుఉత్తమ్ కుమార్ , పవన్ , సుధ

జననంసవరించు

ఈయన 1927 లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలోని బేతంపూడి గ్రామంలో జన్మించారు.[1] జమీందారీ కుటుంబమైనప్పటికీ దాయాదుల కుట్రల వల్ల చాలా కష్టాలు అనుభవించారు. పదిహేనవ ఏట క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.


రాజకీయ జీవితంసవరించు

జైలు నుంచి విడుదలయ్యాక ఎం.ఎస్‌. రాజలింగం, హయగ్రీవాచారి, కాళోజీ నారాయణరావు వంటి వారి ప్రభావంతో ఆంధ్ర మహాసభ మార్గంలో నడిచారు. భువనగిరి మహాసభలో రావి నారాయణ రెడ్డి, చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి రాంకిషన్‌ రావు, సర్వ దేవ భట్ల రామనాథం తదితరులతో పరిచయమైంది. ఆ కాలంలో వరంగల్‌లో ఆజాంజాహి మిల్లులో కార్మిక సంఘ నిర్మాణంలో రామనాథంతో కలసి పనిచేశారు. రామనాథం ప్రేరణతో 1944లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అదే ఏడాది విజయవాడలో రాజకీయ తరగతులకు హాజరై పుచ్చలపల్లి సుందరయ్యను చూశారు. పుస్తక పఠనం కూడా అప్పుడే బాగా సాగించారు.[1]

ఇల్లెందు తాలూకా ఆంధ్ర మహాసభ కార్యదర్శిగానూ కమ్యూనిస్టు పార్టీ బాధ్యుడుగానూ పనిచేసి.. అక్రమ లెవీ, దోపిడీకి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి నిజాం ప్రభుత్వంలో జైలు శిక్ష అనుభవించారు. వీర తెలంగాణా పోరాటానికి నాందిగా పరిగణించే దొడ్డి కొమరయ్య బలిదానంపై జైల్లో ఉండి అమరజీవివి నీవు కొమరయ్యా అందుకో జోహార్లు కొమరయ్య అన్న పాట రాశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాజకీయ ఆర్గనైజర్‌గా రహస్య కేంద్రాలలో బాధ్యతలు చూసేవారు. బొంబాయి, మద్రాసు వంటి చోట్లకు వెళ్లి ఆయుధాలను కొనుగోలు చేసి, బట్టల వ్యాపారి వేషం వేసుకుని పెద్ద పెద్ద పెట్టెలలో పెట్టుకొని గెరిల్లా దళాలకు చేర్చేవారు.

ఇల్లెందు ప్రాంతంలో జన్నారెడ్డి భూస్వామి ఆధీనంలోని భూమిని పేదలకు పంచారు. 1952 ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుమీద ఇల్లెందు నుంచి పోటీచేసి గెలిచారు. నాటి హైదరాబాదు శాసనసభలో వి.డి.దేశ్‌పాండే నాయకుడు కాగా నరసింహారావు ఉపనాయకుడుగా బాధ్యతలు నిర్వహించారు.

1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడి సుందరయ్య ప్రతిపక్ష నాయకత్వం చేపట్టినప్పుడు కూడా నరసింహారావు ఉప నాయకుడుగా ఉన్నారు. సభలో ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలను కలిపినప్పుడు కమ్యూనిస్టులు చెప్పిన విశాలాంధ్ర పదం గిట్టని సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అన్న పదాన్ని ముందుకు తేవడంలోనూ ఆయన తొలి సూచన చేశారు. 1962లో మూడోసారి ఎంఎల్‌ఏగా గెలిచిన తరుణంలోనే ప్రభుత్వం భావి సిపిఎం నాయకత్వంపై మాత్రమే దాడి చేసినపుడు ఆయన కూడా అరెస్టయ్యారు. సిపిఎం వైపే నిలబడి జిల్లాలో ప్రముఖ శక్తిగా ఎదగడానికి ప్రారంభ దశలో ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. 1967లో ఆఖరి సారి శాసనసభ్యుడైనప్పుడు విశాఖ ఉక్కు సమస్యపై రాజీనామా చేశారు. తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వుడుగా మారింది.

1975లో దేశంలో ఎమర్జన్సీ విధించి హక్కులు కాలరాచినపుడు పార్టీ నాయకత్వం అజ్ఞాత వాసంలోకి వెళ్లారు.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 స్రజాశక్తి. "ఆశయాలకు అంకితమైన ధన్యజీవి కె.ఎల్‌". Retrieved 8 February 2017. Cite news requires |newspaper= (help)