జగన్మోహిని (1978 సినిమా)

ఇది చాలా గొప్ప చిత్రం అప్పట్లో విఠలాచార్య వారు అద్భుతంగా తెరకెక్కించారు

జగన్మోహిని
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం బి.విఠలాచార్య
కథ బి.వి.ఆచార్య
తారాగణం నరసింహరాజు,
ప్రభ,
జయమాలిని,
సావిత్రి,
ధూళిపాళ
పొట్టి వీరయ్య
సంగీతం విజయా కృష్ణమూర్తి
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,
వి.రామకృష్ణ,
జి.ఆనంద్,
వాణీ జయరామ్,
పి.లీల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
కౌసల్య
నృత్యాలు రాజు,
శేషు
గీతరచన సి.నారాయణరెడ్డి, దుత్తలూరి రామారావు
సంభాషణలు జి.కె.మూర్తి,
కర్పూరపు ఆంజనేయులు
ఛాయాగ్రహణం హెచ్.యస్.వేణు
కూర్పు కె.గోవిందస్వామి
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
నిడివి 163 ని.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన బి.విఠలాచార్య ఈ సినిమాను తన స్వంత బ్యానర్‌పై నరసింహ రాజు కథానాయకుడిగా నిర్మించాడు. అప్పటికి కొంతకాలంగా జానపద చిత్రాలు అసలు విడుదల కాలేదు. అందునా నరసింహరాజుకు హీరో ఇమేజి లేదు. కాని ఈ సినిమా మంచి విజయం సాధించింది.

కథాంశం

మార్చు

ఈ సినిమా కథ పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దయ్యాలు, భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది. ఒకపల్లెటూరి అందగాడిని ఒక కామపిశాచి ఆశించి తన వలలోవేసుకొంటుంది. పతివ్రతా శిరోమణి అయిన అతని భార్య తను నమ్మిన దైవాన్ని కొలిచి తన భర్తను మళ్ళీ తనవాడిగా చేసుకొంటుంది. సినిమాలో ఒక కోతి, ఒక పాము చాలా ముఖ్యమైన పాత్రలు వహించాయి.

పాత్రలు-పాత్రధారులు

మార్చు

పాటలు

మార్చు
  • అమ్మ శ్రీ జగదంబ శ్రీశైల భ్రమరాంబ - సావిత్రి
  • కడతావా కడతావా జోడీ పుడుతుంది పుడుతుందీ వేడి - నరసింహరాజు, జయమాలిని
  • చలి... గిలి... సవాల్ మీలో ఎవరైనా - జయమాలిని
  • తందానే... సాగే అలలపైన ఊగే చందమామ - నరసింహరాజు, జయమాలిని
  • నీ మగసిరి గని సరిసరి అందాలు - నరసింహరాజు, జయమాలిని
  • పరమేశ్వరీ... జగదీశ్వరీ... త్రిభువన మాత - ప్రభ
  • రాజా రాజా రాజా నీ కోసం నా రూపం నిగనిగలాడెనులేరా - జయమాలిని
  • శ్రీశైల శిఖరాన చెలువైన ఓయమ్మ మాతల్లి భ్రమరాంబ మము బ్రోవుమమ్మా - ప్రభ

బయటి లింకులు

మార్చు