కొమ్మూరు (కాకుమాను)

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని గ్రామం

కొమ్మూరు, గుంటూరు జిల్లా, కాకుమాను మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కాకుమాను నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బాపట్ల నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1862 ఇళ్లతో, 6594 జనాభాతో 2498 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3231, ఆడవారి సంఖ్య 3363. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1591 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 102. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590351.[1]

కొమ్మూరు (కాకుమాను)
పటం
కొమ్మూరు (కాకుమాను) is located in ఆంధ్రప్రదేశ్
కొమ్మూరు (కాకుమాను)
కొమ్మూరు (కాకుమాను)
అక్షాంశ రేఖాంశాలు: 16°3′56.016″N 80°21′37.152″E / 16.06556000°N 80.36032000°E / 16.06556000; 80.36032000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంకాకుమాను
విస్తీర్ణం
24.98 కి.మీ2 (9.64 చ. మై)
జనాభా
 (2011)
6,594
 • జనసాంద్రత260/కి.మీ2 (680/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,231
 • స్త్రీలు3,363
 • లింగ నిష్పత్తి1,041
 • నివాసాలు1,862
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522235
2011 జనగణన కోడ్590351

సమీప గ్రామాలు

మార్చు

ఈ గ్రామానికి సమీపంలో కాట్రపాడు, పుసులూరు, గోగులమూడి, పెదనందిపాడు, కొండపాటూరు గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

సమీప బాలబడి కాకుమానులో ఉంది.

సమీప జూనియర్ కళాశాల కాకుమానులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పెదనందిపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ పొన్నూరులోను, మేనేజిమెంటు కళాశాల బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం పొన్నూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

మార్చు

2017,ఆగస్టు-23న నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్.జి.ఎఫ్ ఫెన్సింగ్ పోటీలలో, ఈ పాఠశాలలో చదువుచున్న నలుగురు విద్యార్థులు ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. అండర్-14 విభాగంలో సయ్యద్ కరీముల్లా,షేక్ ఇమాం,మూకిరి ఐజక్, అండర్-17 విభాగంలో మగ్దుం అజీజ్ ఎంపికైనారు.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

మార్చు

ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న గేరా మోహనరావు ఉత్తమ పాధ్యాయుడుగా ఎంపికై, జిల్లా కలక్టరు నుండి పురస్కారం పొందాడు.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

కొమ్మూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

కొమ్మూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.

భూమి వినియోగం

మార్చు

కొమ్మూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 399 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 54 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 46 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 336 హెక్టార్లు
  • బంజరు భూమి: 843 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 819 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 902 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1095 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

కొమ్మూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 424 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 671 హెక్టార్లు

గ్రామ ప్రముఖులు

మార్చు
 
జంధ్యాల పాపయ్య శాస్త్రి - 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు.
  • జంధ్యాల పాపయ్య శాస్త్రి - 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు.పుష్పవిలాపం: ఘంటసాల రికార్డుల పుష్పవిలాపం పద్యాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కొమ్మూరు గ్రామంలో 1912, ఆగస్టు 4న జన్మించాడు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య.
  • కొర్రపాటి జేమ్స (శిలువధారి) నాటక రచయిత, కవి కోకిల గుర్రం జాషువా అవార్డు గ్రహీత
  • షేక్ జానీమూన్. గుంటూరు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

త్రాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామంలో దాత దొప్పలపూడి వేణుగోపాలరావు, తన తల్లిదండ్రులు కీ.శే.రాములు, రంగనాయకమ్మ ల ఙాపకార్ధం, 1.6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన త్రాగునీటి ట్రాలీ (మొబైల్) ట్యాంకర్‌ను, 2017,జులై-22న, గ్రామంలోని శ్రీ రామమందిరం వద్ద, ప్రారంభించారు. శుభకార్యాల సమయంలో గ్రామస్థులకు ఈ ట్యాంకర్ చాలా ఉపయోగంగా ఉంటుందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాత తండ్రి కీ.శే.రాములు, ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసారు.

ఈ గ్రామంలో గేరా రత్నం అను రిటైర్డ్ మిలిటరీ అధికారి తన సొంత డబ్బులతో తాగునీటి సమస్యలకు గాను పక్కనే పెద్దివారిపాలెం గ్రామంలో లక్ష రూపాయలతో మంచి నీటి కుళాయి లను ఏర్పాటు చేశాడు... అలాగే కొమ్మూరు గ్రామంలో రోడ్ల నిర్మాణానికి కూడా కొంత డబ్బుతో నిర్మించారు.. ఒక స్కూల్ బస్సు కూడా ఏర్పాటు చేశారు.. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకునే వారికి తన వంతు సాయంగా 1000/- రూపాయలు కూడా ఇస్తున్నారు... కొమ్మూరు గ్రామంలోని యువతకు స్పోర్ట్స్ కిట్స్ ను కూడా ప్రతి సవంత్సరం ఇస్తున్నారు.. గ్రామంలోని హై స్కూల్ లోని అత్యదిక మార్కులు వచ్చిన వారికి నగదు పురస్కారాన్ని ఇస్తున్నారు....

గేరా రత్నం గ్రామం పదవ తరగతి చదివే పిల్లలకు పోషకాహారం లోపం రాకుండా వారు బాగా చదవటానికి వారికి పాఠశాలలో పోషక ఆహారం అందచేస్తున్నారు,

అంగనవాడీ కేంద్రం

మార్చు

సామాజిక భవనం

మార్చు

ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవర సూర్యబలిజ సామాజిక భవనాన్ని, 2017,ఆగస్టు-11న ఉదయం 9-18 కి ప్రారంభించెదరు.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మూకిరి మార్తమ్మ, సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా పీరా ఎన్నికైనాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

మార్చు
  1. శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవాలయం;- దాదాపు రెండు వేల సంవత్సరాలక్రితం, అగస్త్యమహాముని, ఓగేరు నది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే ఈ ఆలయానికి "అగస్తేశ్వరస్వామి" దేవాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం, పైకి పెరుగుతుండటంతో ఒక బంగారు శీలను కొట్టినారని పూర్వీకులు చెప్పుకుంటుంటారు. ఆ తరువాత చోళరాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయ ముఖమండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. సత్తెనపల్లి జమీందారులు, పలువురు ప్రముఖులు ఈ ఆలయానికి వందల ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఈ అలయానికి జిల్లా నలుమూలలనుండి భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని పూజలు చేయుదురు. ఈ ఆలయంలోని స్వామివారిని పూజిస్తే నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుందని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. ఈ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారికి, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయానికి 3.40 ఎకరాల మాన్యం భూమి ఉంది.
  2. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 5.18 ఎకరాల మాన్యం భూమి ఉన్నది
  3. శ్రీ భద్రకాళీసమేత ఉద్దండ వీరభద్రస్వామి ఆలయం:- ఈ ఆలయ 13వ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-13వ తేదీ మాఘమాసం, శుద్ధ పంచమి, శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం రాత్రికి గ్రామంలో ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు
  4. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నవమ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-12వ తేదీ మాఘ శుద్ధ చవితి, శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా సాగినది.
  5. కొమ్మూరు గ్రామంలోని గణేశ్ యూత్, గ్రామస్థుల ఆధ్వర్యంలో, ఏడుకొండలస్వామి శంఖు, చక్ర, నామాల నిర్మాణపనులు 2014, జూన్-21, శనివారం నాడు ప్రారంభమైనవి. ఈ నిర్మాణపనులు పూర్తి అవగానే, 2014,ఆగస్టు-23,శనివారం ఉదయం, (శ్రావణమాసంలో) వెంకటేశ్వరస్వామి నామాలను ప్రత్యేక వాహనంపై ఉంచి మేళతాళాలతో గ్రామ వీధులలో ఊరేగించారు. అనంతరం నామాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేషపూజలు నిర్వహించారు. కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి నిర్వహించారు.
  6. శ్రీ అద్దంకమ్మ, పోలేరమ్మ అమ్మవారల ఆలయం:- ఈ ఆలయంలో శ్రీ అద్దంకమ్మ, శ్రీ పోలేరమ్మ అమ్మ వారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2017,మే-2,3,4 తేదీలలో నిర్వహించెదరు. మే-4వతేదీ ఉదయం 10-57 కి విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు.
  7. కొమ్మూరు గ్రామంలో వంద సంవత్సరాల ప్రసిద్ద చరిత్ర గల పాత ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చి స్థానంలో కొత్తగా చర్చి నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది, ఇప్పటివరకు 12 మంది సంఘ కాపరులు సంఘ అభివృద్ధికి పనిచేసారు వారు 1.బోరుగడ్డ సుందర రావు 2.మత్తే నతానియేలు,౩.విల్సన్ డేవిడ్ రాజ్, 4,దేవదానం,5. చలపతి రావు,6.జోనతాన్,7,గడ్డం జోసెఫ్,8 తలకాయల దేవసహాయం
  8. . బండ్ల విక్టర్ ప్రేం సాగర్ సాగర్ (ప్రస్తుతం) పై గురువులందరు కొమ్మూరు లూథరన్ సంఘ అత్మీయ అభివృద్ధిలో పాలుపంచుకోవటం జరిగింది,

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామానికి చెందిన నాగమణి (50) దశాబ్దకాలంగా, వృద్ధులు, అనాథలు, పేద విద్యార్థుల సేవలో ఉంటూ, అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7155,ఇందులో పురుషుల సంఖ్య 3545, స్త్రీల సంఖ్య 3610,గ్రామంలో నివాసగృహాలు 1893 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2498 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".