రక్తతిలకం (1988 సినిమా)

రక్త తిలకం 1988 లో విడుదలైన యాక్షన్ సినిమా. బి. గోపాల్ దర్శకత్వంలో శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. అశోక్ కుమార్ నిర్మించాడు. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో వెంకటేష్, అమల ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళ చిత్రం థైమెల్ అనాయ్కి రీమేక్, అది బెంగాలీ చిత్రం ప్రతికార్ (1987) కు రీమేక్.[1][2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నమోదైంది.[3]

రక్తతిలకం
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.గోపాల్
నిర్మాణం కె.అశోక్ కుమార్
కథ పరుచూరి సోదరులు
చిత్రానువాదం బి. గోపాల్
తారాగణం అమల ,
వెంకటేష్,
శారద
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
కూర్పు కె.ఎ.మార్తాండ్
పంపిణీ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

కృష్ణ ప్రసాద్ ధనవంతుడైన సత్యనారాయణ ప్రసాద్ (జగ్గయ్య) కుమారుడు. తన బాల్యంలో, అతని బాబాయి గరుత్మంతరావు (నూతన్ ప్రసాద్) ఆస్తి కోసం సోదరుడిని చంపుతాడు. కృష్ణ ప్రసాద్ ఇంటి నుండి తరిమివేస్తాడు. కృష్ణ ప్రసాద్ తన పాఠశాల-ఉపాధ్యాయుడు నాగమణి (శారద) తో కలిసి జీవిస్తాడు. అతను ఆమెను తన సొంత తల్లిగా భావిస్తాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు - బలరామ్ జ్యోతి.. గరుత్మంతరావు కృష్ణను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఈ ప్రయత్నంలో దురదృష్టవశాత్తు బలరాం తన కుటుంబం నుండి విడిపోతాడు. అతడు చనిపోయాడని భావిస్తారు. నాగమణి కృష్ణను, జ్యోతినీ పెంచుతుంది.

20 సంవత్సరాల తరువాత, కృష్ణ ప్రసాద్ (వెంకటేష్) తన కళాశాల స్నేహితురాలు రాధా (అమల) తో ప్రేమలో పడతాడు. గరుత్మంతరావు కుమారుడు రఘు (సుధాకర్) గూండాగా మారతాడు. స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ పి.కె.పతి (గిరి బాబు) కి లంచం ఇచ్చి అతడి తండ్రి అతణ్ణి కాపడుతూంటాడు. జ్యోతి (పూర్ణిమ) ని రఘు, అతని స్నేహితులు అత్యాచారం చేసి హత్య చేస్తారు. వారు నాగమణిపై కారు నడిపడంతో, ఆమె వికలాంగురాలౌతుంది. జ్యోతి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని కృష్ణ, నాగమణి ఇద్దరూ ప్రమాణం చేస్తారు. అప్పుడు బలరాం (శివ కృష్ణ) పోలీస్ ఇన్స్పెక్టర్గా వారి జీవితాల్లోకి తిరిగి ప్రవేశిస్తాడు. కృష్ణను ఎలాగైనా అరెస్టు చెయ్యాలనే పట్టుదలతో ఉంటాడు. కృష్ణ తన పగతీర్చుకుంటాడా లేదా అనేది తరువాతి కథ.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఎస్. పాట గాయనీ గాయకులు సాహిత్యం నిడివి
1 "దంచో దంచో" ఎస్పీ బాలు, పి.సుశీలా వేటూరి సుందరరామమూర్తి 4:33
2 "తమలపాకు లాంటిదానా" ఎస్పీ బాలు, పి.సుశీలా వేటూరి సుందరరామమూర్తి 4:29
3 "కాలేజ్ నుండి మ్యారేజ్" ఎస్పీ బాలు జోన్నవితుల రామలింగేశ్వరరావు 4:19
4 "గుప్పెడు మల్లెలు" మనో, అలీషా చినాయ్ జోన్నవితుల రామలింగేశ్వరరావు 4:29
5 "కిల్ కిల్ మి" అలీషా చినాయ్ జాలాది 4:21

మూలాలు మార్చు

  1. "Archived copy". Retrieved 2012-01-02.
  2. "Raktha Tilakam Crew". Archived from the original on 20 జూలై 2012. Retrieved 17 February 2013.
  3. "Success and centers list - Venkatesh". Retrieved 30 October 2014.