ఖమస్ రాగం

(ఖమాస్ రాగం నుండి దారిమార్పు చెందింది)

ఖమస్ లేదా కమాస్/ఖమాస్/ఖమాజ్/ఖమాచ్ దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం. ఇది ఒక జన్య రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం జావళీలు పాడేందుకు అనువైన రాగం.[1][2]

ఖమస్
ఆరోహణస మ1 గ3 మ1 ప ద2 ని2 స'
అవరోహణస' ని2 ద2 ప మ1 గ3 రి2 స
కర్ణాటక సంగీతం
విషయాలు

శృతిస్వరంరాగంతాళంమేళకర్త

కూర్పులు

వర్ణంకృతిగీతంస్వరజతిరాగం తానం పల్లవితిల్లానా

వాయిద్యాలు

వీణతంబురమృదంగంఘటంమోర్‌సింగ్కంజీరవయోలిన్

సంగీతకారులు

కర్నాటక సంగీతకారుల జాబితా

రాగ స్వరూపం, లక్షణం మార్చు

ఖమస్ రాగం అసమమిత రాగం, ఆరోహణంలో రిషభం ఉండదు. ఇది ఒక వక్ర షడవ సంపూర్ణ రాగం, అనగా ఆరోహణలోని ఆరు స్వరాలను వంకర-టింకరగా పాడతారు.[2] ఈ రాగం ఆరోహణ, అవరోహణాలు :

ఈ ఆరోహణావరోహణాల్లో స్వరాలు : షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుఃశృతి దైవతం, కైశికి నిషాదం ఆరోహణలో, అవరోహణలో అదనంగా చతుఃశృతి రిషభంస్వరం ఉంటుంది.

 
హరికాంభోజి, ఖమస్ రాగం ఈ రాగం నుండి జనితం

రాగ వైవిధ్యత మార్చు

నిజానికి ఖమాస్ రాగం ఒక ఉపాంగ రాగం (జనక రాగంలోని స్వరాలనే వాడాలి). తరువాతి కాలంలో జావళీలకు అనువుగా ఖమాస్ భాషాంగ రాగం అయింది (జనక రాఅగంలో లేని స్వరాలు చేరతాయి). అన్య స్వరంగా కైకలి నిషాదాన్ని చేర్చారు.[1] ముద్దుస్వామి దీక్షితుల ప్రకారం ఖమాస్ ఒక సంపూర్ణ రాగం, ఇందులో స్వరాలలో వక్రత ఉండదు.[1][2] హిందుస్తానీ సంగీతంలోని ఖమాజ్ రాగానికి ఖమాస్ రాగం దగ్గరగా ఉంటుంది. హిందీ సినిమా అభిమాన్ లోని 'తేరే మేరే మిలన్ కీ' పాట ఖమాజ్ రాగంలో స్వర పరచబడింది.[3]

పేరు పొందిన పాటలు మార్చు

ఈ రాగంలో ఎన్నో రచనలు స్వరపరచబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి :

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్ రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు
  2. 2.0 2.1 2.2 రాగనిధి(ఆంగ్ల పుస్తకం) రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్
  3. ఖమస్ రాగానికి హిందుస్తానీ సంగీతంలో ఉన్న సమానాంతర రాగాల గురించి హిందూ పత్రికలో కథనం
  4. యూట్యూబ్ లో ఈ రాగాన్ని ఆలపించిన మాళవిక
"https://te.wikipedia.org/w/index.php?title=ఖమస్_రాగం&oldid=3154328" నుండి వెలికితీశారు