వర్ణం (సంగీతం)


కర్ణాటక సంగీతం లో వర్ణాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. వర్ణం రాగ లక్షణాన్ని వివరిస్తుంది.ఇది ప్రధానంగా కచేరి మొదట్లో పాడతారు. స్వర ఉచ్ఛారణ ను, రాగ లక్షణాన్ని, రాగ అవరోహణ, ఆరోహణ క్రమాన్ని కూడా వర్ణం వివరిస్తుంది. ఇది సాహిత్య ప్రధానం కన్నా రాగ, లయ, తాళ ప్రధానంగా ఉంటాయి. సంగీత విద్యార్థులకు సాధనకు వీలుగా ఉంటాయి.

వర్ణంలో భాగాలుసవరించు

వర్ణంలో ప్రధానంగా ఈ అంశాలు ఉంటాయి.

 • పల్లవి
 • అనుపల్లవి
 • ముక్తాయి స్వరం
 • చరణం
 • చిట్టస్వరాలు

రకాలుసవరించు

ఆది,అట తాళ వర్ణాలు ఇంకా పదవర్ణాలు ఉంటాయి. తానా వర్ణాలకు రాగ,లయ ప్రధానంగా ఉంటాయి. సాధారణంగా పల్లవి, అనుపల్లవి, చరణాలకి మాత్రమే సాహిత్యం ఉంటుంది. వర్ణాలు సాధారణంగా 8 గతులు లేదా 14 గతులతో ఉంటాయి. కాబట్టి తాళం వేసేటప్పుడు ఒకే వేలుని రెండు సార్లు ఆడిస్తూ తాళం వేస్తారు. దీనిని చౌక తాళం అంటారు. పదవర్ణాలు నృత్యానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి సంగీత,సాహిత్య ప్రధానంగా ఉంటాయి.

ఆలపించే పద్ధతిసవరించు

వర్ణాన్ని మొదటి గతిలో పల్లవి నుంచి ముక్తాయి స్వరం వరకు పాడతారు. ముక్తాయి స్వరానికి సాధారణంగా సాహిత్యం ఉండదు. వర్ణాన్ని పాడేవారు పల్లవి, అనుపల్లవులను కేవలం సాహిత్యాన్ని మాత్రమే పాడతారు. మొదటి కాలంలో ముక్తాయి వరకు పాడిన తర్వాత, రెండవ కాలంలో మళ్ళీ పల్లవి నుంచి ముక్తాయి వరకు పాడి ఆపు స్వరంతో ముగిస్తారు. తర్వాత చరణం, చిట్టస్వరం మొదటి కాలంలో పాడుతారు. మళ్ళీ అవే రెండో కాలంలో పాడతారు. ఈ పద్దతిలోనే అన్ని చిట్టస్వరాలనూ పాడతారు. చరణానికి సాహిత్యం ఉంటుంది. [1] విద్వాంసులు వాళ్ళ స్వరకల్పనను జతచేసి వర్ణాన్ని కచేరీలలో పడతారు.

ప్రముఖ వర్ణాలుసవరించు

ఆది తాళ వర్ణాలు

 • సామి నిన్నే - శ్రీ రాగం - కారూర్ దేవుడు అయ్యర్
 • నిన్ను కోరి - మోహన రాగం - పూచి శ్రీనివాస ఆయంగార్
 • ఎవ్వరి బోధన - ఆభోగి రాగం - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్
 • వలచి వచ్చి - నవరాగ మాలిక(తొమ్మిది రాగాలతో కూర్చబడిన వర్ణం) - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

అట తాళ వర్ణాలు

 • విరిబోణి - భైరవి రాగం - పచ్చియమిరం ఆడియప్ప అయ్యర్
 • నెర నమ్మితి - కానడ రాగం - పూచి శ్రీనివాస ఆయంగార్
 • చలమేల - శంకరాభరణం రాగం - స్వాతి తిరుణాల్

బయట లింకులుసవరించు

http://carnatica.net/kriti/varnamlist.htm

http://www.shivkumar.org/music/varnams/index.html

 1. https://nasa2000.livejournal.com/62564.html