గర్మిళ్ల (మంచిర్యాల మండలం)

(గరిమెళ్ల (మంచిర్యాల మండలం) నుండి దారిమార్పు చెందింది)
  ?గర్మిళ్ల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°52′17″N 79°26′39″E / 18.8714°N 79.4443°E / 18.8714; 79.4443
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) మంచిర్యాల జిల్లా
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మంచిర్యాల పురపాలకసంఘం
కోడులు
పిన్‌కోడ్

• 504209


గర్మిళ్ల తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల మండలానికి చెందిన గ్రామం.[1] ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పు వైపు 152 కిమీ దూరంలో గర్మిళ్ల ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

భౌగోళికం మార్చు

గర్మిళ్ల గ్రామానికి ఉత్తరం వైపు మందమర్రి మండలం, దక్షిణం వైపు రామగుండం మండలం, తూర్పు వైపు జైపూర్ మండలం, ఉత్తరం వైపు కాసిపేట మండలం ఉన్నాయి. మంచిర్యాల, రామగుండం, మందమర్రి, బెల్లంపల్లె మొదలైన గ్రామాలు గర్మిళ్లకు సమీపంలో ఉన్నాయి.[3] హమాలీవాడ, రాళ్లపేట, శ్రీ సాయినగర్‌, ముస్లీంబస్తీ, ఏసీసీ కాలనీ, శ్రీశ్రీ నగర్‌, క్యాబిన్‌ ఏరియా, వేముల బస్తీ, ఆంధ్రాకాలనీ మొదలైనవి సమీపంలో ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు మార్చు

  • భక్త ఆంజనేయ దేవాలయం
  • మస్జిద్-ఎ-షాహీన్
  • మస్జిద్-ఎ-అహ్లే హదీస్

విద్యాసంస్థలు మార్చు

  • వివేక వర్ధిని డిగ్రీ & పిజి కళాశాల
  • వాగ్దేవి డిగ్రీ కళాశాల
  • ఎంవీఎన్ జూనియర్ కళాశాల
  • భార్గవి జూనియర్ కళాశాల
  • మాంటిస్సోరి హైస్కూల్
  • ప్రభుత్వ పాఠశాల
  • సరస్వతి శిశు మందిరం

రవాణా మార్చు

ఇక్కడికి సమీపంలోని మంచిర్యాలలో రైల్వే స్టేషన్ ఉంది. మంచిర్యాల పట్టణం నుండి గర్మిళ్లకు రోడ్డు కనెక్టివిటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బస్సులు నడుపబడుతున్నాయి. ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది.

వ్యవసాయం మార్చు

ఈ గ్రామంలో పత్తి, జొన్నలు, ఎర్ర పప్పులు వ్యవసాయ వస్తువులు.

తాగునీరు, పారిశుధ్యం మార్చు

చేతి పంపులు, బోర్ల ద్వారా తాగునీరు అందుతోంది. ఈ గ్రామంలో ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. వీధిలో చెత్తను సేకరించే వ్యవస్థ లేదు. కాలువ నీరు మురుగు ప్లాంట్‌లోకి విడుదల చేయబడుతుంది.

కమ్యూనికేషన్ మార్చు

ఈ గ్రామంలో పోస్టాఫీసు అందుబాటులో ఉంది.

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 222, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "Garmilla Village". www.onefivenine.com. Archived from the original on 2020-02-21. Retrieved 2021-12-04.

వెలుపలి లంకెలు మార్చు