గిరిడి

ఝార్ఖండ్ లోని జిల్లా

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో గిరిడి జిల్లా (హిందీ: गिरिडीह जिला) ఒకటి. జిల్లాకేంద్రంగా గిరిడి పట్టణం ఉంది.2011 గంణాంకాలను అనుసరించి రాష్ట్రంలో జనసంఖ్యలో ఇది 3 వ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో రాంచి, ధన్‌బాద్ జిల్లాలు ఉన్నాయి.[1]

Giridih జిల్లా

गिरिडीह जिला
Jharkhand లో Giridih జిల్లా స్థానము
Jharkhand లో Giridih జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhand
పరిపాలన విభాగముNorth Chotanagpur division
ముఖ్య పట్టణంGiridih
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలు1. Kodarma, 2. Giridih
 • శాసనసభ నియోజకవర్గాలు6
విస్తీర్ణం
 • మొత్తం4,854 కి.మీ2 (1,874 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం24,45,203[1]
 • పట్టణ
06.41
జనగణాంకాలు
 • అక్షరాస్యత65.12 per cent[1][2]
 • లింగ నిష్పత్తి940
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

గిరిడి జిల్లా 1972 డిసెంబరు 6 న ఏర్పాటు చెయ్యబడింది. హజారీబాగ్ జిల్లానుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. 1999లో ఇది బొకారో జిల్లాగా మారింది. [3] ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[4]

భౌగోళికంసవరించు

జిల్లా వైశాల్యం 485 చ.కి.మీ. జిల్లా ఉత్తరసరిహద్దులో బీహార్ రాష్ట్రంలోని జమూయి జిల్లా, నవాడా, తూర్పు సరిహద్దులో దేవ్‌ఘర్, జంతర జిల్లా, దక్షిణ సరిహద్దులో ధన్‌బాద్, బొకారో, పశ్చిమ సరిహద్దులో హజారీబాగ్, కోడెర్మా జిల్లాలు ఉన్నాయి.

గిరిడి భూభాగం సముద్రమట్టానికి 298 మీ ఎత్తులో ఉంది. గిరిడి జిల్లాలో ఉన్న షిఖర్జి (వీటిని పరస్నాథ్ కొండలుఅంటారు) జార్ఖండ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరంగా గుర్తించబడుతుంది. ఈ కొండలో కోణంగా ఉన్న గ్రానైట్ శిఖరం ఎత్తు సముద్రమట్టానికి 4,477 అడుగులు..[5][6]

భౌగోళిక విభాగాలుసవరించు

గిరిడి జిల్లా భౌగోళికంగా 2 విభాగాలుగా విభజించబడింది: సెంట్రల్ ప్లాట్యూ, దిగువ ప్లాట్యూ. సెంట్రల్ ప్లాట్యూ జిల్లా పశ్చిమ భూభాగంలోని బగోదర్ బ్లాక్ వరకు విస్తరించి ఉంది. దిగువ ప్లాట్యూ అసమానమైన భూభాగం, సరాసరి ఎత్తు సముద్రమట్టానికి 1300 అడుగుల ఎత్తులో ఉంది.[6] జిల్లా ఉత్తరం, వాయవ్యంలో ఉన్న దిగువభూములలో చక్కగా చదునుచేయబడిన టేబుల్ లాండుస్ సముద్రమట్టానికి 700 అడుగుల ఎత్తున ఉన్న కొండలను తాకే వరకు విస్తరించి ఉన్నాయి.

ఖనిజ సంపదసవరించు

గిరిడిలో ఖనిజాలు అధికంగా ఉన్నాయి. మైకా, బొగ్గు గనులు ఉన్నాయి. అంతేకాక పలు బొగ్గుగనులు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన బొగ్గును అందిస్తున్న " మెటల్లరజికల్ కోయల్ ఆఫ్ ఇండియా " ఒకటి. జిల్లాలోని గవాన్ బ్లాక్, తిసరి బ్లాక్‌లలో పలు మైకా గనులు ఉన్నాయి. జిల్లా అంతటా పలు ప్రాంతాలలో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయి. మైకా జార్ఖండ్ రాష్ట్రానికే కాక భారతదేశం అంతటికీ అలాగే విదేశాలకు కూడా అవసరం ఉంది.[6]

జిల్లాలో ప్రశాంత్ కొండలు ఉన్నాయి. అలాగే జిల్లాలో 2 ప్రధాన నదులు ప్రవహిస్తున్నయి ( బర్కర్ నది, శక్రి నది). బర్కర్ నది బిర్ని బ్లాకు గుండా ప్రవహిస్తుంది. శక్రి నది డియోరి బ్లాకు గుండా ప్రవహిస్తుంది. అంతే కాక జిల్లాలో ఉశ్రీ వంటి ఉపనదులు కూడా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఉశ్రీ జలపాతం ఉంది.

ఆర్ధికంసవరించు

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గిరిడి జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రజిల్లాలలో 21 ఈ జిల్లా ఒకటి.[7]

విభాగాలుసవరించు

 • గిరిడి జిల్లాలో 12 కమ్యూనిటీ బ్లాకులు ఉన్నాయి : గిరిడి, గండే, బెంగబాద్, పిర్తండ్, దుమ్రి, బాగోదర్, బిర్ని, ధంవర్, జముయా, దియోరి, తిశ్రీ, గవాన్.
 • జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: జముయా, బగోదర్, ధంవర్, గండే. ఇవన్నీ కొడెర్మా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[8]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,445,203[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 182వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 497
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.33%.
స్త్రీ పురుష నిష్పత్తి. 943:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.12%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

జిల్లాలో కొర్తా (మగాహి భాషలో ఒక శాఖ ), బెంగాలి భాషలు ప్రధాన భాషలుగా వాడుకలో ఉన్నాయి. గిరిజన ప్రజలు శానతలి భాష వాడుకలో ఉంది.

వృక్షజాలం , జంతుజాలంసవరించు

జిల్లాలో వనసంపద విస్తారంగా ఉంది. అరణ్యాలలో షోరియా రోబస్టల్సాల్ చెట్లు, వెదురు, వివిధ జాతులకు చెందిన స్థానిక చెట్లు ఉన్నాయి. మిగిలిన జాతులలో మధుయా, సెమల్, పలాష్, కుసుం, కెండ్, ఆసియన్ పియర్, భెల్వాల్ చెట్లు ఉన్నాయి.[6] ప్రశాంత్ కొండల్లో ఔషధ మొక్కలతో చిరుత, ఎలుగుబంటి, నక్క, అడవి పంది, కుందేలు వంటి జంతువులు ఉన్నాయి.

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
 3. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
 4. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
 5. "Jharkhand". Encyclopædia Britannica. Retrieved 7 March 2012.
 6. 6.0 6.1 6.2 6.3 "Official website of the Giridih district". Retrieved 7 March 2012.
 7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 8. "Election". Giridih district website.
 9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62 line feed character in |quote= at position 7 (help)
 10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గిరిడి&oldid=2874579" నుండి వెలికితీశారు