గిల్లికజ్జాలు 1998 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో శ్రీకాంత్ , మీనా , రాశి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని చంద్రకిరణ్ ఫిల్మ్స్ పతాకంపై స్రవంతి ఆర్ట్ మూవీస్ సమర్పణలో పి. ఉషారాణి నిర్మించింది. పొట్లూరి సత్యనారాయణ ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. తులసీ దాస్ కథ అందించగా మరుధూరి రాజా మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.

గిల్లికజ్జాలు
దర్శకత్వంముప్పలనేని శివ
రచనతులసీ దాస్ (కథ), మరుధూరి రాజా (మాటలు)
నిర్మాతపి. ఉషారాణి, పొట్లూరి సత్యనారాయణ (ఎక్జిక్యూటివ్ నిర్మాత)
తారాగణంశ్రీకాంత్,
మీనా ,
రాశి
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థలు
చంద్రకిరణ్ ఫిల్మ్స్, స్రవంతి ఆర్ట్ మూవీస్ (సమర్పణ)
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు
  • కథ: తులసీ దాస్
  • చిత్రానువాదం, దర్శకత్వం: ముప్పలనేని శివ
  • కెమెరా: వి. జయరాం
  • కూర్పు: కోటగిరి వేంకటేశ్వరరావు
  • సంగీతం: కోటి

సంగీతం

మార్చు

ఈ చిత్రానికి కోటి సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సురేంద్రకృష్ణ పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సునీత, కోటి పాటలు పాడారు.

మూలాలు

మార్చు