గూడెం మహిపాల్ రెడ్డి

(గూడెం మహిపాల్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

గూడెం మహిపాల్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2]భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు[3].

గూడెం మహిపాల్‌ రెడ్డి
గూడెం మహిపాల్ రెడ్డి


పదవీ కాలం
2014–2018, 2018- 2023,2023 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1963-09-19) 1963 సెప్టెంబరు 19 (వయసు 60)[1]
పటాన్‌చెరు, పటాన్‌చెరు మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి,

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ

జీవిత భాగస్వామి యాదమ్మ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

జననం, విద్య

మార్చు

మహిపాల్ రెడ్డి 1963, సెప్టెంబరు 19న సత్తిరెడ్డి, మణెమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం, పటాన్‌చెరు గ్రామంలో జన్మించాడు. 1977లో పటాన్‌చెరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 10వ తరగతి పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

మహిపాల్ రెడ్డికి యాదమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మార్చు

1991లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహిపాల్ రెడ్డి 1991లో ట్రేడ్ యూనియన్ లీడర్ గా, 1995లో పటాన్‌చెరు ఎంపిటీసిగా, 2002లో మెదక్ జిల్లా ఎంపిటీసి సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మహిపాల్ రెడ్డి 2009లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[4] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వప్న దేవ్ పై 18,886 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్  పై 37,699 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] [8]భారత్ రాష్ట్ర సమితి నాయకుడు పటాన్ చెరు నియోజకవర్గం శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మహిపాల్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితిలో ఉంటు వరుసగా మూడు సార్లు పటాన్ చెరు శాసన సభ నియోజక వర్గం నుండి ఘన విజయం సాధించారు. 15 జూలై 2024 సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పు కున్నాడు[9] [10] [11].

ఇతర వివరాలు

మార్చు

చైనా, సింగపూర్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

మార్చు
  1. telangana.gov.in
  2. "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-27.
  3. Satyaprasad, Bandaru. "BRS Mla Joins Congress : బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి". Hindustantimes Telugu. Retrieved 2024-07-15.
  4. "Gudem Mahipal Reddy | MLA | TRS | Patancheru | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-15. Retrieved 2021-08-27.
  5. Sakshi (11 November 2018). "మినీ ఇండియా". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 2021-08-27.
  6. "Gudem Mahipal Reddy(TRS):Constituency- PATANCHERU(SANGAREDDY) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-08-27.
  7. "Patancheru Assembly Election Result 2018: TRS MLA Gudem Mahipal Reddy ahead of Congress' Kata Srinivas Goud". www.timesnownews.com. Retrieved 2021-08-27.
  8. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  9. "Gudem Mahipal Reddy: భారాసకు మరో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి". EENADU. Retrieved 2024-07-15.
  10. ABN (2024-07-15). "Congress: కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-15.
  11. Velugu, V6 (2024-07-15). "బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్‌లో చేరిన పటాన్‍చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి". V6 Velugu. Retrieved 2024-07-15.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)