2006 నంది పురస్కారాలు

తెలుగు సినిమా కోసం నంది అవార్డులను ప్రతీ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక , చారిత్రిక చిహ్నమైన లేపాక్షి వద్ద గల పెద్ద గ్రానైట్ శిల్పమైన నంది కి గుర్తుగా ఈ పురస్కారానికి నంది పురస్కారంగా వ్యవహరిస్తారు. ఇందులో నాలుగు వర్గాలుంటాయి. అవి బంగారునంది, రజత నంది, కాంస్య నంది, తామ్ర నంది విభాగాలు.[1]

యన్.టి.ఆర్ నుండి నంది అవార్డు అందుకుంటున్న ఎంవి రఘు

2006 సంవత్సరానికి నంది అవార్డులను ఫిబ్రవరి 12, 2008 న హైదరాబాద్‌లో ప్రకటించారు.[2]

2006 నంది పురస్కార విజేతల జాబితా

మార్చు
 
బొమ్మరిల్లు (ఉత్తమ చిత్రం)
 
శ్రీరామదాసు (అక్కినేని అవార్డు)
 
అక్కినేని నాగార్జున (ఉత్తమ నటుడు)
 
ప్రకాష్ రాజ్ (ఉత్తమ సహాయ నటుడు)
వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం బొమ్మరిల్లు బొమ్మరిల్లు
ద్వితీయ ఉత్తమ చిత్రం గోదావరి గోదావరి
తృతీయ ఉత్తమ చిత్రం గంగ గంగ
ఉత్తమ గృహ వీక్షణ చలన చిత్రంగా అక్కినేని అవార్డుకు నంది అవార్డు శ్రీ రామదాసు శ్రీ రామదాసు
ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పోకిరి పోకిరి
ఉత్తమ నటుడు అక్కినేని నాగార్జున శ్రీ రామదాసు
ఉత్తమ నటి నందితా దాస్ కమ్లీ
ఉత్తమ సహాయ నటుడు ప్రకాష్ రాజ్ బొమ్మరిల్లు
ఉత్తమ సహాయ నటి ఈశ్వరి గంగ
ఉత్తమ ప్రతినాయకుడు సాయి కుమార్ సామాన్యుడు
ఉత్తమ హాస్యనటుడు వేణుమాధవ్ లక్ష్మి
ఉత్తమ హాస్యనటి అభినయశ్రీ పైసాలో మరమాత్మ
ఉత్తమ బాలనటుడు మాస్టర్ రాఘవ స్టైల్
ఉత్తమ బాలనటి దివ్యశ్రీ భారతి
ఉత్తమ పాత్ర నటుడు కోట శ్రీనివాసరావు పెళ్ళైన కొత్తలో
స్పెషన్ జ్యూరీ అవార్డు (ఉత్తమ నటి ) జెనీలియా డిసౌజా బొమ్మరిల్లు
స్పెషన్ జ్యూరీ అవార్డు (ఉత్తమ సందేశ చిత్రం ) స్టాలిన్ స్టాలిన్
స్పెషన్ జ్యూరీ అవార్డు (ఉత్తమ దర్శకుడు) గంగరాజు గున్నం అమ్మ చెప్పింది
ఉత్తమ బాలల చిత్రం భారతి భారతి
రెండవ ఉత్తమ బాలల చిత్రం కిట్టు కిట్టు
ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు ఆర్. ఎస్. రాజు భారతి
ఉత్తమ దర్శకుడు శేఖర్ కమ్ముల గోదావరి
దర్శకుడి ఉత్తమ మొదటి చిత్రం భాస్కర్ బొమ్మరిల్లు
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత భాస్కర్ బొమ్మరిల్లు
ఉత్తమ కథా రచయిత రవి సి. కుమార్ సామాన్యుడు
ఉత్తమ సంభాషణల రచయిత అబ్బూరి రవి బొమ్మరిల్లు
ఉత్తమ గీత రచయిత అందెశ్రీ గంగ
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విజయ్ సి. కుమార్ గోదావరి
ఉత్తమ సంగీత దర్శకుడు కె. ఎమ్‌. రాధాకృష్ణన్ గోదావరి
ఉత్తమ నేపథ్య గాయకుడు జేసుదాసు గంగ
ఉత్తమ నేపధ్య గాయని సునీత ఉపద్రష్ట గోదావరి
ఉత్తమ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ పోకిరి
ఉత్తమ కళా దర్శకుడు అశోక్ పౌర్ణమి
ఉత్తమ కొరియోగ్రాఫర్ రాఘవ లాలెన్స్ స్టైల్
ఉత్తమ ఆడియోగ్రాఫర్ రాధాకృష్ణ పోకిరి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ బాషా శ్రీరామదాసు
ఉత్తమ ఫైట్ మాస్టర్ విజయన్ పోకిరి
తెలుగు సినిమాపై ఉత్తమ చిత్ర విమర్శకుడు చల్లా శ్రీనివాస్
ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్
ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రెడ్డి బొమ్మరిల్లు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణా స్పిరిట్ సైనికుడు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nandi Awards of year 2006". greenmangos.net. Archived from the original on 2012-10-29. Retrieved April 8, 2013.
  2. "Nandi Awards 2006 Winners List". telugucinemass.blogspot.in. Feb 14, 2008. Archived from the original on 2018-02-04. Retrieved April 8, 2013.

వెలుపలి లంకెలు

మార్చు