చర్చ:ఆర్థర్ కాటన్

తాజా వ్యాఖ్య: చిత్రాలచేర్పు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఆర్థర్ కాటన్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2017 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

చిత్రాలచేర్పు

మార్చు

ఆర్థర్ కాటన్ వ్యాసంలో,ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాల చిత్రాలను చేర్చవచ్చునా?.దయచేసితెలుపగలరు.పాలగిరి (చర్చ) 03:47, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి ఆర్ధర్‍ కాటన్చేసిన కృషి వివరిస్తూ చిత్రాలను చేరిస్తే బాగుంటుంది. --t.sujatha (చర్చ) 04:27, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply
వ్యాసము చివరి భాగమున ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు, తదితర మయినవి "'చిత్రాలు"' విభాగము నందు చేర్చిన బావుంటుంది అని నా అభిప్రాయము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:14, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply
ధవళేశ్వరం ఆనకట్ట గురించి ప్రత్యేకమైన సమాచారంతో ఒక వ్యాసం చేస్తే బాగుంటుంది. కాలువలు, కోనసీమలో వ్యవసాయాన్ని దాని ప్రయోజనం మొదలైన విషయాలతో, కొత్తగా దాని మీద నిర్మించిన రోడ్డు గురించి కూడా చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 06:18, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply
నా సందేహానికి స్పందించి సలహలిచ్చినందుకు మీకు ధన్యవాదాలు.ప్రస్తుతానికి చిత్రమాలిక పేరుతో కాటన్ వ్యాసంలో చిత్రాలు చేర్చాను.ధవళేశ్వరం బ్యారేజి గురించి తగినంత సమాచారం సేకరించిన తరువాత,చిత్రాలను ఆవ్యాసంకు తరలిస్తాను.ధవళేశ్వరం గురించి తగినంత సమాచారం ప్రస్తుతం నావద్ద లేదు.పాలగిరి (చర్చ) 06:49, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply
వికీపీడియా:చొరవ_తీసుకుని_దిద్దుబాట్లు_చెయ్యండిచూడండి. దాని ప్రకారం ధైర్యంగా దిద్దుబాట్లు చేయడమే వికీ పద్ధతి. ఈ విషయం ఆవ్యాసం చర్చాపేజీలో వ్రాసి, {{సహాయం కావాలి}} మూస చేర్చితే చర్చసరియైనపేజీలో వుండి ముందుముందుకూడ వుపయోగంగా వుంటుంది. వికీపీడియా అంతటికీ సంబంధించిన చర్చా విషయాలు మాత్రమే ఇక్కడ చేర్చమనికోరుతున్నాను. --అర్జున (చర్చ) 09:17, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply
ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో ఆర్థర్ కాటన్ కృషి ఉన్నంత మాత్రాన ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించే యంత్రాల చిత్రాలనూ చేర్చే అవసరం లేదు. ఆ యంత్రాలకు కాటన్ కు ప్రత్యక్ష సంబంధం ఉండి ఉంటే మాత్రం కొన్ని చేర్చవచ్చు, అదీ వ్యాస పరిమాణానికి అనుగుణంగానే. 106.66.81.73 14:08, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఆనకట్ట నిర్మాణానికి వాడిన యంత్రాలను,ధవళేశ్వరం ఆనకట్ట వద్దనున్న 'కాటన్ మ్యూజియం ' లో ప్రదర్శనకు వుంఛారు.ఆయంత్రాలను ఎప్పుడు,ఎందుకువాడారో వివరణ ఫలకాలున్నాయి.వాటికి కాటన్ కు సంబంధం లేనిచో ఆయనకు సంబంధించిన మ్యూజియంలో వుంచరుకదా!పాలగిరి (చర్చ) 17:06, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఆనకట్టకు సంబంధించిన యంత్రాల చిత్రాలను ఒక విభాగంలో చేర్చితే తప్పులేదు. ఎందువలనంటే ఆ యంత్రాలు ఆ ఆనకట్టకు సంబంధించినవి మరియు కాటన్ కు సంబంధం గలవి.( కె.వి.రమణ- చర్చ 17:29, 13 ఫిబ్రవరి 2013 (UTC))Reply
పాలగిరిగారు ! అరుదైన చిత్రాలు చేర్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రాలను తొలగించకండి. కావాలంటే ధవళేశ్వరం ఆనకట్ట వ్యాసం ప్రారంభించి చిత్రాలను అందులోకి తరలిద్దాం ఈ ఆనకట్టకు ఆర్ధర్ కాటన్ ఎంతో కృషి చేసారు. ఆయన వ్యాసంలో ఈ చిత్రాలు ఉండడం పొరపాటేమి కాదు. ఆనకట్ట నిర్మాణం తరువాత గోదావరి నదిలో స్నానమాచరిస్తూ బ్రాహ్మణులు సంకల్పం చెప్పే సమయంలో ఆర్ధర్ కాటన్ పేరు స్మరించే వారని ఎక్కడో చదివాను. అంటే వారు ఈ ఆనకట్ట నిర్మాణంలో అంత పాలుపంచుకున్నారన్నమాట. --t.sujatha (చర్చ) 17:45, 13 ఫిబ్రవరి 2013 (UTC)Reply

గోదావరిలో స్నానం తరువాత బ్రాహ్మణులు పఠించిన స్మరణ శ్లోకం

నిత్య గోదావరిస్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యాంగ్లేయ దేశియం కాటనుంతం భగీరథం

పాలగిరి (చర్చ) 14:45, 14 ఫిబ్రవరి 2013 (UTC)Reply

వంశవృక్షం

మార్చు

కాటన్ వంశవృక్షం తయారుచేస్తే బాగుంటుంది. వీరిలో ముగ్గురు వ్యక్తులు భారతదేశంలో ఉన్నతస్థానాన్ని చేరి దేశానికి సేవచేశారు.--User:Rajasekhar1961

Return to "ఆర్థర్ కాటన్" page.