చింతలపాడు (చందర్లపాడు మండలం)

ఆంధ్ర ప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండల గ్రామం
(చింతలపాడు(చందర్లపాడు మండలం) నుండి దారిమార్పు చెందింది)

చింతలపాడు, ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన చందర్లపాడు నుండి 16 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1187 ఇళ్లతో, 4361 జనాభాతో 2093 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2202, ఆడవారి సంఖ్య 2159. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1231 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 13. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589180. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[2] [3]

చింతలపాడు (చందర్లపాడు మండలం)
పటం
చింతలపాడు (చందర్లపాడు మండలం) is located in ఆంధ్రప్రదేశ్
చింతలపాడు (చందర్లపాడు మండలం)
చింతలపాడు (చందర్లపాడు మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 16°39′25.668″N 80°16′49.260″E / 16.65713000°N 80.28035000°E / 16.65713000; 80.28035000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్
మండలంచందర్లపాడు
విస్తీర్ణం20.93 కి.మీ2 (8.08 చ. మై)
జనాభా
 (2011)
4,361
 • జనసాంద్రత210/కి.మీ2 (540/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,202
 • స్త్రీలు2,159
 • లింగ నిష్పత్తి980
 • నివాసాలు1,187
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521183
2011 జనగణన కోడ్589180

గ్రామ చరిత్ర

మార్చు

పాటిమట్టి కోట కట్టుకొని, జమీందారులు చింతలపాడులో ఉండేవారు, తర్వాత ముత్యాలకు మారారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

చింతలపాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ట్రాక్టరు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేట, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్ విజయవాడ 54 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప బాలబడి చందర్లపాడులో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నందిగామలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నందిగామలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, వివేకానంద ప్రాథమికోన్నత పాఠశాల, బ్రిల్లియంట్సు అప్పర్ ప్రైంకరీ పబ్లీకి పాఠశాల, శ్రీ వాణీ విద్యా నికేతన్, చింతలపాడులో ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

మార్చు

2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తుంగం శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం

మార్చు

ఇక్కడ నూకాలమ్మ తిరణాల ప్రతి ఏడాది మార్గశిర పౌర్ణమికి ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. దానికి ముందు రోజు చతుర్దశి నాడు పిండి వంటలతో బోనాలు సమర్పిస్తారు. తిరణాలలో ప్రభలు కడతారు. నూకాలమ్మ కందుకూరి తిమ్మయ్య ఆవుల దొడ్లో దాదాపు 90 సంవత్సరాల క్రితం వెలిసింది. చుక్క దున్న పోతును ప్రతి ఏటా తిరణాల ముందు బలి ఇస్తారు. ముఖాన తెల్లని మచ్చ, తోక చివర తెల్లగా ఉండే దున్నపోతుని చుక్క దున్నపోతు అంటారు. తిరణాలలో కోళ్ళు, మేకలు బలి ఇస్తారు. నూకానమ్మ గుడికి ఈశాన్య భాగంలో నూకానమ్మ బావి ఉంది. ప్రతి రోజు అర్ధ రాత్రి ఈ బావి వద్ద నూకాలమ్మ స్నానం చేస్తుందని ప్రజల నమ్మకం. ప్రతి రోజూ నగర సంచారం చేస్తూ భూతప్రేతాల నుంచి గ్రామాన్ని కాపాడుతుందని నమ్మకం.

2014,డిసెంబరు-4, గురువారం నుండి 8వ తేదీ సోమవారం వరకు, ఈ దేవాలయంలో మార్గశిర పౌర్ణమి సందర్భంగా నిర్వహించు అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవాల వివరాలు:- మొదటిరోజు గురువారం నాడు బియ్యపుకోల, రెండవ రోజు శుక్రవారం నాడు అమ్మవారికి బోనాలు, మూడవరోజు శనివారం పౌర్ణమిరోజున అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం, ముద్రపూల కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, నాల్గవ రోజు ఆదివారం నాడు గంగపాలేటి వెళ్ళుట, సాంస్కృతిక కార్యక్రమాలు, ఐదవ రోజు సోమవారం నాడు దీనబండారు మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఐదురోజులూ భక్తులు, అమ్మవారికి విశేష అలంకరణలు చేయుదురు. [2]ఈ దేవస్థానంలో కళ్యాణమండపం నిర్మించుటకు నిర్ణయించడమైనది. [2]

ఇతర దేవాలయాలు

మార్చు
  1. శివాలయం:- ఇక్కడ ఉన్న శివాలయం వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టీంచాడు. ఇందులో ఉన్న లింగం స్ఫటిక లింగం, ఇది చాలా అరుదైన గోధుమ వర్ణ లింగం. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 108 శివాలయాలు కట్టించాడు. శివాలాయనికి 12 ఎకరాల మెట్ట పొలం, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు దేవుడి మాన్యంగా ఇచ్చారు, మిరప కాయ, వేరు శనగ, పత్తి మొదలైన వాణిజ్యపంటలు ఈ మెట్ట పొలంలో పండుతాయి.
  2. రామాలయం: - సూర్యదేవర వారు కట్టీంచారు.
  3. ఆంజనేయాలయం:- సూర్యదేవర రామ్మోహన రావు కట్టీంచాడు.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

చింతలపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

చింతలపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 194 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 26 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 17 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 12 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 12 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 43 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1789 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 632 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1200 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

చింతలపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 450 హెక్టార్లు
  • చెరువులు: 250 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 500 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

చింతలపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, ప్రత్తి, మిరప

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

బియ్యం

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4499. ఇందులో పురుషుల సంఖ్య 2323, స్త్రీల సంఖ్య 2176, గ్రామంలో నివాసగృహాలు 1024 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2093 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

మార్చు