చిట్టూర్పు
చిట్టూర్పు, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 132., యస్.టీ.డీ.కోడ్ = 08671.
చిట్టూర్పు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి చాట్రగడ్డ నాగలక్ష్మి |
జనాభా (2011) | |
- మొత్తం | 2,501 |
- పురుషులు | 1,271 |
- స్త్రీలు | 1,230 |
- గృహాల సంఖ్య | 704 |
పిన్ కోడ్ | 521132 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామ చరిత్రసవరించు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
ఘంటసాల మండలంసవరించు
ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
ఈ గ్రామానికి సమీపంలో యార్లగడ్డ, వేములపల్లి, కొత్తపల్లి, పురిటిగడ్డ, వెలివోలు గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు
కొత్తమాజేరు, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల,చిట్టూర్పు
గ్రంథాలయంసవరించు
- ఈ గ్రామానికి చెందిన ప్రముఖ కవి శ్రీ పింగళి లక్ల్ష్మీకాంతం, గ్రామానికి చెందిన శ్రీ పరుచూరి హనుమంతరావుల సారథ్యంలో, గ్రామస్థులు, దాతల సహకారంతో, ఈ గ్రంథాలయాన్ని, బ్రిటిషువారి ఏలుబడిలో, 1945లో నిర్మించారు. [7]
- చిట్టూర్ఫు గ్రామంలో చాలా సంవత్సరాలక్రితం మూతబడిన గ్రంథాలయాన్ని, 2014, ఆగస్టు-21 నాడు, రాష్ట్ర గ్రంథాలయ సంఘ కార్యదర్శి శ్రీమతి శారద, పునఃప్రారంభించారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-22; 2వపేజీ]
- ఈ గ్రంథాలయం శిథిలావస్థకు చేరడంతో, కీ.శే.పరుచూరి హనుమంతరావు ఆకాంక్ష మేరకు, వారి కుమారులు శ్రీ నరేంద్ర, మహేంద్ర, 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, అదే స్థలంలో నూతన గ్రంథాలయం నిర్మించడానికై, 2016,ఫిబ్రవరి-10న భూమిపూజ నిర్వహించారు. [7]
గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
- జోడుగూడెం గ్రామం, చిట్టూర్పు గ్రామపంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
- 2013 జూలైలో చిట్టూర్పు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి చాట్రగడ్డ నాగలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ రంగారావు ఎన్నికైనారు. [3]
- ఈ పంచాయతీ ఏర్పడి, 2015,సెప్టెంబరు-19వ తెదీ నాటికి, 59 సంవత్సరాలు పూర్తిచేసుకొని, 60వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినది. [6]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
- శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయం.
- శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో రెండు దశాబ్దాలుగా పూజాదికాలు నిర్వహించుటలేదు. వర్షాభావ పరిస్థితులలో, 2015,సెప్టెంబరు-9వ తెదీనాడు, వరుణుడి కరుణ కోసం, గ్రామస్థులంతా ఐక్యంతో, గంగానమ్మ ఆలయం వద్ద, మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. గంగానమ్మ, పోతురాజుస్వాములవార్లకు, 108 బిందెలతో జలాభిషేక పూజలను నిర్వహించారు. మహిళలు పెద్ద యెత్తున చలిమిడి, పొంగళ్ళతో విశేషపూజలు నిర్వహించారు. రావిచెట్టు వద్ద పసుపు, కుంకుమలతో శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. [5]
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులుసవరించు
- పింగళి లక్ష్మీకాంతం
- పరుచూరి హనుమంతరావు
- అరిపిరాల విశ్వం:- ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక గురువు.
- కె. విద్యాసాగర్:- ఈ గ్రామానికి చెందిన ఈ 6వ తరగతి విద్యార్థి, 2012 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలలో మొదటిసారి పాల్గొని, ఉత్తమ బాలనటుడిగా "నంది" బహుమతి సాధించాడు.[3]
- శ్రీ పరుచూరి కుటుంబరావు:- సీనియర్ సి.పి.ఎం.నేతగా వీరు దివిసీమలో జరిగిన అనేక ప్రజాహిత ఉద్యమాలలో పాల్గొన్నారు. వీరు 2015,జులై-20వ తేదీన, 82 సంవత్సరాల వయస్సులో, తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూసినారు. [4]
గ్రామ విశేషాలుసవరించు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 2,501 - పురుషుల సంఖ్య 1,271 - స్త్రీల సంఖ్య 1,230 - గృహాల సంఖ్య 704
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2730.[4] ఇందులో పురుషుల సంఖ్య 1355, స్త్రీల సంఖ్య 1375, గ్రామంలో నివాసగృహాలు 777 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 908 హెక్టారులు.
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Chitturu". Retrieved 25 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ ఈనాడు, విజయవాడ, జనవరి 30, 2013, పేజీ 8
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.
వెలుపలి లింకులుసవరించు
[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జనవరి-10; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జులై-22; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-10; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-19; 2వపేజీ. [7] ఈనాడు అమరావరి/అవనిగడ్డ; 2016,ఫిబ్రవరి-11; 2వపేజీ.