వెలివోలు

భారతదేశంలోని గ్రామం

వెలివోలు, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 132., యస్.టీ.డీ.కోడ్ = 08671.

వెలివోలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తలశిల విజయకుమారి
జనాభా (2011)
 - మొత్తం 1,489
 - పురుషులు 730
 - స్త్రీలు 759
 - గృహాల సంఖ్య 504
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలంసవరించు

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో వక్కలగడ్డ, పురిటిగడ్డ, నడకుదురు, చిట్టూర్పు, నిమ్మగడ్డ గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

భట్టిప్రోలు, చల్లపల్లి, మొవ్వ, కొల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 53 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సి.బి.సి.ఎన్.సి. స్కూల్, వెలివోలు

గ్రామ పంచాయతీసవరించు

  1. 2013 జూలైలో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తలశిల విజయకుమారి, 28 ఓట్ల ఆధిక్యంతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  2. ఈ గ్రామ పంచాయతీ భవనం 1971, నవంబరు-15న ప్రారంభించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. [4]
  3. ఈ గ్రామం 2013 సంవత్సరానికి, నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి, కార్యదర్శి, 2015,ఆగస్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా అందుకుంటారు. [6]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

  1. శ్రీ దేవభక్తుని రామకృష్ణప్రసాదు, కృష్ణవేణి కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమితి, అధ్యక్షులు.
  2. ఈ గ్రామానికి చెందిన కీ.శే.దేవాభక్తుని రామకృష్ణప్రసాదు గారి కుమారుడు శ్రీ దేవభక్తుని అవినాష్ చౌదరి, 2015,మే నెల-22వ తేదీనాడు, కృష్ణవేణి కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [5]

గ్రామ విశేషాలుసవరించు

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 3 గ్రామాలను ఎంపిక చేయగా, ఆ మూడు గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [3]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1537.[3] ఇందులో పురుషుల సంఖ్య 741, స్త్రీల సంఖ్య 796, గ్రామంలో నివాస గృహాలు 432 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 353 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 1,489 - పురుషుల సంఖ్య 730 - స్త్రీల సంఖ్య 759 - గృహాల సంఖ్య 504

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Velivolu". Retrieved 25 June 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-20; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-3; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే నెల-23వతేదీ; 2వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగస్టు-21; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=వెలివోలు&oldid=2864555" నుండి వెలికితీశారు