ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు

ఆదివిష్ణుగా సుపరిచితుడైన ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు (సెప్టెంబర్ 5, 1940 - జనవరి 6, 2020) హాస్య రచయిత, నాటక రచయిత, సినిమా రచయిత.[1]

ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు
Adivishnu.jpg
ఆదివిష్ణు
జననంఆదివిష్ణు విఘ్నేశ్వరరావు
సెప్టెంబర్ 5, 1940
మచిలీపట్నం, కృష్ణా జిల్లా
మరణంజనవరి 6, 2020
వృత్తిఛీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (రిటైర్డ్)
ప్రసిద్ధిరచయిత
తల్లిదండ్రులులక్ష్మీనరసమ్మ, నాగయ్య
సంతకంAdivishnu sign.jpg

జననం - విద్యాభ్యాసంసవరించు

ఆదివిష్ణు 1940, సెప్టెంబర్ 5, వినాయక చవితి పండుగనాడు బందరులో లక్ష్మీనరసమ్మ, నాగయ్య దంపతులకు జన్మించాడు. అందువలన వారి తల్లిదండ్రులు ఆయనకు విఘ్నేశ్వరరావు అని నామకరణం చేసారు. ఆయన హిందూ కళాశాలలో బి.కామ్ చదివాడు.

ఉద్యోగంసవరించు

ఆంధ్రపదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రజా సంబంధాల శాఖకు ప్రధాన అధికారిగా పనిచేస్తూ 1998 సెప్టెంబరు నెలలో పదవీ విరమణ చేశాడు.

రచనారంగంసవరించు

కాలేజీ రోజుల్లోనే 1959 నుంచి కథలు నవలలూ, నాటకాలు రాయడం ప్రారంభించి, ఆ తర్వాత సినిమాలకు రాయడం మొదలు పెట్టాడు. ఉద్యోగం చేస్తూనే సుమారు 40 చిత్రాలకు కథలు వ్రాసాడు. ఈయన రాసిన "అహనా పెళ్ళంట" చిత్రం హాస్య చిత్రాలలో కొత్త వరవడిని సృష్టించింది. ఉషాకిరణ్ మూవీస్ కథా విభాగంలో రెండేళ్లు పనిచేశాడు.[2]

ఆయన కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు "అనంతం" అనే నాటకంలో నటించి ఉత్తమ నటునిగా ప్రైజ్ ను పొందాడు. ఆయన లఘు కథలు ప్రముఖ సాహిత్య పత్రికలైన "భారతి", "జ్యోతి", "ఆంధ్రపత్రిక" లలో ప్రచురింపబడ్డాయి. ఆయనను ప్రముఖ లఘు కథా రచయిత సింగరాజు రామచంద్రమూర్తి లఘు కథలు వ్రాయుటకు ప్రోత్సహించాడు.

తరువాత ఆయన సాంఘిక నాటకాలలో విశేష ఖ్యాతి పొందిన నటుడు కె.వెంకటేశ్వరరావును కలిశాడు. వెంకటేశ్వరరావు ఆదివిష్ణు వ్రాసిన లఘుచిత్రాలకు యిష్టపడి ఆయన నాటక మండలికి ఒక నాటకం వ్రాయమని అభ్యర్థించాడు. ఆ అభ్యర్థన మేరకు ఆయన "అరకురాణి" అనే నాటకాన్ని వ్రాశాడు. కానీ ప్రజలు ఈ నాటకాన్ని ఆదరించలేదు. అరువాత ఆయన ట్రాజెడీ, కామెడీ ఉపయోగించి "మంచుతెర" అనే నాటకాన్ని వ్రాశాడు. ఈ నాటకాన్ని ప్రజలు ఆదరించారు. మంచి జనాదరణ పొందింది.

రచనలుసవరించు

1960 ప్రాంతాల్లో ఆదివిష్ణు గారి నవలలు, నాటకాలు, నాటికలు, కథానికలు ఎంతో మంది పాఠకుల్ని అలరించాయి. సెంటిమెంట్ ప్రధానంగా హాస్య వ్యంగ్య ధోరణుల్లో సాగి, గిలిగింతలు పెడతాయి ఆయన రచనలు. చిన్న చిన్న వాక్యాలతో రచనను పరుగెత్తించడంలో దిట్ట. అతి చిన్న వయసులో ఆదివిష్ణు వ్రాసిన “మనిషి-మిధ్య ఆంధ్రప్రభ నచిత్రవారపత్రిక నవలల పోటీలో ప్రథమ ఐహుమతి పొందింది. రెండో నవల - "తొలిమజిలి", "భారతి" మాస పత్రిక పాఠకులు మెచ్చినదే కాదు, రచయితలకు నచ్చింది. 1962 జూన్ భారతిలో ఈ నవల ప్రచురితమైంది.[3],[4]

కథాసంపుటాలుసవరించు

 1. ఉద్యోగం
 2. కథలు పది
 3. కలెక్టరూ క్షమించు
 4. నీలాంటి ఒకరు
 5. సరిగమలు
 6. ఆదివిష్ణు కథానికలు [5]

నవలలుసవరించు

 1. స్నేహం
 2. తొలి మజిలీ
 3. సత్యం గారి ఇల్లు
 4. శివతాండవం
 5. నీలాంటి ఒకరు
 6. మా నాన్న ప్రేమకథ
 7. మనిషి - మిథ్య
 8. ప్రాప్తం
 9. సగటు మనిషి
 10. అంతేరా... బామ్మర్దీ[6]

నాటకాలు/నాటికలుసవరించు

 1. మంచుతెర
 2. రాతిమనిషి
 3. ఇది ఆత్మహత్య
 4. బొమ్మా - బొరుసు
 5. సిద్ధార్థ
 6. మిష్టర్ మేజర్
 7. వందనోటు
 8. అతిథి దేవుళ్లొస్తున్నారు
 9. వాళ్లిద్దరిలో వీళ్లుముగ్గురు
 10. నథింగ్ బట్ ట్రూత్
 11. పండగొచ్చింది
 12. వాంటెడ్ ఫాదర్
 13. చూడు చూడు నీడలు
 14. ఎంతెంత దూరం
 15. చౌకభర్త
 16. మీ ఇంట్లో పులి ఉందా?
 17. ఇది భ్రమేషియా!
 18. మార్నింగ్ షో...
 19. అందమే ఆనందం!

సినిమా రంగంసవరించు

 1. సుందరి సుబ్బారావు - స్క్రీన్ ప్లే
 2. అహ నా పెళ్ళంట - కథ
 3. జయమ్ము నిశ్చయమ్మురా - కథ
 4. ప్రేమా జిందాబాద్ - కథ
 5. బాలమిత్రుల కథ - సంభాషణలు
 6. ఇదాలోకం - సంభాషణలు
 7. కన్నెవయసు - సంభాషణలు
 8. నిజరూపాలు - సంభాషణలు

పురస్కారాలుసవరించు

 1. 1984లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా సుందరి సుబ్బారావు సినిమాకు గాను నంది పురస్కారం.
 2. ఆంధ్రపత్రిక నిర్వహించిన నవలల పోటీలో మనిషి - మిథ్య నవలకు ప్రథమ బహుమతి.

మరణంసవరించు

ఆదివిష్ణు 2020, జనవరి 6న మరణించాడు.[7]

మూలాలుసవరించు

 • సాహితీ కిరణం మాసపత్రిక ఏపిల్ 2015 సంచికలో ఆదివిష్ణుతో సంభాషణ పేజీలు:10-11
 1. Adivishnu is a writer.
 2. గూగుల్ బుక్స్, encylopedia of indian literature, page no. 85
 3. "కథాజగత్‌లో తొలిమజిలి". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-31.
 4. ఆదివిష్ణు గారి నవలలు 1
 5. Books from Author: Adivishnusubscribe
 6. Anthera Bammeridi
 7. ప్రజాశక్తి, ఫీచర్స్ (8 January 2020). "సునిశిత హాస్యానికి అక్షరముద్ర ఆదివిష్ణు". www.prajasakti.com. సమత. Archived from the original on 29 ఫిబ్రవరి 2020. Retrieved 29 February 2020.

ఇతర లింకులుసవరించు