చెన్నూరు కృష్ణమూర్తి
చెన్నూరు కృష్ణమూర్తి (1931 - 2005) రంగస్థల నటుడు, ఉపాధ్యాయుడు. కళాతపస్వి నటరాజ బిరుదాంకితుడు.[1]
చెన్నూరు కృష్ణమూర్తి | |
---|---|
జననం | 1931 |
మరణం | 2005 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, ఉపాధ్యాయుడు |
జననం - విద్యాభ్యాసం
మార్చుకృష్ణమూర్తి 1931లో నెల్లూరు జిల్లా, గూడూరు సమీపంలోని చెన్నూరు లో జన్మించాడు. ఎం.ఏ., బి.ఇడి. పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు.
రంగస్థల ప్రస్థానం
మార్చుపాఠశాల రోజుల్లోనే పర్వతనేని రామచంద్రారెడ్డితో కలిసి రామదాసు నాటకంలో శ్రీరాముడుగా నటించాడు. ఆ తరువాత నగరాజకుమారితో రంగూన్ రౌడి నాటకంలో మోహనరావుగా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. 1973లో మద్రాసు పరిషత్తులో, 1979లో ప్రసిద్ధ పౌరాణిక, చారిత్రక సంబంధమైన దుర్యోధనుడు, బొబ్బిలి రాయుడు వంటి ఏకపాత్రాభినయాలను ప్రదర్శించి ఘన సన్మానాలందుకున్న ఈయన, ఛత్రపతి శివాజీ, మహామంత్రి తిమ్మరుసు, భగ్నజీవి, మురారి వంటి ఏకపాత్రాభినయ పాత్రలను పలుచోట్ల ప్రదర్శించాడు. కళారంగం కోసం కృషిచేసిన కృష్ణమూర్తిని నెల్లూరు జిల్లాలోని పలు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో 1991, అక్టోబరులో కృష్ణమూర్తి రంగస్థల జీవిత స్వర్ణోత్సవం జరిగింది.
నటించిన పాత్రలు
మార్చుసినీరంగ ప్రస్థానం
మార్చునాటకరంగంలో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణమూర్తి సినిమాలలో కూడా నటించాడు.
మరణం
మార్చుఉపాధ్యాయు వృత్తిలో కొనసాగుతూనే ప్రవృత్తిగా ఎంచుకున్న నాటకరంగం కోసం తనవంతు కర్తవ్యాన్ని నిర్వహించిన కృష్ణమూర్తి 2005లో వాకాడు గ్రామంలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.264.