జయసింహ (1955 సినిమా)

1955 నాటి జానపద కథాచిత్రం.

జయసింహ ఎన్.టి.రామారావు కథానాయకునిగా, ఆయన స్వంత నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై డి.యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన 1955 నాటి జానపద కథాచిత్రం.

జయసింహ
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి యోగానంద
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి,
వహీదా రహమాన్,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎస్.వి. రంగారావు,
కాంతారావు,
రేలంగి,
రాజనాల కాళేశ్వరరావు
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

మాళవదేశ మహారాజు మరణించగా అతని తమ్ముడు రుద్రసింహుడు (యస్.వి.రంగారావు) పరిపాలిస్తున్నాడు. గతించిన రాజు కుమారుడు, రాజ్యానికి వారసుడు జయసింహుడు (యన్.టి.రామారావు). రుద్రసింహుని కుమారుడు విజయసింహుడు (కాంతారావు). రాజ్యాన్ని పూర్తిగా కబళించడానికి వారసుడైన జయసింహుని అంతమొందించడానికి రుద్రసింహుడు రెండుసార్లు ప్రయత్నిస్తాడు. ఇది తెలిసిన జయసింహుడు రాత్రికిరాత్రి దేశం విడిచి వెళ్ళిపోతాడు.

పొరుగుదేశపు రాజును శత్రువులు బంధిస్తారు. అతని కుమార్తెను దొంగలు అపహరిస్తారు. ముందుగా రాజకుమారి (వహీదా రెహమాన్) ని, ఆ తరువాత మహారాజుని రక్షిస్తాడు జయసింహుడు. పరదేశంలో తనపేరు భవానీ అని చెప్పుకుంటాడు. జయసింహుడు ఆ రాజ్యంలో రణధీర్ (గుమ్మడి) అనే వీరుని ఇంట ఆశ్రయం పొందుతాడు. రణధీర్ కొడుకు సుబుద్ధి (రేలంగి), కూతురు కాళింది (అంజలీదేవి). కాళింది తన ఇంటిలోవున్న జయసింహుని ప్రేమిస్తుంది. జయసింహుడు, రాజకుమారి అంతకుముందే ప్రేమించుకున్నారు. రాకుమారిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు సేనాధిపతి (రాజనాల). రుద్రసింహుడు పంపిన ప్రచండుడు, సేనాధిపతి ఇద్దరూ కలిసి వ్యూహం పన్ని మహారాజును బంధిస్తారు. వారిని రక్షించడానికి వెళ్ళిన జయసింహుని కూడా బంధిస్తారు. జయసింహుడు తనను సోదరిలా భావిస్తున్నాడని తెలుసుకున్న కాళింది త్యాగబుద్ధితో జయసింహుని రక్షించి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతుంది. విజయసింహుని సహాయంతో జయసింహుడు శత్రుసంహరం చేస్తాడు. రాజద్రోహి అయిన రుద్రసింహుడు కూడా కొడుకు చేతిలో మరణిస్తాడు. జయసింహుడు రాజ్యాధికారాన్ని చేబడతాడు.

నిర్మాణం

మార్చు

అభివృద్ధి

మార్చు

1953లో నిర్మాణం ప్రారంభించిన ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు నిర్మించిన పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. మంచి సందేశాత్మకమైన సాంఘిక చిత్రాలు రెండూ వరుసగా పరాజయం పాలు కావడంతో, రామారావు విజయం సాధించాలన్న పట్టుదల ఏర్పడింది.[1] ఆ సమయంలో ఆయనని వేంకట పార్వతీశ కవులు రాసిన వీరపూజ నవల బాగా ఆకట్టుకుంది. ఆ నవలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు.[2]

విడుదల, స్పందన

మార్చు

సినిమా 1955లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. జానపద చిత్రాలను ప్రేక్షకులు విజయవంతం చేస్తున్నారన్న ఒరవడిని నిరూపిస్తూ, నిర్మాతగా ఎన్టీఆర్ కి తొలి విజయంగా నిలిచింది.[1] జయసింహ' చిత్రం అఖండ విజయం సాధించింది... ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.[3]

నట బృందం

మార్చు

సాంకేతిక బృందం

మార్చు

పాటలు

మార్చు

సాహిత్య రచన సముద్రాల రాఘవాచార్య, స్వర కల్పన/సంగీతం టి.వి.రాజు

పాట రచయిత సంగీతం గాయకులు
ఈనాటి ఈ హాయీ...కలకాదోయి నిజమోయీ సముద్రాల టి.వి.రాజు ఘంటసాల , పి.సుశీల
జయజయ శ్రీరామా రఘువరా శుభకర శ్రీరామా సముద్రాల టి.వి.రాజు ఘంటసాల
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం సముద్రాల టి.వి.రాజు ఘంటసాల , బాలసరస్వతి
 1. అరే నిసగమప లొకం మోసం పమగరిస మోసం మోసం అంటారంటా - పిఠాపురం
 2. ఈనాటి ఈ హాయీ కలకాదోయి నిజమోయీ - పి.లీల, ఘంటసాల
 3. కృతకయతికి పరిచర్యకు చతురత నియమించు (పద్యం) - ఘంటసాల
 4. కొండమీద కొక్కిరాయీ కాలుజారి కూలిపోయే - కె. రాణి
 5. జయజయ శ్రీరామా రఘువరా శుభకర శ్రీరామా - ఘంటసాల
 6. జీవితమింతేలే మానవ జీవితమింతేలే - ఎం. ఎస్. రామారావు
 7. తందానా హోయ తందానా తానితందన (బుర్రకథ) - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం
 8. నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామి నా సామి - ఎ.పి.కోమల
 9. నడియేటిపై నడచు పడవలా నా పడుచు గుడికాడ బావికి - పిఠాపురం
 10. నరువలచిన సోదరిమనసెరిగిన హరి (పద్యం) - ఘంటసాల
 11. నెల నడిమి వెన్నెల హయీ కనబడదు అమాస రేయి - జిక్కి
 12. మదిలోని మధురభావం పలికేను మోహన రాగం - ఆర్. బాలసరస్వతీ దేవి,ఘంటసాల
 13. మనసైనా చెలీ పిలుపు వినరావేలా ఓ చందమామా - ఆర్. బాలసరస్వతీ దేవి,ఎ.పి.కోమల
 14. మురిపెము మీరా మీ కోరిక తీరా వారంపిన కానుకలే - ఎ.పి.కోమల, కె. రాణి.
 15. . మింటిపైనవెలుగారిపోయే.ఘంటసాల.

వనరులు

మార్చు
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
 2. ఎంబి.ఎస్., ప్రసాద్. "జానపద చిత్రాలు - 01". గ్రేటాంధ్ర. Retrieved 18 September 2015.
 3. ఆంధ్రజ్యోతి (21 October 2015). "అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'జయసింహ'". Retrieved 13 October 2017.[permanent dead link]