చేజెర్ల (నకిరికల్లు)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, నకరికల్లు మండలంలోని గ్రామం
(చేజర్ల నుండి దారిమార్పు చెందింది)


ఇదే పేరు గల నెల్లూరు జిల్లాలోని మరొక మండలం, గ్రామం కోసం చేజెర్ల చూడండి.

చేజెర్ల (నకిరికల్లు)
కపోతేశ్వరస్వామి అలయ ప్రవేశ ద్వారం, చేజర్ల
కపోతేశ్వరస్వామి అలయ ప్రవేశ ద్వారం, చేజర్ల
పటం
చేజెర్ల (నకిరికల్లు) is located in ఆంధ్రప్రదేశ్
చేజెర్ల (నకిరికల్లు)
చేజెర్ల (నకిరికల్లు)
అక్షాంశ రేఖాంశాలు: 16°17′N 79°51′E / 16.283°N 79.850°E / 16.283; 79.850
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలంనకరికల్లు
విస్తీర్ణం
16.56 కి.మీ2 (6.39 చ. మై)
జనాభా
 (2011)
4,094
 • జనసాంద్రత250/కి.మీ2 (640/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,050
 • స్త్రీలు2,044
 • లింగ నిష్పత్తి997
 • నివాసాలు1,093
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522615
2011 జనగణన కోడ్590049

చేజెర్ల, పల్నాడు జిల్లా, నకరికల్లు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన నకరికల్లు నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1093 ఇళ్లతో, 4094 జనాభాతో 1656 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2050, ఆడవారి సంఖ్య 2044. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 731 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 517. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590049[1].ఇది నరసరావుపేటకు సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది.చేజర్ల లోని కపోతేశ్వర ఆలయం ఎకరా పరిధిలో ఉంది. కొత్తగా చట్టం చేసిన నేపథ్యంలో సగం గ్రామం వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించే అవకాశం లేకుండా పోనుంది. మొత్తం గ్రామంలో 1200 వరకు ఇళ్లు ఉన్నాయి. ఆలయాన్ని ఆనుకొని ఎన్నో నివాసాలు ఉన్నాయి. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవల కొలతలు చేపట్టిన పురావస్తు శాఖ అధికారులు హద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం గ్రామంలోని బొడ్డురాయి వరకు కట్టడాలను నిషేధించారు.

గ్రామ చరిత్ర

మార్చు

పూర్వం చేరుంజర్ల, చేంజర్లలుగా పిలువబడిన ఈ చారిత్రక గ్రామానికి దాదాపు 2 శతాబ్దాల చరిత్ర ఉంది. ఆనంద గోత్రిజ రాజు అత్తివర్మ తండ్రి సా.శ.3వ శతాబ్దంలో వేయించిన శాసనం మొదలు పలు రాజవంశాలకు చెందిన చక్రవర్తుల శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

గ్రామనామ వివరణ

మార్చు

చేజెర్ల అనే పేరులో చే అనే పూర్వపదం, జెర్ల అనే ఉత్తరపదం ఉన్నాయి. వీటిలో చే అనేది వర్ణసూచి కాగా, జెర్ల అనే పదం చెర్లకి రూపాంతరం. చెర్ల చెరువు (ల)కి రూపాంతరం. జెర్ల అనేది జలసూచి.[2]

సౌర విద్యుత్తు కేంద్రం

మార్చు

ఈ గ్రామంలో పల్నాడు సోలర్ పవర్ సంస్థ అధ్వర్యంలో, 30 కోట్ల రూపాయల వ్యయంతో, 5 మెగావాట్ల ఉత్పాదక శక్తిగల ఈ కేంద్రం రూపుదిద్దుకుంది. ఇది గుంటూరు జిల్లాలోనే తొలి సౌర విద్యుత్తు కేంద్రం. ఈ కేంద్రాన్ని చేజెర్ల విద్యుత్తు ఉపకేంద్రానికి అనుసంధానం చేయడంతో, నరసరావుపేట సబ్-డివిజను పరిధిలోని పలు గ్రామాలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్తు అందిస్తుంది. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన వేళల ప్రకారం విద్యుత్తు సరఫరా జరుగుతుంది.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,823. ఇందులో పురుషుల సంఖ్య 1,904, స్త్రీల సంఖ్య 1,919, గ్రామంలో నివాస గృహాలు 915 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,656 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి నకరికల్లులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నరసరావుపేటలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

చేజెర్లలో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

చేజెర్లలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ఆటో సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

కపోతీశ్వరాలయం

మార్చు
 
చేజర్ల కపోతేశ్వరాలయం దృశ్య చిత్రం,

చేజెర్లలో కపోతీశ్వరాలయం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది జాతీయ స్మారక కట్టడం. మహారాష్ట్ర లోని "తేర్", చేజెర్ల రెండు స్థలాలలోను ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు తరువాత హైందవ శైవాలయాలుగా మార్చబడ్డాయిఅని పరిశోధకులు భావిస్తారు. చేజెర్లలోని శైవాలయాన్ని "కపోతేశ్వరాలయం" అంటారు. ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరంనుండి ఉద్భవించిందని స్థల పురాణ గాథ. శిబికి, కపోతానికి (పావురానికి) ఉన్న సంబంధం గురించి ఒక హిందూ గాథ, ఒక బౌద్ధ గాథ రెండు ఉన్నాయి.[3]

స్థల పురాణం

మార్చు
 
చేజర్ల కపోతేశ్వరాలయం ఆవరణలో ఉన్న ఇతర దేవాలయాలు

మహాభారతంలోని కథ - మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. మేఘదాంబరుడు అన్న అనుమతితో 1500 మంది పరివారం వెంటబెట్టుకొని కాష్మీర దేశం విడచి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపో దీక్షనాచరించి కాలం చేశాడు. కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. అన్న తిరిగి రానందున అతనిని వెదుకుతూ జీమూతవాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండవద్దకు వచ్చాడు. అన్నకు జరిగిన విషయం విని ఆకొండపైనే తపమాచరించి తానూ మరణించాడు. తమ్ముళ్ళను వెతుక్కుంటూ శిబి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు. అక్కడ నూరు యజ్ఞాలు చేయ సంకల్పించాడు. నూరవ యాగం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షింపదలచారు. శివుడు ఒక వేటగాని వలెను, బ్రహ్మ అతని బాణం లాగాను, విష్ణువు ఒక కపోతం లాగాను అక్కడికి వచ్చారు.[4]

వేటగానితో తరమబడిన పావురం శిబి చక్రవర్తి శరణు జొచ్చింది. శిబి ఆ పక్షికి అభయమిచ్చాడు. అక్కడికి వేటగాడు వచ్చి ఆపావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను, తన కుటుంబం ఆకలితో అలమటిస్తారని చెప్పాడు. శిబి ఇరకాటంలో పడ్డాడు. చివరకు పావురం ఎత్తు మాంసం ఇస్తానని వేటగానిని ఒప్పించి, త్రాసులో పావురాన్ని ఒక వైపు ఉంచి, తన శరీరంలో కొంత మాంసాన్ని రెండవవైపు ఉంచాడు. అయినా అవి సరి తూగలేదు. చివరకు తన తల నరికి ఆ త్రాసులో పెట్టించాడు. అతని త్యాగ శీలతకు మెచ్చి దేవతలు అతనిని పునరుజ్జీవితుడిని చేసి వరం కోరుకోమన్నారు. తనకు, తన పరివారానికి కైలాస ప్రాప్తిని కోరుకొన్నాడు. పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు. అలా తల లేని శిబి మొండెమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం.

బౌద్ధ జాతక కథ - శిబిజాతకం కథ ప్రకారం శిబి చక్రవర్తి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రునికి దానం చేశాడు. అవసన సతకం కథ ఈ శిబిజాతక కథనూ, మహాభారత కథనూ అనుసంధానిస్తుంది. బౌద్ధ జాతక శిల్పాలలో శిబి కథ తరచు కనిపిస్తుంటుంది. అమరావతిలోను, నాగార్జున కొండ ఈ జాతక కథకు సంబంధించిన శిల్పాలున్నాయి.[3]

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

చేజెర్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1026 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 42 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 108 హెక్టార్లు
  • బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 475 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 253 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 334 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

చేజెర్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 334 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

చేజెర్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 235. Retrieved 10 March 2015.
  3. 3.0 3.1 Select Andhra Temples - Published by Govt of AP in 1970 - Archeological series no.30 - monograph by Dr. M. RAMARAO, M. A., Ph.D., Retired Professor of History
  4. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, రెండవ భాగము, 1960 ప్రచురణ, పేజీ సంఖ్య 525

వెలుపలి లంకెలు

మార్చు