చౌడవరం (వేంసూరు)
చౌడవరం,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి చెందిన గ్రామం.[1].
చౌడవరం | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°09′49″N 80°44′40″E / 17.163747°N 80.744440°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండలం | వేంసూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,923 |
- పురుషుల సంఖ్య | 973 |
- స్త్రీల సంఖ్య | 950 |
- గృహాల సంఖ్య | 535 |
పిన్ కోడ్ | 507302 |
ఎస్.టి.డి కోడ్ |
వేంసూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 535 ఇళ్లతో, 1923 జనాభాతో 1281 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 973, ఆడవారి సంఖ్య 950. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 313 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 616. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579898.[3] పిన్ కోడ్: 507302.
గ్రామ చరిత్ర
మార్చు- "చౌడవరం" ఈ పేరుకు కారణం ఏమనగా ఇక్కడి నేల చౌడు భూములకు నిలయం కాబట్టి చౌడవరంగా అవతరించింది. ప్రతి మనిషికి, కుగ్రామానికి, ఊరికి ఎంతో కొంత చరిత్ర ఉన్నట్లు ఈ ఊరికి చిన్న చరిత్ర ఉంది. మరో చారిత్రక వివరణ ప్రకారం గణపతిదేవుని సైన్యాధికారి మల్యాల చౌండసేనాని పేరుమీదుగా ఏర్పడిన ఈ ప్రాంతం మొదట్లో చౌండసేనాని పేరుపై చౌండవరంగానూ తర్వాతి కాలంలో పలుకుబడిలో మార్పులతో చౌడవరంగా స్థిరపడివుండవచ్చన్నది మరోక వాదన. ఈ ప్రాంతానికి దగ్గరలోనే కాకతి బేతరాజు పేరుపై నిర్మించిన ఊరు బేతుపల్లి ఉండటం గమనించవలసిన విషయం. అదేవిధంగా వరంగల్ సమీపంలోని కొండపర్తిలో గణపతిదేవుని సైన్యాధికారి మల్యాల చౌండసేనాని పేరు మీదుగా చౌండ సముద్రం చెరువును నిర్మించాడాన్ని గమనించినా ఆ కాలంలో చౌండసేనాని ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటూ అతని పేరుమీదుగా ఊరు ఏర్పడి వుంటుందనేది కొట్టేయలేము. నిజానికి ఈ ప్రాంతంలోని భూములు చౌడు భూములు కాదు. మంచి నీటి వసతి సైతం లభిస్తూ రెండు మూడు పంటలు పండే సామర్ధ్యం వున్న పంట పొలాలు. అందుకే మొదటి కారణం కంటే చౌండసేనాని పేరుపై ఊరు ఏర్పడి వుంటుందనే భావనకు ఎక్కువ అవకాశం ఉంది. మరింత పరిశోధన చేస్తే ఈ ప్రాంతంలో కాకతీయ పాలనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది. చౌండసేనాని: రుద్రదేవుడి వద్ద మంత్రిగా పనిచేసిన కాటమసేనాని రెండవ కొడుకే ఈ చౌండసేనాని. కాకతీయ సామంతులలో మల్యాల వంశ రాజులు ప్రముఖులు.వారిలో చౌండసేనాని తన ప్రతిభాపాటవాలు,జనరంజక కార్యక్రమాల ద్వారా చిరకాల కీర్తిని పొందాడు.కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. కొండపర్తి గ్రామం ఇతని నివాసం.
- ఈ గ్రామం మొదటగా హైదరాబాద్ రాష్ట్రంలో వరంగల్ జిల్లా మధిర తాలుకాలోనిది, తరువాత 1953 అక్టోబరు 1న పరిపాలనాసౌలభ్యం కొరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లా ఏర్పడింది. తరువాత మధిర తాలూకా, ఖమ్మం జిల్లాలోకి మారింది. తరువాత దానిని రెండు భాగాలుగా చేసి సత్తుపల్లి తాలూకాను చేసారు, 1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళింది, ఎన్.టి.ఆర్. కాలంలో మండలాలు ఏర్పడినప్పుడు ఇది వేంసూరు మండలంలో కలిసింది.
- ప్రస్తుత చౌడవరం గ్రామానికి 100 సంవత్సవరాల చరిత్ర ఉంది. మొదట ఈ గ్రామం ప్రస్తుత గ్రామానికి 2 కి. మి. దూరంలో ఉండేది. దాని పేరు చౌడవరం కాని అక్కడ దొంగల భయం ఎక్కువగా ఉండటం వలన, గ్రామస్థులు బాగా భయపడేవారు, ప్రతి రోజు ఏదో ఒక ఇంట్లో దొంగతనం జరిగేది, దొంగలు గ్రామం చివర దొంగతనానికే పాకలు వేసుకొని ఉండేవారట, వాళ్ళు వాడుకొని విసిరేసిన చింత పండులోని గింజలతో చెట్లు మొలిచాయి. అవి ఇప్పటికి ఉన్నాయి కల్లూరుగూడెం పోయే దారిలో పెద్ద చెరువు కట్టమీద దర్శనమిస్తాయి. ఆ దొంగల బాధ తట్టుకోలేక గ్రామస్థులు గ్రామాన్నే మార్చారు. ఆ తరువాత గ్రామస్థులు, ప్రస్తుత గ్రామానికి కొద్ది దూరంలోనే నివాసాలు కట్టుకున్నారు. ఆగ్రామం పేరు సీతమ్మ పేట, అప్పటి దొరగారి భార్య పేరు సీతమ్మ. ఆమెకి పిల్లలు పుట్టకపోతే ఆమె పేరుతొ చెరువు తవ్వించి, ఊరిని స్థాపించింది కనుక ఆమె పేరు పెట్టారు.
- సీతమ్మపేట గ్రామ ముత్యాలమ్మ ఇప్పుడు దక్షిణ బజార్లో ఒక తోటలో ఉంది. ఆ ఊరు కూడా ఎక్కువ రోజులు లేదు. ఎందుకంటే ఆ ఊరు కట్టిన దగ్గర నుండి వారానికి ఒకరి చొప్పున చనిపోవడం మొదలుపెట్టారు. గ్రామస్తులకు భయం మొదలైంది.మరల గ్రామాన్ని మార్చి, పటిష్ఠంగా కట్టాలన్న ధ్యేయంతో సీతమ్మ పేటకి కొద్ది దూరంలోనే ఒక వేప చెట్టుని చూసి, ఒక కోడిని దాని కింద పొదగవేసారు. 21 రోజులు దానికి కాపలాగా ఉన్నారు.21 రోజులు పూర్తి అయ్యాయి కోడి ఒక్క గుడ్డు కూడా ఒదలకుండా అన్ని పిల్లలు చేయడం గ్రామస్తులకు ఆనందాన్ని ఇచ్చింది. ఇది వారికి మంచి ప్రదేశంగా భావించి వాస్తు కూడా చూడకుండా తొందరలో కట్టారు. దానికి ఫలితం పొలిమేర వూరి మద్య గుండా పోయింది, అదే జగన్నాధపురం అప్పటి దొర పేరు. తరువాత అయన భార్య పేరు సీతమ్మపేట.ఆ తరువాత ఇప్పటి గ్రామం పేరు చౌడవరం.
- జగన్నాధపురంగా అవతరించిన ప్రస్తుత గ్రామాన్ని, 2001 సంవత్సరం వరకు సీతమ్మ పేట, దొంగల చౌడవరం, అని పిలుస్తూ వచ్చారు, కాని రెవిన్యు శాఖ పరిధిలో ఈ గ్రామాం చౌడవరంగానే రికార్దులకు ఎక్కింది. అలా చౌడవరం గానే కొనసాగుతుంది. అప్పుడు పెద్దలు చేసిన తప్పుకి చౌడవరం రెండు పంచాయితీలుగా రోడ్డు చీల్చి, రోడ్డుకి ఎడమ చేతి వైపు పల్లెవాడ, కుడి వైపు యర్రగుంట పంచాయితీలలో కలిపారు. ఈ గ్రామ చరిత్ర ఇప్పటి యువకులకు తెలియక పొవచ్చు,
భౌగోళిక స్వరూపం
మార్చుతూర్పున కొత్త చౌడవరం గ్రామం, హరిజన వాడ, ముత్యాలమ్మ చివరి ప్రాంతం, పశ్చిమాన పల్లెవాడ గ్రామం, ఒక వాగు ఈ రెండు గ్రామాలను విడదీస్తుంది.
సౌకర్యాలు
మార్చుసాధారణంగా ఇది మారుమూల గ్రామం కనుక, ఎటువంటి బస్స్ సౌకర్యం లేదు, ఆటోలపై ఆధారపడి వెళ్ళాలి. ఖమ్మం జిల్లా కేంద్రం అయిన ఖమ్మంకి 70 కి.మీ హైదరాబాద్ కి 270 కి.మీ ఉంటుంది. సత్తుపల్లి నుండి ఖమ్మం ప్రధాన రహదారి 5 కి.మీ, సత్తుపల్లి నుండి విజయవాడ ప్రదాన రహదారి 7కి.మీ ఉన్నాయి. వేంసూరు మందల కేంద్రానికి 7 కి.మీ. లంకపల్లికి 5కి.మీ దూరం ఉంది. ప్రభుత్వ బస్సు ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆటోలు ఎక్కువ అవడం వలల దానిని తీసివేసారు.
విద్య
మార్చుఈ గ్రామంలో చాల వరకు యువతకు చదువు పైన శ్రద్ధ ఎక్కువే, 98% యువత చదువు పైన ఆసక్తి కనబరుస్తున్నారు, 10 వ తరగతి వరకు అందరు చదువుకున్నారు. ఆ పైన చదువులు కుటుంభ ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి నడుస్తుంది. ఈ మారుమూల గ్రామం నుండి యమ్.బి.ఎ., యమ్.సి.ఎ., బి.టెక్ .. వరకు చదివిన యువత ఈ గ్రామంలో ఉంది.
పాఠశాలలు
మార్చు- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.ఇది ప్రస్తుతం ఉన్న వూరికి తూర్పు బజారున ఉంది,చుట్టూ ఉన్న గ్రామాలకు ఈపాఠశాల కేంద్రం.ఈపాఠశాలకు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. కాని కొన్ని కారణాల వల్ల లోగడ ఆపాఠశాలను ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థలానికి మార్చారు, ఈ స్థలం గ్రామ పెద్దలలో ఒకరైన "అల్లు చిన్న లక్ష్మి నర్సా రెడ్డి" స్కూలుకు ఆయన పేరుతో ఈ స్థలాన్ని దానంగా రాసిచ్చారు. తరువాత ఇక్కడ 10 తరగతి వరకు రావడం వలన ఇక ప్రాథమిక పాఠశాలను ఇప్పుడున్న స్థలానికి మార్చారు.
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామంలో ఉంది. ఏడు, పదవ తరగతులకు పబ్లిక్ ఎగ్జామ్స్ కారణంగా గత 15-20 ఏళ్ల నుండి రాత్రి బడి కూడా నడుపుచున్నారు. ఈ రోజుల్లో కూడా ఒక గవర్నమెంట్ బడి ఇలా నడుస్తుందంటే ముక్కున వేలు ఎసుకునే వారు లేకపొలేదు.స్థాపించిన సంవత్సరం: 1992.బోధనాభాష తెలుగు, ఇంగ్లీసు.
- ఇది చుట్టూ ఉన్న పల్లెవాడ, రాజుగూడెం, యర్రసాని వారి బంజర్, కొత్త చౌడవరం గ్రామాలలో ఐదవ తరగతి చదివిన తరువాత ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే బాలబాలికలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వస్తారు.పదవ తరగతి పబ్లిక్ పరీక్షలనందు 2003-2004 లో లెక్కలలో 100/100 మార్కులు సాధించిన ఘనత ఈ స్కూల్ కి ఉంది.2005-2006 సం.నుండి లెక్కలలో 100/100 మార్కులు వచ్చిన వారి సంఖ్యా పెరుగుతూ వచ్చింది.
ఆసుపత్రి:
మార్చు- ప్రాథమిక వైద్య ఆసుపత్రి. ఇది ప్రస్తుత గ్రామానికి తూర్పున ఉంది
- పశు వైద్య శాల ఉంది.
దేవాలయంలు
మార్చు- పచ్సిమాన మదాసు వారి బాన అంకమ్మ దేవాలయం
- తూర్పున నాగవారి అంకమ్మ దేవాలయం
- ఊరి నడి బొడ్డున శ్రీ రాముని ఆలయం
- ఉత్తరాన ముత్యాలమ్మ దేవాలయం
- దక్షిణాన సీతమ్మ పేట ముత్యాలమ్మ దేవాలయం
- ఊరి నడి బొడ్డు నుండి పడమరకు తెలంగాణా సాంప్రదాయ బొడ్డు రాయిలు దర్శన మిస్తాయి
చెఱువులు
మార్చుఈ చెరువును మాజీ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు గారి హయాం లోనిది, ఈ చెరువు ఒక లక్ష ఎకరాలకు నీరందిస్తుంది. అంతే కాక చుట్టూ ఉన్న గ్రామాలకు మంచి నీటి ఎద్దడిని తీరుస్తుంది.ఈ చెరువులో 5 వాగులు కలుస్తాయి, అంతేకాక దీనికి నాగార్జునసాగర్ నీరు వస్తుంది. దీని నిర్మాణం జరిగే సమయంలో పల్లెవాడ, రాజుగూడెంని తిరిగి కట్టారు. చౌడవరం నుండి లంకపల్లికి పాత దారి అప్పటి పల్లెవాడ గ్రామం నుండే ఉండేది.ఈ మార్గం ఇంకా ఉంది.
ఖమ్మం జిల్లా లోనే పేరుగాంచిన "లంకసాగర్" ఊరికి పశ్చిమాన నిజం కాలం నాటి "సీతమ్మ వారి చెరువు" (దక్షిణాన) రాజుగూడెమ్ రోడ్డులో, ఇంకా చిన్న చిన్న చెరువులు కుంటలు చాలానే ఉన్నాయి
వ్యవసాయం
మార్చుఈ గ్రామంలో 98% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.ఇప్పుడిప్పుడే వ్యవసాయ దారుడు తమ తమ పిల్లలను చదివిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పంట భూమి ఉంది.అందులో వరి, ప్రత్తి ప్రధాన పంటలు. అవి కాక మొక్కజొన్న, చెరకు, మిరప, మామిడి సాగు లాంటి పంటలలో కూడా ఈ గ్రామం ముందంజలో ఉంది.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుచౌదారంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 380 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 377 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 524 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 222 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 302 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుచౌదారంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 1 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 82 హెక్టార్లు
- చెరువులు: 190 హెక్టార్లు
- ఇతర వనరుల ద్వారా: 29 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుచౌదారంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుసూపర్ మార్కెట్/ కిరాణం
మార్చుఒక హోల్ సేల్ కిరాణ దుకాణం, చికెన్ షాపులు, చిన్న చిన్న దుకాణాలు 10-15 వరకు కలవు,చుట్టూ ఉన్న గ్రామాలు ఈ గ్రామంపైనే ఆధారపడతాయి
వీధులు
మార్చుతూర్పు బజారు, పడమటి బజారు, ఉత్తరం బజారు, దక్షిణం బజారు
ఇతర విశేషాలు
మార్చుతెలంగాణ సంప్రదాయ పండగ "బతుకమ్మ పండుగ"
- శ్రీ రామ నవమి వేడుకలో గ్రామం మొత్తం రామాలయం లోనే ఉంటుంది, శ్రీ రాముని కళ్యాణం ఘనంగా నిర్వహించి పానకం, వడపప్పు భక్తులకు ప్రసాదంగా పెడ్తారు.
- తెలంగాణా సాంప్రదాయ పండుగగా ఆషాఢమాసంలో చేసే భోనాలపండుగ ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామాలలో శ్రావణ మాసంలో చేస్తారు.ఈ గ్రామంలో భోనాల పండుగ ముత్యాలమ్మ దేవత దగ్గర జరుపుతారు. అందుకే ఈ పండగను గ్రామంలో ముత్యాలమ్మ జాతర అని పిలుస్తారు.
- సాంప్రదాయం ప్రకారం పెద్దమ్మ తల్లి జాతర ఇక్కడ మిక్కిలి కన్నుల పండుగ...
- ఏడాదికి ఒక సారి గ్రామం మొత్తం చెన్న కేశవస్వామి సేవ చేయడం ఇక్కడి ఆనవాయితీ.
- గణేష్ ఉత్సవాలలో ఈ ఊరు ఎంతగా మునిగి పోతుందో చెప్పడం వర్ణనా తీతం
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".