జాతీయ జలమార్గం 4
జాతీయ జలమార్గం 4 (NW-4) 1,095 కిలోమీటర్ల పొడవైన జలమార్గం. దీన్ని భారత జాతీయ జలమార్గంగా ప్రకటించారు. ఇది తెలంగాణా, [1] [2] ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతుంది. తూర్పు తీరం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హామ్ కాలువలు, కృష్ణా, గోదావరి నదులలో కొంత భాగం ఈ జలమార్గంలో భాగాలు. జాతీయ జలమార్గాల బిల్లు, 2006 నిబంధనల ప్రకారం [3] నవంబర్ 2008న దీన్ని జాతీయ జలమార్గంగా ప్రకటించారు. దీన్ని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI)చే అభివృద్ధి చేస్తోంది. [4] 2013 నాటికి పూర్తి చేయాలని తలపెట్టినప్పటికీ 2022 నాటికి ఇంకా పని మొదలు కాలేదు. జాతీయ జలమార్గాల చట్టం, 2016 లో దీని నిడివిని 1,078 కి.మీ. (670 మై.) నుండి 2,890 కి.మీ. (1,800 మై.) కి కృష్ణా, గోదావరి నదులలో మరింత దూరాన్ని కలుపుతూ పొడిగించారు. [5] ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపడతారు. మొదటి దశను 2017 అక్టోబరులో మొదలుపెట్టి, 2019 జూన్ నాటికి పూర్తి చెయ్యాలని తలపెట్టారు [6]
జాతీయ జలమార్గం 4 (NW-4) | |
---|---|
Details | |
Location | కాకినాడ, చెన్నై, పుదుచ్చేరి |
Length | 1095 కి.మీ. |
No. of terminals | 15 |
Owner | ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా |
Operator | కేంద్రీయ అంతర్గత జలరవాణా సంస్థ (CIWTC) |
చరిత్ర
మార్చుభారతదేశంలో జాతీయ జలమార్గాలు
మార్చుభారతదేశంలో, జాతీయ జలమార్గాలను కేంద్ర ప్రభుత్వం ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) ద్వారా అభివృద్ధి చేస్తోంది. ఇది ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ (IWT) రంగానికి చెందిన నియంత్రణ సంస్థ. [7] 1985లో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం ద్వారా IWAI ను స్థాపించారు. దేశంలో జాతీయ జలమార్గాల అభివృద్ధి, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను దీనికి అప్పగించారు. ఇది అంతర్గత జలమార్గాలలో రవాణాను నియంత్రించడానికి, అభివృద్ధి చేయడానికీ ఏర్పరచిన చట్టబద్ధమైన స్వయంప్రతిపత్త సంస్థ. IWAIతో పాటు, సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (CIWTC) కూడా అంతర్గత జలమార్గాల ద్వారా సరుకు రవాణా, నౌకలు, రేవుల ఆపరేషను, నిర్వహణ ద్వారా దేశీయ జలరవాణా రంగానికి మద్దతు ఇస్తుంది. [8] భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ జలమార్గాలు NW-1,2 & 3 (అంచనా 1980 & 1993 మధ్యలో). వాటి మొత్తం పొడవు 2,716 కి.మీ. (1,688 మై.) .
NW-4, 5 & 6 అభివృద్ధి
మార్చు1993-95 నాటికి, IWAI కాకినాడ, చెన్నైలను కలుపుతూ సమీకృత కాలువను అభివృద్ధి చేయడానికి అధ్యయనాలను ప్రారంభించింది. భారత ప్రభుత్వం 2005 లో మరో మూడు జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించింది [9] 2006 జూలైలో, లోక్‌సభలో NW-4 అభివృద్ధి ప్రతిపాదనను షిప్పింగ్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి TR బాలు ప్రకటించాడు. [10] అప్పటికి ఉన్న మూడు జాతీయ జలమార్గాలకు అదనంగా, ప్రభుత్వం కింది అంతర్గత జలమార్గాలను కూడా జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది:
విడివిడిగా మార్గాల పొడవు (NW-4)
|
- NW-4 : గోదావరి, కృష్ణా నదులతో పాటు కాకినాడ - పాండిచ్చేరి కాలువలు ( 1,095 కి.మీ.)
- NW-5 : బ్రాహ్మణి నది, మహానది డెల్టాతో పాటు తూర్పు తీర కాలువ ( 623 కి.మీ.)
- NW-6 : బరాక్ నది ( 152 కి.మీ.)
2007 [11] ఇన్‌ల్యాండ్ వెస్సెల్స్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2005 ఆమోదంతో ఈ ప్రతిపాదనలు చట్టంగా మారాయి. 2008 అక్టోబరులో, జాతీయ జలమార్గాల బిల్లు, 2006 అనే మరొక బిల్లును పార్లమెంటులో ఆమోదించారు. కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హామ్ కాలువ, కలువెల్లి ట్యాంక్, భద్రాచలం - రాజమండ్రి నదుల మద్యన ఉన్న గోదావరి నది, వజీరాబాద్- విజయవాడ ల మధ్య నున్న కృష్ణా నది ఈ మార్గంలో భాగాలు.[12] తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ జలమార్గంలో వస్తాయి. [13][14] దీని అభివృద్ధికి ఏడు సంవత్సరాలు పడుతుంది. రూ. 1,515 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. [15]
మార్గం
మార్చుజాతీయ జలమార్గం 4 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
జాతీయ జలమార్గం NW-4 పొడవు దాదాపు 690 కి.మీ. కాలువలు,328 కి.,మీ. నదీ మార్గాలు ఉన్నాయి. నదీ మార్గంలో రెండు విభాగాలున్నాయి:
గోదావరి నది శాఖలో తెలంగాణలోని భద్రాచలం నుండి ఆంధ్ర ప్రదేశ్ లోని ధవళేశ్వరం వరకు ఉంది. కృష్ణా నది శాఖలో నల్గొండ జిల్లా లోని వజీరాబాద్ నుండి విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజ్ వరకు ఉంది.
కాలువల శాఖలో కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హామ్ కాలువల ఉన్నాయి. కాకినాడ కాలువ, కాకినాడ, రాజమండ్రి మధ్య 50 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. గోదావరి నది ఎడమ ఒడ్డున ఉన్న ధవళేశ్వరం నుండి హెడ్ స్లూయిస్ ద్వాగా కాకినాడ ఓడరేవుకు సుమారు 5 కి.మీ. వరకు ఉంటుంది. ఈ కాలువ లోకి నీరు గోదావరి నది మీద ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ నుండి వస్తుంది.
ఏలూరు కాలువలో రెండు విభిన్న కాలువలున్నాయి. అవి తూర్పు కృష్ణా డెల్టా లోని కృష్ణా ఏలూరు కాలువ, పశ్చిమ గోదావరి డెల్టా లోని గోదావరి ఏలూరు కాలువలు. ఇవి విజయవాడ నుండి సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్యారేజ్ వద్ద నున్న విజ్జేశ్వరం లాకు వత్రకు మొత్తం 139 కి.మీ. దూరం నడుస్తాయి. కృష్ణా ఏలూరు కాలువ ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నది ఎడమ ఒడ్డు నుండి బయలుదేరి ఏలూరు వద్ద తూర్పు తమ్మిలేరు లాకు వద్ద గోదావరి ఏలూరు కాలువను కలుస్తుంది. గోదావరి ఏలూరు కాలువ విజ్జేశ్వరం వద్ద గోదావరి నది నుండి బయలుదేరి తూర్పు తమ్మిలేరు లాకు వద్ద కృష్ణా ఏలూరు కాలువలో కలుస్తుంది. కొమ్మమూరు కాలువ ప్రకాశం బ్యారేజీ కుడివైపున ఉన్న సీతానగరం లాకు వద్ద నుండి పెద్దగంజాం లాకు వరకు మొత్తం 113 కి.మీ. దూరం వెళ్ళి బకింగ్‌హామ్ కాలువలో కలుస్తుంది.
బకింగ్‌హామ్ కాలువ పెద్దగంజాం లాక్ నుండి చెన్నై వరకు, అక్కడి నుండి దక్షిణాన మరక్కానం వరకు విస్తరించి ఉన్న ఉప్పునీటి కాలువ. సముద్రంలో పోటు వచ్చినపుడు ఈ కాలిఉవ లోకి నీరు వస్తుంది. పెద్దగంజాం లాక్ నుండి చెన్నై వరకు 316 కి.మీ. దూరం వెళ్ళే కాలువను "ఉత్తర బకింగ్‌హామ్ కాలువ" అని, చెన్నై నుండి మరక్కానం వరకు 110 కి.మీ. వెళ్ళే కాలువను "దక్షిణ బకింగ్‌హామ్ కాలువ" అనీ అంటారు. పాండిచ్చేరి లోని మరక్కానం వద్ద కల్లువెల్లి ట్యాంక్ ద్వారా ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలలో NW-4 పొడవులు క్రింది విధంగా ఉన్నాయి: [16]
రాష్ట్రం | కాలువలు & నదుల పేరు | నిడివి | మొత్తం పొడవు |
---|---|---|---|
ఆంధ్రప్రదేశ్ | కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మూరు కాలువ, గోదావరి నది, కృష్ణా నది, ఉత్తర బకింగ్‌హామ్ కాలువ | (పెద్దగంజాం15°39′10″N 80°14′20″E / 15.652681°N 80.238898°E ) ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు సరిహద్దు తడ వద్ద ) | 895 కి.మీ. |
తమిళనాడు | ఉత్తర బకింగ్‌హామ్ కాలువ, దక్షిణ బకింగ్‌హామ్ కాలువ | (ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల సరిహద్దు తడ నుండి కల్లువెల్లి ట్యాంక్ వరకు | 210 కి.మీ. |
పుదుచ్చేరి | కల్లువెల్లి ట్యాంకు దక్షిణ భాగం పాండిచ్చేరి లింక్ | 2 కి.మీ. |
భౌగోళిక సరిహద్దులు
మార్చుసరిహద్దు | వివరణ |
---|---|
ఉత్తరం | 500 మీ. (1,600 అ.) దూరంలో కాకినాడ వద్ద ఉన్న జగన్నాధపురం రోడ్డు వంతెనకు కాకినాడ కాలువ మీదుగా గీసిన లంబ రేఖకు దిగువన 16°56′28″N 82°14′33″E / 16.941098°N 82.242576°E . |
దక్షిణం | కనగచెట్టికులం వద్ద గల తూర్పు తీర రహదారి చిన్నకల్వారి-కనగచెట్టికులం రహదారుల కూడలి. ఇది కలువెల్లి ట్యాంక్‌కు వరకు ఉన్న కాలువకు చివరి స్థానం. 12°04′48″N 79°50′13″E / 12.080047°N 79.83696°E . |
పశ్చిమం (గోదావరి నది) | వద్ద గోదావరి నదిపై భద్రాచలం వద్ద రోడ్డు వంతెన17°40′42″N 80°52′50″E / 17.678354°N 80.880423°E . |
పశ్చిమం (కృష్ణా నది) | వద్ద కృష్ణా నదిపై వజీరాబాద్ వద్ద రోడ్డు వంతెన16°40′56″N 79°39′26″E / 16.682252°N 79.657309°E . |
తూర్పు (గోదావరి నది) | ధవళేశ్వరం, రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ -16°56′11″N 81°45′37″E / 16.936301°N 81.760383°E |
తూర్పు (కృష్ణా నది) | విజయవాడ వద్ద కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ -16°30′24″N 80°36′19″E / 16.50665°N 80.605291°E |
అభివృద్ధి
మార్చు
WAPCOS రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులో NW-4 ను ఏడు సంవత్సరాలలో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. 2002 అంచనాల ప్రకారం ఇది ఐదు సంవత్సరాలు. NW-4 నిర్మాణానికి 1,707-హెక్టారు (4,220 ఎకరం) భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది [17] [18] తమిళనాట 300 హె. (740 ఎకరం), ఆంధ్రప్రదేశ్‌లో 1,380 హె. (3,400 ఎకరం), పుదుచ్చేరిలో 27 హె. (67 ఎకరం) సేకరించాల్సి ఉంది.
ట్రాఫిక్
మార్చుప్రస్తుత ట్రాఫిక్
మార్చుస్థానిక ఉత్పత్తులను మోసుకెళ్లే నాటు పడవలు మినహా ఈ జలమార్గంలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ ట్రాఫిక్ లేదు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలు లేకపోవడం, కాలువలను మెరుగుపరచే కృషి జరక్కపోవడం.
సంభావ్య ట్రాఫిక్
మార్చుNW-4 ను నాలుగు ప్రధాన రవాణా శాఖలుగా విభజించారు. అవి కాకినాడ బెల్ట్, కృష్ణా బెల్ట్, దక్షిణ ఆంధ్రప్రదేశ్ బెల్ట్, చెన్నై బెల్ట్. WAPCOS నిర్వహించిన సర్వే ఆధారంగా, ప్రతి సంవత్సరం 1.1 కోట్ల టన్నుల సరుకు రవాణా చేసే సంభావ్యత ఉందని భావిస్తున్నారు. రవాణా అయ్యే సరుకుల్లో బొగ్గు, బియ్యం, ఆహారధాన్యాలు, సిమెంట్, ఎరువులు, అటవీ ఉత్పత్తులు, ఉప్పు, ఇతర భారీ సరుకు ఉన్నాయి. [19] గోదావరి నది వ్యవస్థ భద్రాచలం అడవులు, బొగ్గు నిక్షేపాల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది వెంట జగ్గయ్యపేట వద్ద సున్నపురాయి నిక్షేపాలు, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి.
సహజ అవరోధంగా NW-4
మార్చు2004 డిసెంబరు 24 న సంభవించిన సునామీ నుండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో తీరం వెంబడి సాగే బకింగ్‌హామ్ కెనాల్ వేలాది మంది ప్రాణాలను కాపాడింది. హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ)కి చెందిన డాక్టర్ బి. రామలింగేశ్వరరావు బకింగ్‌హామ్ కాలువ పెద్దగంజాం, చెన్నైల మధ్య బఫర్ జోన్‌గా పనిచేసి 310 కి.మీ. కు పైగా తీర ప్రాంతంలో సునామీ అలలను నియంత్రించిందని చెప్పాడు. సునామీ అలలు చాలా చోట్ల ఇప్పటికే ఉన్న లోతట్టు వాగుల వైపు మళ్లాయి. [20] [21]
చెన్నై (మరక్కాణం) నుండి నెల్లూరు సమీపంలోని దుగ్గరాజపట్నం వరకు, ఆపై పెద్ద గంజాం వరకు తూర్పు తీరమంతా సునామీ నీటితో నిండిపోయింది, ఇది కొన్ని చోట్ల పొంగి ప్రవహించి 10-15 నిమిషాల్లో తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఇది చాలా మంది మత్స్యకారుల ప్రాణాలను కాపాడింది -ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాలలో.
ఖర్చు
మార్చుఈ జలమార్గం అభివృద్ధికి 1,515 కోట్లు అవుతుందని WAPCOS, 2009 లో అంచనా వేసింది. ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి పూర్తి చేస్తారు. [22] మొదటి దశలో గోదావరి, కృష్ణా నదులు, గరిష్ట కార్గో సంభావ్యత కలిగిన కాకినాడ, ఏలూరు కాలువలతో కూడిన ఒక విస్తరణను 390 కోట్లతో పూర్తి చేస్తారు. మిగిలిన భాగంలో భూ సేకరణ కోసం 219 కోట్లు వ్యయం చేస్తారు. రెండవ దశలో 906 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర, దక్షిణ బకింగ్‌హామ్ కాలువలను, కొమ్మమూరు కాలువను, కలువెల్లి ట్యాంక్‌లనూ అభివృద్ధి చేస్తారు.
పదవ పంచవర్ష ప్రణాళికలో, ప్రణాళికా సంఘం లోతట్టు జల రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపును 636 కోట్లు కేటాయించింది. [23]
2009-2010 సంవత్సరానికి, IWT అభివృద్ధి కోసం ప్రభుత్వం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ క్రింది నిధులను విడుదల చేసింది. [24]
కాలువ ప్రతిపాదనలో చేసిన మార్పులు
మార్చునేషనల్ వాటర్‌వేస్ యాక్ట్ 2016 లో జాతీయ జలమార్గం 4 కు పెద్దయెత్తున మార్పు చేసారు. దీని ప్రకారం కృష్ణా, గోదావరి నదుల్లో ఈ జలమార్గపు నిడివి బాగా పెరిగింది. గోదావరి నదిలో భద్రాచలం నుండి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వరకు ఉండగా దాన్ని మహారాష్ట్ర లోని నాసిక్ (20°0' 07" N, 73°48' 12" E) నుండి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వరకు పెంచారు. అలాగే కృష్ణా నదిలో ఈ మార్గం తెలంగాణ లోని వజీరాబాద్ నుండి ప్రకాశం బ్యారేజి వరకు ఉండగా దాన్ని కర్ణాటక లోని గలగలి (16° 25' 28" N,75° 26'19" E) నుండి ప్రకాశం బ్యారేజి9 వరకు పొడిగించారు. [25] దీనితో ఈ జలమార్గం పొడవు 1,095 కి.మీ. నుండి 2,890 కి.మీ. కు పెరిగింది. [26]
మూలాలు
మార్చు- ↑ "Gazette Notification of commencement, Formation of Telangana" (PDF). Government of India. Retrieved 27 March 2015.
- ↑ Kumar, V Rishi (20 April 2016). "A ₹3,000-crore makeover for Buckingham Canal". The Hindu Business Line (in ఇంగ్లీష్). Retrieved 15 May 2017.
- ↑ Ministry of Shipping (Government of India). "National waterways Declaration". Archived from the original on 19 June 2009. Retrieved 5 August 2010.
- ↑ Press Information Bureau, Government of India (2 August 2010). "Development Authority for Inland Waterways in India". Retrieved 5 August 2010.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Vice President to lay foundation stone for the development of Muktyala to Vijaywada stretch of Krishna River".
- ↑ "Venkaiah Naidu lays foundation stone for National Waterway-4 in Andhra Pradesh". 4 October 2017.
- ↑ "National Level Infrastructure, Maritime Transport". business.gov.in. Archived from the original on 24 March 2010. Retrieved 5 August 2010.
- ↑ Press Information Bureau ,Government of India (15 March 2007). "Development Authority for Inland Waterways in India". Retrieved 5 August 2010.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Three new national waterways on anvil". Financial Express (14 July 2005). 14 July 2005. Retrieved 5 August 2010.
- ↑ "Development of National Waterways". Press Information Bureau, Govt of India (26 July 2006). Retrieved 5 August 2010.
- ↑ "House clears Inland Vessels Bill". The Indian Express. 31 August 2007. Retrieved 5 August 2010.
- ↑ "Gazette Notification of commencement, Formation of Telangana" (PDF). Government of India. Retrieved 27 March 2015.
- ↑ "National Waterways bills". Press Information Bureau ,Government of India. 15 March 2007. Retrieved 5 August 2010.
- ↑ "Lok Sabha passes National Waterways bills". Outlook India. 23 October 2008. Archived from the original on 31 January 2013. Retrieved 5 August 2010.
- ↑ "National Waterways bills". Press Information Bureau ,Government of India. 15 March 2007. Retrieved 5 August 2010.
- ↑ "National Waterways". Public Information Bureau, Government of India. 27 July 2010. Retrieved 5 August 2010.
- ↑ "National Waterways bills". Press Information Bureau ,Government of India. 15 March 2007. Retrieved 5 August 2010.
- ↑ "National Waterways-4". Water Resource Information System of India. 28 November 200. Archived from the original on 24 సెప్టెంబరు 2016. Retrieved 10 August 2016.
- ↑ WAPCOS, Ministry of Water Resources. "Detailed Project Report by WAPCOS" (PDF). Archived from the original (PDF) on 6 December 2010. Retrieved 5 August 2010.
- ↑ "CURRENT SCIENCE, VOL. 89, NO. 1" (PDF). Indian Academy of Science. 10 July 2005. Retrieved 5 August 2010.
- ↑ "Buckingham canal buffered tsunami fury". The Hindu. 11 August 2005. Archived from the original on 14 July 2007. Retrieved 5 August 2010.
{{cite web}}
: CS1 maint: unfit URL (link) - ↑ "National Waterways bills". Press Information Bureau ,Government of India. 15 March 2007. Retrieved 5 August 2010.
- ↑ "Budgetary provision for National waterways". Financial Express. 19 March 2007. Retrieved 5 August 2010.
- ↑ "Ministry of Shipping Budget for the year 2009–2010" (PDF). Ministry of Shipping, Government of India. Archived from the original (PDF) on 27 December 2010. Retrieved 5 August 2010.
- ↑ "నేషనల్ వాటర్‌వేస్ యాక్ట్, 2016" (PDF). భారత ప్రభుత్వ గజెట్. 2016-03-26. Archived (PDF) from the original on 2022-06-29. Retrieved 2022-06-29.
- ↑ Market, Capital (2018-12-31). "National Waterway - 4 covers length of 2890 kms". Business Standard India. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.