జాఫర్ హుస్సేన్
జాఫర్ హుస్సేన్ మెరాజ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున నాంపల్లి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] 2009 నుండి 2012 వరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు డిప్యూటీ మేయర్ గా విధులు నిర్వహించాడు.
జాఫర్ హుస్సేన్ మెరాజ్ | |||
| |||
తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2014 - ప్రస్తుతం | |||
ముందు | విరాసత్ రసూల్ ఖాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాంపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్
| |||
పదవీ కాలం 2009 - 2012 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1960 జనవరి 26||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | ||
తల్లిదండ్రులు | అహ్మద్ హుస్సేన్ - జాహేదా బేగం | ||
జీవిత భాగస్వామి | ఫర్జానా బానో | ||
సంతానం | ఇద్దరు కుమారులు (మిన్హాజ్ హుస్సేన్, మక్సూద్ హుస్సేన్), ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | హశీమాబాదు, హైదరాబాదు |
జననం, విద్యాభ్యాసం
మార్చుజాఫర్ హుస్సేన్ మెరాజ్ 1960, జనవరి 26న అహ్మద్ హుస్సేన్ - జాహేదా బేగం దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. తండ్రి అహ్మద్ హుస్సేన్ 1967లో సీతారాంబాగ్ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. జాఫర్ హుస్సేన్ మెరాజ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుజాఫర్ హుస్సేన్ మెరాజ్ కు ఫర్జానా బానో తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (మిన్హాజ్ హుస్సేన్, మక్సూద్ హుస్సేన్), ఇద్దరు కుమార్తెలు.[2] 2018లో చిన్న కుమారుడు మక్సూద్ హుస్సేన్ దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించాడు.[3]
రాజకీయ విశేషాలు
మార్చుజాఫర్ హుస్సేన్ 2009 మున్సిపల్ ఎన్నికల్లో టోలిచౌకి నుండి తొలిసారిగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు ఎన్నికయ్యాడు. ఆ సమయంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశాడు. 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై 17,296 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[4][5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై 9,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] జాఫర్ హుస్సేన్‌కు 57,940 ఓట్లు రాగా, ఫిరోజ్ ఖాన్‌కు అనుకూలంగా 48,265 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ 17,015 ఓట్లతో నిలిచాడు. [8]
పదవులు
మార్చు- 2009 - 2014: కార్పోరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్
- 2009 - 2012: డిప్యూటీ మేయర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్
ఇతర వివరాలు
మార్చుఇరాన్, మలేషియా, ఖతర్, సౌదీ అరేబియా, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
మార్చు- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Ensuring water supply is priority: Nampally MLA-elect". thehindu.com. Retrieved 25 May 2014.
- ↑ "AIMIM MLA Jaffer Mehraj's son passes away". telanganatoday.com. Retrieved 28 Dec 2018.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=1805
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-29. Retrieved 2019-06-06.
- ↑ http://myneta.info/telangana2018/candidate.php?candidate_id=4987
- ↑ "TS Election results: AIMIM's Jaffar Hussain Meraj retains Nampally". telanganatoday.com. Retrieved 11 Dec 2018.