జె. చెన్నయ్య
డాక్టర్ జె. చెన్నయ్య మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాత్రికేయులు , రచయిత, సాహిత్య పరిశోధకులు, ఆకాశవాణి న్యూస్ రీడర్, అనువాదకులు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి.
Dr. J. Chennaiah డాక్టర్ జె. చెన్నయ్య | |
---|---|
![]() | |
జననం | డాక్టర్ జె. చెన్నయ్య 06-01-1958 గ్రామం : కావేరమ్మపేట, మండలం : జడ్చర్ల |
నివాస ప్రాంతం | మహబూబ్ నగర్ భారత దేశము![]() |
వృత్తి | తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి |
ప్రసిద్ధి | పాత్రికేయం , అనువాదం, ప్రజాసంబంధాలు, ఆకాశవాణి న్యూస్ రీడర్, సాహిత్య పరిశోధకులు |
మతం | హిందూ |
జీవిత విశేషాలుసవరించు
డాక్టర్.జె. చెన్నయ్య మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేటలో 06.01.1958న జన్మించారు. చిన్నప్పటి నుంచి తెలుగు భాషంటే అభిమానం. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఎం.ఎ. తెలుగు, "తెలుగు దినపత్రికలు - బాషా సాహిత్య స్వరూపం" అనే అంశంపై పీహెచ్.డి పరిశోధ చేసి డాక్టరేట్ పొందారు. మాస్టర్ అఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మదురైలో, పి.జి. డిప్లొమా ఇన్ ట్రాన్స్ లేషన్ స్టడీస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పూర్తి చేశారు. జడ్చర్లలో కళాశాల విద్యార్థిగా, మొబైల్ బ్రాంచి పోస్ట్ఫాస్‌కు పోస్ట్‌మాస్టర్‌గా, కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఉంటూ, నాటకాలు, ఏకపాత్రాభినయాలు, బుర్రకథలు ప్రదర్శిస్తూ, ఆ రోజుల్లోనే రేడియోకు కథానికలు, కవితలు, రూపకాలు రాస్తూ, ఒక దినపత్రికకు విలేకరిగా పనిచేసేవారు. పాత్రికేయునిగా, అనువాకునిగా , ఉత్తమ ప్రజా సంభంధాల అధికారిగా, ఆకాశవాణి న్యూస్ రీడర్‌గా చేపట్టిన అన్ని రంగాల్లో ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్నారు. కష్టపడి చదువుకొని పైకి రావాలనుకున్న వారికి పేదరికం , గ్రామీణ నేపథ్యం వంటివేవీ అవరోధం కాదని నిరూపించిన వ్యక్తి. [1]
మౌలిక రచనలుసవరించు
- తెలుగు దినపత్రికలు - బాషా సాహిత్య స్వరూపం
- పత్రికలు ప్రసార మాధ్యమాలు - తెలుగు
- వ్యాసమాలిక
- కావూరి కుటుంబరావు ప్రస్థానం
- డా . దేవులపల్లి రామానుజరావు (కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ )
రేడియో కోసంసవరించు
30 రూపకాలు రచించి తానే రూపొందించి ప్రసారం చేశారు. ఐదు నాటకాలు కూడా రచించారు.
- 1. లకుమ
- 2. మైత్రీసూత్రం
- 3. ధ్యానగాంధారి
- 4. మహమ్మద్ కుతుబ్ షా
- 5. మహాప్రస్థానం మొదలగు నాటకాలు
అనువాద రచనలుసవరించు
డా. చెన్నయ్య గారు అనువాద రంగంలో విశేష కృషి చేశారు.
- 1. గవర్నర్ సుర్జిత్‌సింగ్ బర్నాలా నిజ జీవితంలో చేసిన సాహసాలతో కూడిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్ - ఎ స్టోరీ ఆఫ్ ఎన్ ఎస్కేప్’ ("Quest for freedom A Story of an escape") అనే గ్రంథాన్ని స్వేచ్ఛకోసం ఒక విహంగ యాత్ర పేరుతో తెలుగులోకి అనువదించారు.
- 2. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోరికపై, పంజాబీ రచయిత్రి దిలీప్ కౌర్ తివానా రచించిన ట్వైలైటు, మార్క్ ఆఫ్ డైమండ్ నోస్‌రింగ్ ("1. Twil Light. 2. Mark of Dimond nose ring") అనే నవలికల్నిసంధ్యారాగం, వజ్రపు ముక్కుపుడక అనే పేర్లతో నవలికలను తెలుగులోకి అనువాదం చేశారు.
- 3. భారత సైనికదళాల ప్రధానాధికారిగా, త్రివిధ, దళాల సుప్రీం కమాండర్ గా పనిచేసిన జనరల్ కె.వి.కృష్ణారావు రాసిన ("In the service of the Nation : Reminiscences") సర్వ సైన్యాధ్యక్షునిగా, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసిన జనరల్ కె.వి.కృష్ణారావు అనే బృహత్ గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం కోరికపై దేశసేవలో .. జనరల్ కె.వి.కృష్ణారావు జ్ఞాపకాలు పేరుతో తెలుగులోకి అనువదించిన నాలుగు అనువాదకుల్లో ఒకరు.
- 4. సీనియర్ పాత్రికేయుడు ఆర్. జె. రాజేంద్రప్రసాద్ రాసిన ‘ఎమర్జెన్స్ ఆఫ్ తెలుగుదేశం’ ("Emergence of Telugu Desam") అనే గ్రంథాన్ని "వీచిన ప్రాంతీయ పవనాలు" పేరుతో తెలుగులోకి అనువదించారు.
- 5. సీనియర్ పాత్రికేయుడు ఆర్. జె. రాజేంద్రప్రసాద్ రాసిన ‘డేట్ లైన్ ఆంధ్ర’ ("Dateline Andhra") గ్రంథాన్ని తెలుగులోకి "డేట్ లైన్ ఆంధ్ర" అనే పేరుతో అనువదించారు.
- 6. డా. ఎ. పి. జె. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా చేసిన ప్రసంగాలను తెలుగులోకి అనువాదించి ఒక సంకలనంగా కూర్చారు.
- 7. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతియేటా ఆర్ధిక మంత్రి శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగాలను 12 సంవత్సరాల పాటు తెలుగులోకి అనువదించారు.
- 8. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, ఎం.ఎ కోర్సు పాఠ్యాంశాల అనువాదం.
- 9. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి గారి మునిమనుమరాలు ‘వరేణ్య’ రాసిన పురాణ పాత్రలు - ఇతిహాస పాత్రలు’ తెలుగులోకి అనువదించారు.
దూరదర్శన్ ఆకాశవాణిలో 40 ఏళ్ళ అనుభవంసవరించు
క్యాజువల్ ఎనౌన్సర్ , వార్తా విభాగంలో ప్రాంతీయ, జాతీయ వార్తలు చదివే క్యాజువల్ న్యూస్ రీడర్‌గా , అనువాదకునిగా, కార్యక్రమాల రూపకల్పన నిపుణిగా అనుభవం గడించారు. సరళతరమైన అనువాదానికి, స్పతమైన ఉచ్ఛారణతో కూడిన వార్తా పఠనానికి పేరు పొందారు. గణతంత్ర దినోత్సవం, స్వాత్రంత్య దినోత్సవం, మొదలైన ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రసంగాలను అనువదించి భావయుక్తంగా చదవడంలో ప్రత్యేకత సాధించారు. ప్రధానమంత్రి మాన్ కీ బాత్ అనువాదం, పఠనం. మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు మరియి నందమూరి తారక రామారావు అంత్యక్రియలకు ఆకాశవాణిలో ప్రత్యేక్ష వ్యాఖ్యానం. దూరదర్శన్ లో రాష్ట్రావతరణ దినోత్సవం, డా. పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంత్యుత్సవ ప్రత్యేక్ష వ్యాఖ్యానం. ఆయన మైకులో మాట్లాడుతూంటే గుడిలో గంట మోగుతున్నట్టు ఉంటుంది. దూరదర్శన్‌లో కూడా ఎన్నోసార్లు వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు కనిపించారు.
హైదరాబాద్ ఫరేడ్ గ్రౌండ్ లో జరిగిన అన్నమయ్య లక్ష గల సంకీర్తనార్చనలో, గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన రెండవ, మూడవ, నాల్గవ, అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో ప్రత్యేక్ష వ్యాఖ్యానం. (ఈ కార్యక్రమాలు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాయి.) కాలిఫోర్నియాలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో, అమెరికా న్యూజెర్సీ తెలుగు సాంస్కృతికోత్సవంలో ప్రత్యేక్ష వ్యాఖ్యానం. వివిధ ప్రక్రియలు, కళారంగాల్లో పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు పొందిన వెయ్యిమందికి పైగా ప్రముఖుల ప్రశంసాపత్రాల రచన. అంతర్జాతీయ సమ్మేళనాల్లో వ్యాఖ్యాతగా ఎంతోమంది అభినందనలు అందుకున్నారు.
జర్నలిస్ట్ గాసవరించు
డా. చెన్నయ్య గారు ఈనాడు దినపత్రికలో పది సంవత్సరాలు విలేఖరిగా, ఉపసంపాదకునిగా జడ్చర్ల, హైదరాబాద్ , సంగారెడ్డి, జిల్లాలో పనిచేశారు. వీరి యొక్క వ్యాసాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, తెలుగు విద్యార్థి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రభూమి, నమస్తే తెలంగాణ, మూసీ (పత్రిక) మొదలైన మాసపత్రికలో దినపత్రికల్లో, ప్రత్యేక సంచికలో వ్యాసాలు వెలువడ్డాయి.
అందుకున్న పురస్కారాలుసవరించు
- 1. డా.సి .వి . నరసింహారెడ్డి బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ అవార్డు - పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా (పి. ఆర్ . ఎస్ . ఐ )
- 2. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా ఆలిండియా అవార్డు
- 3. ఉత్తమ అనువాద సాహితీ పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం
- 4. అధికారభాష సంఘం పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం
- 5. ఆరాధన ఆకాశవాణి పురస్కారం
- 6. హృదయ భారతి విశిష్ట పురస్కారం
- 7. ఉత్తమ ప్రజా సంభంధాల అధికారి అవార్డు - శిల్ప ఆర్ట్స్ క్రియేషన్స్
అనువాదకుడిగా, ప్రజా సంబంధాల న్యూస్ రీడర్‌గా మూడు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించిన చెన్నయ్య మూడు రంగాల్లో పురస్కారాలు పొం దారు. ఇది చాలా గొప్ప విషయం. అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి, ఉత్తమ ప్రజా సంబంధాల అధికారిగా పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి, ఉత్తమ న్యూస్ రీడర్‌గా అప్పటి న్యూస్ రీడర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్ర్తీ కుటుంబ సభ్యులు నెలకొల్పిన సంస్థ నుండి అవార్డులు పొందారు. అధికార భాషా సంఘం, ఢిల్లీ తెలుగు అకాడెమీ, ఆరాధన, హృదయభారతి, శిల్పా ఆర్ట్స్ క్రియేషన్స్, మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం, మానస ఆర్ట్స్ థియేటర్స్ నుండి పురస్కారాలు పొందారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి జాతీయ బహుమతి పొందారు. బెస్ట్ చైర్మన్‌గా జాతీయ పురస్కారం పొందారు. విద్యార్థి రోజుల్లో సిద్దిపేట డిగ్రీ కాలేజీ రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర కళాశాల ఏకపాత్రాభినయం పోటీల్లో వరుసగా మూడేళ్లు కర్ణ, చాణక్య, భగత్‌సింగ్ పాత్రలకు ప్రథమ బహుమతి పొందారు.
నిర్వహించిన నిర్వహిస్తున్న పదవులుసవరించు
తెలుగు విశ్వవిద్యాలయంలో 1990 నుండి 2016 దాకా పని చేశారు. ప్రజా సంబంధాల అధికారిగా అసమాన సేవలు అందించి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణా సారస్వత పరిషత్‌కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, తెలుగు భాషకు, సాహిత్యానికి అవిరామంగా సేవ చేస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా సేవ చేశారు. సిలికానాంధ్ర (యుఎస్‌ఏ) భారతదేశ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం సిలికానాంధ్రకు వైస్‌ప్రెసిడెంట్. 12 దేశాలలో ఉన్న ‘మన బడి’కి ఎంతో సేవలందిస్తున్నారు. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు కన్వీనర్ గా కూడా ఉన్నారు.
విదేశీ పర్యటనలుసవరించు
అనేక విద్యా, సాహిత్య సభల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. పత్రికల్లో పలు వ్యాసాలు రావారు. అమెరికా, మారిషస్, శ్రీలంక, సింగపూర్, మిచిగాన్, మలేషియా, దుబాయ్, వంటి దేశాలలో భారత సంస్కృతి ప్రచారం చేసి తెలుగు భాష, సాహిత్య కీర్తి పతాకనెగురవేశారు.
మూలాలుసవరించు
- సిలికానాంధ్ర భారతదేశ ఉపాధ్యక్షుడు
- Dr J Chennaiah All India Radio News Reader
- భారతవాణిలో డాక్టర్ జె. చెన్నయ్య పుస్తకాల వివరాలు [permanent dead link]
- పత్రికలు – ప్రసార మాధ్యమాలు తెలుగు | Patrikalu Prasara Madhyamalu-Telugu [permanent dead link]
- వ్యాసమాలిక | Vyaasa Maalika
- సంధ్యారాగం | Sandhyaragam
- కావూరి కుటుంబరావు ప్రస్థానం | Kavuri Kutumba Rao Prasthanam [permanent dead link]
- తెలుగు దినపత్రికలు భాషాసాహిత్య స్వరూపం | Telugu Dinapatrikala Bhasha Sahitya Swarupam [permanent dead link]
- ASCI PRO bags Best PR Manager Award
- తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి
- పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా (PRSI) హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి
- భారత ప్రభుత్వ గ్రంథాలయంలో జె. చెన్నయ్య / వ్యాస మాలిక, పుస్తక వివరాలు [permanent dead link]
- భారత ప్రభుత్వ గ్రంథాలయంలో జె .చెన్నయ్య / పత్రికలు- ప్రసార మాధ్యమాలు తెలుగు, పుస్తక వివరాలు [permanent dead link]
- ప్రభుత్వ గ్రంథాలయంలో జె .చెన్నయ్య / తెలుగు దినపత్రికలు భాషా సాహిత్య స్వరూపం, పుస్తక వివరాలు [permanent dead link]
- తెలంగాణ మాసపత్రిక ఆగష్టు సంచికలో జె .చెన్నయ్య / తెలుగు పత్రికలు ప్రసార మాద్యమాల భాషా స్వరూపం పుస్తక సమీక్ష
ఇతర లింకులుసవరించు
- ↑ "వివిధ రంగముల ఆరితేరిన డా.జె. చెన్నయ్య". andhrabhoomi.net. ఆంధ్రభూమి. 2018-08-04.[permanent dead link]