టి.ఎన్.కృష్ణన్

భారత సంగీతజ్ఞుడు

త్రిపునితుర నారాయణయ్యర్ కృష్ణన్ (1928 – 2020) ఒక భారతీయ కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, ఇతడిని కలిపి కర్ణాటక సంగీతపు వాయులీన త్రయంగా పరిగణిస్తారు. 1992లో ఇతడికి భారత ప్రభుత్వపు మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ లభించింది.

టి.ఎన్.కృష్ణన్
వ్యక్తిగత సమాచారం
జననం(1928-10-06)1928 అక్టోబరు 6
త్రిపునితుర , కొచ్చిన్, బ్రిటీషు ఇండియా
మరణం2020 నవంబరు 2(2020-11-02) (వయసు 92)
చెన్నై
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

ఆరంభ జీవితం

మార్చు

ఇతడు 1928, అక్టోబరు 6వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిపునితుర గ్రామంలో ఎ.నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతులకు జన్మించాడు.[1][2]ఇతడు తన తండ్రి నుండి సంగీతం అభ్యసించాడు. తన 11వ యేట 1939లో త్రివేండ్రంలో తన మొట్టమొదటి వాయులీన కచేరీ నిర్వహించాడు.[3] ఇతని తండ్రి మరణించే వరకూ ఇతనికి సంగీతం నేర్పించాడు."[2]

తరువాత ఇతడు అల్లెప్పీ కె.పార్థసారథి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ల వద్ద శిష్యరికం చేశాడు.[1]

వృత్తి

మార్చు

ఇతడు అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, అలత్తూర్ బ్రదర్స్, ఎం.డి.రామనాథన్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ మొదలైన అగ్రశ్రేణి కళాకారులతో కలిసి ఇతడు కచేరీలు నిర్వహించాడు. ఇతడు మొదటి సోలో ప్రదర్శన 1939లో త్రివేండ్రంలో తన 11వ యేట నిర్వహించాడు. [1] ఇతని బాల్యంలో కొచ్చిన్ రాజకుటుంబం ఇతడిని ఆదరించింది.[2]

1942లో ఇతడు మద్రాసుకు వచ్చాడు.[1] అక్కడ ఇతడు వ్యాపారవేత్త ఆర్. అయ్యదొరై, అతని భార్య తంగం అయ్యదొరైల సంరక్షణలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌వద్ద సంగీతం అభ్యసించాడు. [2]

ఇతడు లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్ లతో కలిసి "వాయులీన త్రిమూర్తులు"గా కర్ణాటక సంగీత ప్రపంచంలో పేరు సంపాదించాడు.[4] ఇతడు మద్రాసు సంగీత అకాడమీ ప్రతియేటా "మార్గళి" సంగీత ఉత్సవాలలో క్రమం తప్పకుండా పాల్గొనే వాడు. క్రిస్మస్ రోజు ఉదయం ఇతని కచ్చేరీ తప్పక ఉండేది.[5] He travelled extensively on musical tours all over the world.[5]

ఇతడు శాస్త్రీయ పరంపర విధానంలో తన శిష్యులకు సంగీతాన్ని నేర్పించాడు. ఇతని శిష్యులలో కుమార్తె విజి కృష్ణన్ నటరాజన్, కుమారుడు శ్రీరామ్‌ కృష్ణన్, చారుమతి రఘురామన్ మొదలైన వారున్నారు.[2]ఇతడు చెన్నై సంగీత కళాశాలకు సంగీత ఆచార్యుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయం లలితకళల విభాగానికి డీన్‌గా కూడా పనిచేశాడు.[1][3] కేంద్ర సంగీత నాటక అకాడమీకి 1991-93 మధ్య కాలంలో ఉపాధ్యక్షుడిగా సేవలను అందించాడు.[6]

అవార్డులు, బిరుదులు

మార్చు

ఇతడు 1974లో సంగీత నాటక అకాడమీ అవార్డును, 2006లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను పొందాడు.[7][8]1980లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది.[9]1999లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై ఇతనికి సంగీత కళాశిఖామణి అవార్డును ప్రదానం చేసింది.[10]ఇతడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు.[6]

జాతీయ పురస్కారాలు:[3][11]

 •   పద్మశ్రీ, భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. (1973)
 •   పద్మభూషణ్, భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం (1992)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఇతడు కమలా కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి విజి కృష్ణన్ నటరాజన్ అనే కుమార్తె, శ్రీరామ్‌ కృష్ణన్ అనే కుమారుడు ఉన్నారు. వారిద్దరూ వాయులీన విద్వాంసులే.[12] [2] ఇతని సోదరి ఎన్. రాజం హిందుస్తానీ సంగీత వాయులీన కళాకారిణి. [2] ఇతడు 2020 నవంబరు 2వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో మరణించాడు.[1]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Kolappan, B. (3 November 2020). "Violinist T.N. Krishnan is no more". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2 November 2020. Retrieved 3 November 2020.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Mahesh, Chitra (6 December 2018). "T.N. Krishnan: Life on a high note". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2 November 2020. Retrieved 3 November 2020.
 3. 3.0 3.1 3.2 "TN Krishnan, legendary violinist and Padma Bhushan awardee, passes away aged 92 – Art-and-culture News, Firstpost". Firstpost. 3 November 2020. Archived from the original on 3 November 2020. Retrieved 3 November 2020.
 4. 3 Nov, TNN /; 2020; Ist, 06:21. "TN Krishnan death: Violin great TN Krishnan passes away at 92 in Chennai | Chennai News". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2020. Retrieved 3 November 2020. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 5. 5.0 5.1 "Legendary violinist T N Krishnan passes away at 92". Deccan Herald (in ఇంగ్లీష్). 3 November 2020. Archived from the original on 3 November 2020. Retrieved 3 November 2020.
 6. 6.0 6.1 "Sangeet Natak Academy – TN Krishnan". sangeetnatak.gov.in. Archived from the original on 10 August 2020. Retrieved 3 November 2020.
 7. "SNA: List of Akademi Awardees — Instrumental — Carnatic Violin". Sangeet Natak Akademi. Archived from the original on 3 April 2015. Retrieved 24 September 2009.
 8. "SNA: List of Akademi Fellows". Sangeet Natak Akademi. Archived from the original on 27 July 2011. Retrieved 24 September 2009.
 9. 3 Nov, TNN /; 2020; Ist, 03:33. "Violin maestro TN Krishnan dies at 92 | India News". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2020. Retrieved 3 November 2020. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 10. "Welcome to The Indian Fine Art Society". www.theindianfineartssociety.com. Archived from the original on 26 September 2018. Retrieved 3 November 2020.
 11. "Padma Awards". Ministry of Communications and Information Technology. Archived from the original on 14 March 2012. Retrieved 16 July 2009.
 12. "Archived copy". Archived from the original on 16 December 2008. Retrieved 17 December 2008.{{cite web}}: CS1 maint: archived copy as title (link)

బయటి లింకులు

మార్చు