తంగిరాల చక్రవర్తి

తెలుగు రచయిత, కవి, విమర్శకుడు

తంగిరాల చక్రవర్తి పేరెన్నికగన్న కవి, రచయిత, విమర్శకుడు, నాటకకర్త.

తంగిరాల చక్రవర్తి
Tangirala.jpg
తంగిరాల చక్రవర్తి
జననంతంగిరాల చక్రవర్తి
1964, సెప్టెంబర్ 18
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం
ప్రసిద్ధికవి,రచయిత,విమర్శకుడు
భార్య / భర్తలక్ష్మీప్రసన్న కుమారి
పిల్లలుసాయిసుందర్
తండ్రితంగిరాల వెంకటశివరామకృష్ణప్రసాద్
తల్లిసత్య జ్ఞానప్రసూనాంబ

జీవితవిశేషాలుసవరించు

తంగిరాల చక్రవర్తి విజయవాడ దగ్గర ఉన్న కపిలేశ్వరపురం లో సెప్టెంబరు 18, 1964 తేదీన జన్మించాడు. తండ్రి నాటకరంగ ప్రముఖుడు తంగిరాల వెంకటశివరామకృష్ణ ప్రసాద్. అతడికి దర్శకబ్రహ్మ, దర్శకసామ్రాట్, నాటక కళా కోవిద మొదలైన బిరుదులు ఉన్నాయి. చక్రవర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. చేశాడు. ప్రస్తుతం ప్రజాశక్తి బుక్‌హౌస్‌లో పనిచేస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నాటకం, వ్యాసం, నవల, గ్రంథసమీక్ష, విమర్శ మొదలైన ప్రక్రియలలో 3 దశాబ్దాలుగా కృషి చేస్తున్నాడు. తండ్రి పేరు మీద తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఏటా ఒక నాటకరంగ ప్రముఖుడిని సత్కరిస్తున్నాడు. ఇతని కృషిని గుర్తించి అనేక సాహిత్యసాంసృతిక సంస్థలు సత్కరించాయి. అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్(భోపాల్) జీవిత సభ్యుడిగా, సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. క్రీడాకారునిగా కూడా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీలలో ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ మొదలైన క్రీడల్లో పాల్గొని బహుమతులు, ప్రశంసాపత్రాలు పొందాడు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలలో, లండన్ తెలుగు రేడియోలో ప్రసంగాలు చేశాడు.

రచనలుసవరించు

బాలసాహిత్యంసవరించు

 • హంపన్న
 • నర్శింహారెడ్డి
 • బళ్ళారి రాఘవ
 • ధన్యజీవులు
 • అంబేద్కర్
 • చిన్ని చిన్ని ఆశ
 • చిక్ బుక్ రైలు
 • బాలల భారతదేశం (అనువాదం)

కవిత్వంసవరించు

 • నా గుండె సవ్వడి
 • ఆకాంక్ష
 • విసురు (రెక్కలు)
 • కలాలు గళాలు (సంకలనం)
 • ప్రతీక్ష (సంకలనం)
 • అక్షరభారతి (సంకలనం)
 • స్వర్ణభారతి
 • హృదయేశ్వరి
 • అక్షర తోలకరి(సంకలనం)

నాటకాలు/నాటికలుసవరించు

 • విచ్ఛిత్తి
 • చీడపురుగులు
 • గాలిబ్రతుకులు
 • మిరాశీ
 • దర్శకుడు ధర్మయ్య(ఏకపాత్రాభినయం)
 • వరశుల్కం
 • అద్దెయిల్లు
 • ఉషోదయం
 • మెనోగామి
 • పునరంకితం
 • మానెత్తురు వృథాపోదు
 • మేడిపళ్ళు

నవలలుసవరించు

 • నటుడు నరసింహ
 • స్నిగ్ధహృదయి
 • ఆకలి
 • రాబందులు
 • సృష్టి విజ్ఞానం

కథా సాహిత్యంసవరించు

 • కథామందారం
 • చక్రవర్తి కథలు

వైద్యశాస్త్రంసవరించు

 • మధుమేహం
 • గుండెనొప్పి జాగ్రత్తలు
 • ఆయుర్వేదామృతం
 • వంటింటి వైద్య చిట్కాలు
 • అందరికీ ఆయుర్వేదం
 • శృంగారం ఆరోగ్యం

విద్యావిషయక పుస్తకాలుసవరించు

 • తెలుగు రచన - వర్ణమాల 1,2 (మదర్ థెరిసా పబ్లికేషన్స్)
 • ఆం.ప్ర.ప్రభుత్వపాఠ్యాంశాలకు అభ్యాసపుస్తకాలు (1నుండి10 తరగతులకు)- ఇంగ్లీషు,గణితం,సామాన్యశాస్త్రం,సాంఘికశాస్త్రం,తెలుగు రచన(అలైడ్ పబ్లికేషన్స్)
 • వ్యాకరణము
 • నిఘంటువు

ఇతర రచనలుసవరించు

 • నవీన వ్యాసమంజరి
 • మీరు మెరిట్ విద్యార్థులు కావడమెలా?
 • నావాణి ప్రజావాణి
 • నాటకరంగ ప్రయోగశాల తంగిరాల
 • వ్యాసాలు లేఖలు
 • కృత్యాద్యవస్థ
 • తారవి
 • వ్యాకరణ వికాసం
 • అద్దేపల్లి సాహిత్య సమీక్షాదర్శిని
 • తెలంగాణ దర్శిని (కె.చంద్రమోహన్‌తో కలిసి)

నాటకరంగంసవరించు

చక్రవర్తి నాటికలు నాటకాలు ప్రజానాట్యమండలి ద్వారా కె.ఆర్.నాయుడు దర్శకత్వంలో ప్రదర్శింపబడ్డాయి. కొక్కోరోకో, కుందేటికొమ్ము, ఊరేగింపు, గోగ్రహణం, సత్యహరిశ్చంద్ర మొదలైన నాటికలకు స్వయంగా దర్శకత్వం వహించాడు. 1988-89, 1994-95 మధ్యకాలంలో "తెలుగు రంగస్థలి" పత్రికకు ప్రధాన సంపాదకుడిగా ఉన్నాడు. 1999-2002 మధ్య "రంగస్థలి" మాసపత్రికకు సహసంపాదకుడిగా పనిచేశాడు. అనేక పరిషత్ నాటక పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. నాటకరంగ సింహావలోకనం పేరుతో సాహితీకిరణం పత్రికలో ఒక శీర్షిక నడుపుతున్నాడు.

బిరుదులుసవరించు

 • సాహితీరత్న
 • సాహితీయువరత్న
 • సాహితీసుధ
 • కళారత్న
 • నటమిత్ర
 • సమన్వయశ్రీ
 • సాహితీమిత్ర

తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక అవార్డుసవరించు

తన తండ్రి తంగిరాల వెంకటశివరామకృష్ణప్రసాద్ (1934-1999) పేరుమీద ప్రతి సంవత్సరం ఒక నాటకరంగ ప్రముఖునికి రూ.1116/-నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరిస్తున్నాడు. ఈ అవార్డు ఇంతవరకు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (2000),పోతుకూచి సాంబశివరావు (2001), ఆచంట వెంకటరత్నం నాయుడు (2002), చాట్ల శ్రీరాములు (2003), బోయి భీమన్న (2004), జి జైరాజ్‌ (2005), బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి (2006), దుగ్గిరాల సోమేశ్వరరావు (2007), కర్నాటి లక్ష్మీనరసయ్య (2008), గండవరం సుబ్బరామిరెడ్డి (2009), కందిమళ్ల ప్రతాపరెడ్డి (2010), శోభానాయుడు (2011), అల్లాబక్ష్‌ (2012), లక్ష్మణ్‌ రావు (2013), టి.కనకం (2014), రావి కొండలరావు(2016), అయ్యదేవర పురుషోత్తమరావు (2017), కె.దేవేంద్ర (2018), కాకరాల (2019) పొందారు.

చిత్రమాలికసవరించు

వెలుపలి లింకులుసవరించు

http://www.prabhanews.com/tradition/article-391052[permanent dead link]