తబ్లీఘీ జమాత్
అల్లా మాటలను బోధించే వారిని తబ్లీఘీ అని పిలుస్తారు. జమాత్ అంటే సంస్థ. తబ్లీఘీ జమాత్ (Urdu: تبلیغی جماعت) అంటే అల్లా మాటలను బోధించే సంస్థ అని అర్థం. సమావేశ స్థలాన్ని మర్కజ్ అంటారు.
మొత్తం జనాభా | |
---|---|
12 to 80 మిలియన్లు | |
వ్యవస్థాపకుడు | |
ముహమ్మద్ ఇల్యాస్ కంధ్లావీ [1] | |
మతాలు | |
దియోబంది ఇస్లాం [1][2][3] | |
గ్రంథాలు | |
ఖురన్, హదిత్, సున్నా, షరియా చట్టం |
చరిత్ర
మార్చుహరియాణా లోని మేవాట్ ప్రాంతంలో మౌలానా ఇలియస్ కాంద్లావి 1927లో ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం మత బోధనలు ప్రచారం చేసేందుకు దీనిని ప్రారంభించాడు.
పుట్టుక
మార్చుతబ్లీఘీ జమాత్ యొక్క ఆవిర్భావం ఉద్యమం వ్యక్తిగత సంస్కరణ అంశాల తీవ్రతను సూచిస్తుంది. మరాఠా సామ్రాజ్యానికి ముస్లిం రాజకీయ ఆధిపత్యం పతనమైన నేపథ్యంలో, తరువాత బ్రిటిష్ రాజ్యపు ఏకీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఇస్లామిక్ పునరుజ్జీవనం యొక్క విస్తృత ధోరణికి ఇది కొనసాగింపు.
ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన హిందువులను తిరిగి మార్చడానికి ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభించిన శుద్ధి (శుద్ధీకరణ), సంఘతాన్ (ఏకీకరణ) వంటి వివిధ హిందూ పునరుజ్జీవనాత్మక ఉద్యమాల పెరుగుదలతో తబ్లీఘీ జమాత్ ఆవిర్భావం దగ్గరగా ఉంది.
విస్తరణ
మార్చుతన గురువు రషీద్ అహ్మద్ గంగోహి చేయాలని కలలు కన్నట్లు, ఖురాన్ ఆదేశించినట్లుగా మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే ఒక ఉద్యమాన్ని సృష్టించాలని తబ్లిఘీ జమాత్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ ఇలియాస్ కోరుకున్నారు. 1926 లో మక్కాకు తన రెండవ తీర్థయాత్రలో దీనికి ప్రేరణ వచ్చింది.
ముహమ్మద్ ఇలియాస్ సహారన్పూర్ లోని మద్రాసా మజాహిర్ ఉలూమ్ వద్ద తన బోధనా పదవిని వదలి ముస్లింలను సంస్కరించడానికి మిషనరీ అయ్యాడు (కాని అతను ముస్లిమేతరులకు బోధించమని సూచించలేదు). అతను ఢిల్లీకి సమీపంలో ఉన్న నిజాముద్దీన్కు మకాం మార్చాడు, అక్కడ ఈ ఉద్యమం అధికారికంగా 1926, లేదా 1927 లో ప్రారంభించబడింది. ఉద్యమానికి మార్గదర్శకాలను రూపొందించేటప్పుడు, ఇస్లాం ఆరంభంలో ముహమ్మద్ అనుసరించిన పద్ధతుల నుండి ప్రేరణ పొందాడు. [ ముహమ్మద్ ఇలియాస్ ఉర్దూ: "! اﮮ مسلمانو! مسلمان بنو", "ఓ ముస్లింలారా, [నిజమైన] ముస్లింలుగా మారండి!" అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది తబ్లీఘీ జమాత్ యొక్క కేంద్ర దృష్టిని వ్యక్తం చేసింది: ముహమ్మద్ యొక్క జీవనశైలిని స్వీకరించడంలో ముస్లింలను ఏకం చేయడం ద్వారా వారిని సామాజికంగా పునరుద్ధరించడం వారి లక్ష్యం.
ఆ సమయంలో, కొంతమంది ముస్లిం భారతీయ నాయకులు ముస్లింలు తమ మతపరమైన గుర్తింపును కోల్పోతున్నారని, ఇస్లామిక్ ఆచారాలను (ప్రధానంగా రోజువారీ ప్రార్థనలు) పట్టించుకోరని భయపడ్డారు. ఈ ఉద్యమానికి అధికారికంగా ఏ పేరు ఇవ్వలేదు, కాని ఇలియాస్ దీనిని తహ్రిక్-ఇ ఇమాన్ అని పిలిచేవారు.
ఢిల్లీ చుట్టూ టిజే ప్రారంభించిన మేవాట్ ప్రాంతంలో మీజ్ అనే రాజ్‌పుట్ జాతి సమూహం ఉండేది, వీరిలో కొందరు ఇస్లాం మతంలోకి మారారు, తరువాత ముస్లిం రాజకీయ అధికారం క్షీణించినప్పుడు హిందూ మతంలోకి మార్చారు.
వివాదాలు
మార్చువిమర్శ
మార్చుతబ్లీఘీ జమాత్ యొక్క ఛాందస స్వభావం కారణంగా, వారు తిరోగాములని విమర్శలు వచ్చాయి. ఉద్యమంలో మహిళలు పూర్తి బురఖాను పాటిస్తారు. ఈ కారణంగా తబ్లీఘీ జమాత్ మహిళలను "అణచిపెడుతుందని, ప్రాముఖయత ఇవ్వదనీ" ఆరోపించారు.[4] కొన్ని మధ్య ఆసియా దేశాలలో ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజాఖ్‌స్తాన్లలో తబ్లీఘీ జమాత్‌ను నిషేధించారు. దాని శుద్ధమత బోధలనను ఈ దేశాల్లో ఉగ్రవాదంగా భావిస్తారు.[5]
తబ్లీఘీ జమాత్ ఇస్లామిక్ వర్గాలలో కూడా విమర్శలు ఎదుర్కొంది. భారత ఉపఖండంలో ప్రధాన వ్యతిరేకత బరేల్వి ఉద్యమం నుండి వచ్చింది. వారిపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకటి, పురుషులు తమ కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తారు, విస్మరిస్తారు. కుటుంబాలను విడిచిపెట్టి వాళ్ళు, ముఖ్యంగా దా'వా పర్యటనలకు వెళ్తూ ఉంటారు. దీనికి ప్రతిగా తబ్లీఘీ జమాత్‌లో పాల్గొనేవారు, స్త్రీ పురుషులిద్దరూ సమానంగా తబ్లీఘ్‌లో పాల్గొనాలని వాదిస్తూంటారు. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా తబ్లీఘ్ బాధ్యతలను నిర్వర్తించాలని, పిల్లల సంరక్షణ చూసుకుంటూ పురుషులు, మహిళలు పాల్గొనే వీలు కలిగించాలని వారు కోరుతూంటారు.[6]
చాలా మంది విమర్శకులు, ముఖ్యంగా హిజ్బ్ ఉట్ తహ్రీర్, జమాత్-ఇ-ఇస్లామి నుండి వచ్చినవారు, తబ్లీఘీ జమాత్ అవలంబించే తటస్థ రాజకీయ వైఖరిని విమర్శిస్తూంటారు. ఇస్లామిక్ శక్తులు, లౌకిక లేదా ఇస్లామేతర ప్రత్యర్థులతో ఘర్షణ పడిన సమయంలో, తబ్లీఘీ జమాత్ అనుచరులు మద్దతు ఇవ్వగలిగి ఉండేవారు. పాకిస్తాన్‌లో ఇస్లామిక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం (1950 లు), ఇస్లాం వర్సెస్ సోషలిజం (1969-1971), 1970, 1980 లలో భారతదేశంలో మత అల్లర్లు, ఖాట్-ఇ -నాబువత్ ఉద్యమం (1974), నిజాం-ఎ-ముస్తఫా ఉద్యమం (1977) వంటి సమయాల్లో తబ్లీఘీ తటస్థ వైఖరి అవలంబించింది [7] దీనికి ప్రతిస్పందనగా తబ్లీఘీ జమాత్, రాజకీయ చర్చలను నివారించడం ద్వారా మాత్రమే అనుచరుల ఆధ్యాత్మిక మనస్సాక్షిని పునరుజ్జీవింపచేయడంలో తబ్లీఘీ జమాత్ విజయవంతమైందని అంటుంది. అయూబ్ ఖాన్ (1960 లు), ఇందిరా గాంధీ (1975-77) ప్రభుత్వాల సమయంలో, ఇతర సామాజిక రాజకీయ ఇస్లామిక్ సమూహాలు ఆంక్షలను ఎదుర్కొన్నప్పుడు, తబ్లీఘీ అవలంబించిన రాజకీయ తటస్థ వైఖరి కారణంగా వారు ఆ కష్టకాలంలో కూడా పనిచేయగలిగారు.[7][8]
రాజకీయ భాగస్వామ్యానికి సంబంధించిన అభిప్రాయ భేదమే, తబ్లీఘీ జమాత్‌కు, ఇస్లామిస్ట్ ఉద్యమాలకూ మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం. ఇస్లామిక్ సమాజం స్థాపించడానికి రాజకీయ అధికారాన్ని సంపాదించడం సంపూర్ణ అవసరమని ఇస్లామిస్టులు విశ్వసిస్తుండగా, ఇస్లామిక్ సామాజిక క్రమాన్ని వ్యవస్థీకరించాలంటే, కేవలం రాజకీయ శక్తి సరిపోదని తబ్లిఘీ జమాత్ అభిప్రాయపడింది.[9] తబ్లీఘీ జమాత్ దృష్టి అంతా వ్యక్తి పైనే ఉంటుంది. వ్యక్తి సంస్కరణ ద్వారానే, విద్య ద్వారానే సమాజ సంస్కరణ, వ్యవస్థల సంస్కరణ చెయ్యగలమని తబ్లీఘీ సభ్యులు నమ్ముతారు. దేశాలు, సామాజిక వ్యవస్థలూ వాటిని ఏర్పరుచుకునే వ్యక్తులను బట్టే ఉంటాయనీ, అందువల్ల, సంస్కరణలు మొదలు పెట్టాల్సింది అట్టడుగున, వ్యక్తుల దగ్గర నుండి తప్ప, ఉన్నత స్థాయి రాజకీయ వ్యవస్థతో కాదనీ వారు గట్టిగా నమ్ముతారు.[10]
తబ్లీఘీకి తగినంత ఛాందసవాదం, సూఫీలతో సంబంధం లేదని ఇతర మత ఛాందసులు ఆరోపించారు.[11][12] సౌదీ అరేబియా మాజీ గ్రాండ్ ముఫ్తీ అబ్దుల్-అజీజ్ ఇబ్న్ బాజ్ "జమా'అతుల్-తబ్లీఘ్‌లో ... చాలా విచలనాలు ఉన్నాయి" అని చెప్పినట్లు సమాచారం. "వాళ్ళలో బి'డా, షిర్క్ అంశాలున్నాయి. కాబట్టి వారి వెంట వెళ్ల కూడదు" [13][14] మరో సలాఫీ మతాధికారి ఫాలిహ్ ఇబ్న్ నఫీ అల్-హర్బీ, తబ్లీఘీ "కల్పిత కథలకు, నిరాధారమైన కథలకూ మూలం. వాళ్ళు బి'డా జనం" అని ఆరోపించారు.[15]
తీవ్రవాదం, ఉగ్రవాదం
మార్చు2001 సెప్టెంబరు నుండి యుఎస్ ప్రభుత్వం తబ్లీఘీ జమాత్‌ను నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది.[16] వారి సభ్యులను ఉగ్రవాద సంస్థలు తీసుకున్నప్పటికీ, సంస్థకూ ఉగ్రవాదానికీ మధ్య ప్రత్యక్ష సంబంధాలు లేవనీ వెల్లడైంది.[16] ఉగ్రవాదంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తబ్లీఘీ జమాత్ నాయకులు ఖండించారు.[16] తబ్లీఘీ జమాత్ సాధారణంగా రాజకీయ కార్యకలాపాలను, చర్చలనూ నివారిస్తుందనీ, మతం మీద మాత్రమే దృష్టి పెడుతుందనీ వాళ్ళు చెప్పారు.[16] ఇది అన్ని రకాల వ్యక్తులను ఆకర్షిస్తుందనీ, దాని సభ్యత్వాన్ని నియంత్రించదనీ జమాత్ అంగీకరించింది.[17]
తబ్లీఘీ జమాత్ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, స్వయం-నిర్ణయాధికారాన్నీ తిరస్కరిస్తుంది. ఇస్లామిక్ జీవనశైలికి కఠోరంగా కట్టుబడి ఉండాలని నమ్ముతారు.[18][19] సమూహపు భావజాలాన్ని కొంతమంది ఖవారీజ్‌తో పోల్చారు. ఖవారీజ్‌ది ప్యూరిటానికల్ విధానమనీ, తబ్లీఘీ జమాత్ దానికి భిన్నంగా "సాంప్రదాయవాద" విధానాన్ని అవలంబిస్తుందనీ మరికొందరు అభిప్రాయపడ్డారు.[19][20][21][22]
ప్రపంచవ్యాప్తంగా తబ్లీఘీ జమాత్ ఉనికినీ, దాని అప్రజాస్వామిక వైఖరినీ ఉగ్రవాద గ్రూపులు వాడుకున్నాయని చట్టాన్ని అమలు చేసే అధికారులు చెబుతున్నారు.[5] ఫిలిప్ హేనీ తబ్లీఘీ జమాత్‌ను "జాత్యంతర ఇస్లామిస్ట్ నెట్‌వర్క్"గా అభివర్ణించాడు.[5] అల్-ఖైదా, లష్కర్-ఇ-తైబా వంటి జిహాదీ సంస్థలకు తబ్లీఘీ జమాత్ "ఒక పైపులైను, ఒక సారవంతమైన నియామక క్షేత్రం" అని వర్ణించారు.[22][23][24] అయితే, తబ్లీఘీ జమాత్ పైన అమెరికా అధికారులు ఉగ్రవాద ఆరోపణలు చేయలేదు.[5][16] తబ్లీఘీ జమాత్ నాయకులు అల్-ఖైదాను ఖండించారు.[5] అలెక్స్ అలెక్సియేవ్ ప్రకారం, "ఇస్లామిస్ట్ ఉగ్రవాదులలో 80% శాతం మంది తబ్లీఘీ శ్రేణుల నుండే వచ్చారు. అందువల్లనే ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ అధికారులు తబ్లీఘీ జమాత్‌ను 'మత ఛాందసవాదపు యాంటెచాంబర్' అని అన్నారు." [5][24][25]
ఉగ్రవాదంపై అభియోగాలు మోపబడిన తబ్లిఘీ సభ్యులు: జకారియాస్ మౌసౌయి (11 సెప్టెంబరు దాడుల్లో యునైటెడ్ స్టేట్స్లో అభియోగాలు మోపారు), హెర్వే జమెల్ లోయిసో (ఆఫ్ఘనిస్తాన్‌లో దొరికిన ఫ్రెంచ్ పౌరుడు), జమెల్ బెఘల్ (అల్జీరియాలో జన్మించిన ఫ్రెంచ్ పౌరుడు, అల్ ఖైదా సభ్యుడు. పారిస్‌లోని యుఎస్ ఎంబసీని పేల్చివేయడానికి కుట్రలో దోషిగా తేలింది),[26] సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ .[5] స్పెయిన్లోని బార్సిలోనాలో 2008 జనవరి న జరిగిన ఒక బాంబు దాడిలో, "కొన్ని మీడియా నివేదికల" ప్రకారం, వరుస దాడులలో పోలీసులు అరెస్టు చేసిన పద్నాలుగు మంది నిందితులు (బాంబు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్న చోట) తబ్లీఘీ జమాత్ సభ్యులని నగరంలోని ఒక ముస్లిం నాయకుడు పేర్కొన్నాడు.[5][5] తబ్లీఘీ జమాత్ సభ్యులకు సంబంధం ఉన్న ఇతర ఉగ్రవాద కుట్రలు, పౌరులపై దాడుల్లో పోర్ట్ ల్యాండ్ సెవెన్, లక్కవన్నా సిక్స్, 2006 అట్లాంటిక్ ఎయిర్క్రాఫ్ట్ ప్లాట్, 7/7 లండన్ బాంబు దాడులు, 2007 లండన్ కార్ బాంబులు, 2007 గ్లాస్గో అంతర్జాతీయ విమానాశ్రయం దాడి వంటి సంఘటనలు ఉన్నాయి. .[5]
తబ్లీఘీ జమాత్‌పై అమెరికన్ ఫారిన్ పాలసీ కౌన్సిల్ నివేదిక ఇలా పేర్కొంది:
తబ్లీఘీ అవలంబించే కఠోర ఇస్లాము నియమాలు, ఇతర మతాలు, ఆచారాల పట్ల అసహిష్ణుత, యావత్ ప్రపంచాన్నీ ఇస్లాము లోకి మార్చాలనే పట్టుదల వల్లా, అది ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో దాన్ని జిహాదీ సమూహాలకు సమర్థకులుగా భావించవచ్చు. అయితే, రాజకీయాలకు దూరంగా ఉండటాన (కనీసం బయటికి అలా కనిపిస్తారు) చాలా చోట్ల అది ప్రభుత్వాల, ప్రభుత్వ సంస్థల నిఘా నేత్రం నుండి తప్పించుకోగలిగింది.[27]
మార్క్ గాబోరియో ప్రకారం, దాని తత్వం, దేశీయాంతర లక్ష్యాలలో "ప్రపంచాన్ని ప్రణాళికాబద్ధంగా జయించడం" ఉంది.[24][28]
చాలా మంది పరిశీలకులు ఈ సమూహం కొంతవరకైనా "అపొలిటికల్"గా ఉంటుందని అభివర్ణించారు. ఎందుకంటే ఇది మీడియా దృష్టికీ, ప్రభుత్వ దృష్టికీ దూరంగా ఉంటుంది. ఎక్కువగా రహస్యంగా పనిచేస్తుంది. సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సూత్రప్రాయమైన వైఖరిలతో కఠినమైన జీవనశైలి అవలంబించే మతప్రచారకులు ఇందులో ఉంటారు.[24] ఉదాహరణకు, ముగ్గురు పాశ్చాత్య ఇస్లాం నిపుణులు దీనిని ఇలా వర్ణించారు:
శాంతియుతగా, అపొలిటికల్‌గా ఇస్లాము బోధించడం.[29] —గ్రాహం ఫుల్లర్, మాజీ సిఐఏ అధికారి, ఇస్లాము నిపుణుడు, (ది ఫ్యూచర్ ఆఫ్ పొలిటికల్ ఇస్లామ్ రచయిత)
పూర్తిగా అపొలిటికల్‌గా, చట్టానికి లోబడి ఉంటుంది.[24][30] —ఫ్రెంచి నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చి లో ఇస్లాము నిపుణుడు, ఒలీవియర్ రాయ్,
అపొలిటికల్‌గా, నిశ్శబ్దంగా అట్టడుగు నుండి పనిచేసుకుపోయే పరిణామ వ్యవస్థ (వ్యక్తులను మార్చేసే తమ కార్యక్రమాలను అల్కహాలిక్స్ ఎనానిమస్‌తో పోల్చి చూపిస్తూ) —బార్బరా మెట్‌కాఫ్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్
మరొకరు దీనికి "అపోలిటికల్ వైఖరి" ఉందని చెబుతూ-
దీని వలన - ముస్లిము, ముస్లిమేతర సమాజాల్లో, రాజకీయంగా చురుగ్గా ఉండే ఇతర ఇస్లామిక్ సమూహాలు తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొనే సమయంలో - ఇది ఏ ఇబ్బందీ లేకుండా చొచ్చుకుపోయి, పని చేసుకోగలిగింది.[31] —ముంతాజ్ అహ్మద్
ఇతర దేశాల్లో లాగానే, ఈ దేశంలో [బ్రిటన్] కూడా తబ్లీఘీ జమాత్, ఏ రకంగా చూసినా ఒక రహస్య సంఘం లాగా పనిచేస్తుంది [...] దాని సమావేశాలు రహస్యంగా జరుగుతాయి. వాటికి ఎవరు హాజరౌతారో మనకు తెలుయదు. దానికి ఎంత డబ్బుందో మనకు తెలియదు. ర్చుల వివరాలు గానీ ప్రచురించరు. దాని గురించి అది అసలు మాట్లాడనే మాట్లాడదు. దానిలోకి తొంగి చూడ్డం చాలాచాలా కష్టం.
—డా. పాట్రిక్ సుఖ్‌దేవ్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ డైరెక్టరు, [32]
తబ్లీఘీ జమాత్ చాలా రహస్య సమూహం. అది ఎలా పనిచేస్తుందో దాని నాయకత్వం ఎప్పుడూ చెప్పలేదు. అపొలిటికల్‌గా ఉంటుందని చెప్పుకుంటారు గానీ, దీనికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల రాజకీయ సైనిక రంగాలతో సంబంధాలు ఉన్నాయి.[22][24] పశ్చిమ దేశాలలో, అనేక మంది యువకులు ఈ సంస్థలో పనిచేస్తూనే, మతం పట్ల తీవ్ర భావజలం పెంపొందించుకున్నారు.[26]
పాకిస్తాన్లో, ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ (అతని తండ్రి ప్రముఖ తబ్లీఘీ సభ్యుడు, ఫైనాన్షియర్) తబ్లీఘీ సభ్యులు ప్రముఖ రాజకీయ పదవులు పొందడంలో సహాయపడ్డాడు.[33] ఉదాహరణకు, 1998 లో, తబ్లిఘీ సానుభూతిపరుడైన ముహమ్మద్ రఫీక్ తరార్ పాకిస్తాన్ అధ్యక్ష పదవిని చేపట్టాడు. 1990 లో లెఫ్టినెంట్ జనరల్ జావేద్ నాసిర్, పాకిస్తాన్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ యొక్క శక్తివంతమైన డైరెక్టర్ పదివిని చేపట్టాడు. 1995 లో, ఇస్లామిస్టులపై పెద్దగా సానుభూతి లేని బెనజీర్ భుట్టో తిరిగి ప్రధాని వఅయిన రువాత, అనేక డజన్ల మంది ఉన్నత స్థాయి సైనికాధికారులు, పౌరులూ తిరుగుబాటు చేసినపుడు పాకిస్తాన్ సైన్యం అడ్డుకుంది. ఈ తిరుగుబాటుదార్లలో కొందరు తబ్లిఘీ జమాత్ సభ్యులు. ఈ సభ్యుల్లో కొందరు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్-నిర్వచించిన ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్లో కూడా సభ్యత్వం పొందారు.[24][34] 2016 జనవరిలో పాకిస్తాన్ పంజాబ్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో మత బోధనలను నిషేధించింది. తబ్లీఘీ జమాత్ (ఇతర విద్యార్థేతరులతో పాటు) ను క్యాంపస్ హాస్టళ్ళలో కూడా బోధించకుండా, అసలు అక్కడ ఉండకుండా నిషేధించింది. పాకిస్తాన్‌లో "తబ్లీఘీ జమాత్‌పై ఆంక్షలు విధించడం అదే మొదటిసారి".[35]
2019–20 కరోనావైరస్ మహమ్మారి
మార్చు2019–20 కరోనావైరస్ మహమ్మారి సమయంలో తబ్లీఘీ జమాత్ ప్రజల దృష్టినీ, మీడియా దృష్టినిఅ ఆకర్షించింది.[36][37][38]
మలేషియాలో
మార్చు2020 2020 ఫిబ్రవరి 27 మార్చి 1 మధ్య తబ్లీఘీ జమాత్, మలేసియా, కౌలాలంపూరులో, శ్రీ పెటాలింగ్ లోని ఒక మసీదు వద్ద ఒక అంతర్జాతీయ మత సమావేశాన్ని నిర్వహించింది. 620 కి పైగా COVID-19 కేసులు ఈ స్మావేశాంతో ముడిపడి ఉన్నాయి. ఇది ఆగ్నేయాసియాలో వైరస్ యొక్క అతిపెద్ద ప్రసార కేంద్రంగా మారింది.[39][40] శ్రీ పెటాలింగ్ సంఘటనతో మలేషియాలో కోవిడ్ -19 కేసులలో అత్యధిక పెరుగుదలకు కారణమైంది. 2020 మార్చి 17 నాటికి మలేషియాలో 673 ధ్రువీకరించబడిన కేసులలో మూడింట రెండు వంతుల మంది ఈ సంఘటనతో ముడిపడి ఉన్నవారే.[41] బ్రూనైలో వెలుగు చూసిన Covid -19 కేసుల్లో చలావరకు ఇక్కడి నుండి వచ్చినవే. ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాల్లోని కేసులు కూడా ఈ సంఘటనతో స్ంబ్ంధం ఉన్నాయి.[42][43][44]
ఇండోనేషియా
మార్చువ్యాధి వ్యాప్తిస్తూ ఉన్నప్పటికీ, తబ్లీఘీ జమాత్ మార్చి 18 న ఇండోనేషియాలోని దక్షిణ సులవేసిలోని మకాస్సార్ సమీపంలో గోవా రీజెన్సీలో రెండవ అంతర్జాతీయ సామూహిక సమావేశాన్ని నిర్వహించింది. సమావేశాన్ని రద్దు చేయమన్న ప్రభుత్వ ఆదేశాలను నిర్వాహకులు మొదట్లో తిరస్కరించినప్పటికీ, వారు ఆ తరువాత సమావేశాన్ని రద్దు చేశారు.[45][46]
పాకిస్థాన్
మార్చుపాకిస్తాన్లో లాహోర్ సమీపంలో రైవింద్ వద్ద 250,000 మంది కోసం మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.[5][47] అధికారుల అభ్యర్ధనలకు ప్రతిస్పందనగా ఈ కార్యక్రమం "నిలిపివేసారు". కాని పాల్గొనేవారు అప్పటికే చేరుకున్నారు, కలిసి ఉన్నారు. వారు తిరిగి వెళ్ళేటపుడు, వైరస్‌ను మోసుకెళ్ళారు. గాజా స్ట్రిప్‌లో రెండు కేసులు ఇక్కడి నుండి వెళ్ళినవే.[48] పరీక్ష సమయంలో, తబ్లీఘీ జమాత్‌లోని 40 మంది సభ్యులకు COVID-19 సోకినట్లు గుర్తించారు. వైరస్ వాహకాలుగా అనుమానించిన నలుగురు నైజీరియా మహిళలతో సహా మరో 50 మందిని లాహోర్ నుండి 50 కి.మీ. దూరంలో క్వారంటైన్ చేసారు. సింధ్‌లోని హైదరాబాద్‌లో సంస్థలోని 38 మంది సభ్యులు కరోనావైరస్ పాజిటివ్ అని గుర్తించారు. ఈ కార్యక్రమం జరిగిన స్థలం రాయివింద్,లో పాకిస్తాన్ అధికారులు లాక్‌డౌన్ విధించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పోలీసులు తబ్లీఘీ జమాత్ సభ్యులను సింధ్, పంజాబ్ ల లోని వారి కార్యాలయాల నుండి అరెస్ట్ చేశారు.[5]
ఐసోలేషన్ సౌకర్యం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సంస్థ సభ్యుడు ఒక పోలీసును కత్తితో పొడిచాడు.[49] ఈ సంక్షోభ సమయంలో, పాకిస్తాన్ ప్రభుత్వం నిస్సహాయ పరిస్థితుల్లో పడింది.[50] సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో 2020 మార్చి 31 న మరో తొంభై నలుగురు జమాత్ సభ్యులు కరోనా వైరస్‌కు పాజిటివ్ అని తేలింది.[51] ఏప్రిల్ 21 నాటికి, ఈ సంఘటన పాకిస్తాన్‌లో, 27% కోవిడ్ -19 కేసులకు కారణమని తేలింది.[52]
భారతదేశం
మార్చుమహారాష్ట్రలోని వాసాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తబ్లీఘీ జమాత్ మొదట అనుకుంది. మహారాష్ట్రలో COVID-19 వ్యాప్తి చెందిన తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు సమావేశానికి అనుమతి నివ్వలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన తరువాత, తబ్లీఘీ జమాత్ యొక్క నిజాముద్దీన్ శాఖ, ఢిల్లీలోని నిజాముద్దీన్ వెస్ట్‌లో సామూహిక మత కార్యక్రమాన్ని ( ఇజ్టెమా ) నిర్వహించింది.[53][54] సెమినార్లు గాని, సమావేశాలు గానీ, ఏదైనా పెద్ద కార్యక్రమం (200 మందికి మించి) గానీ జరగకూడదని ఢిల్లీ ప్రభుత్వం 2020 మార్చి 13 న ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థ విస్మరించింది. దానిని అమలు చేయడంలో ఢిల్లీ పోలీసులు కూడా విఫలమయ్యారు.[55][56] మిషనరీ కార్యకలాపాల కోసం పర్యాటక వీసాను దుర్వినియోగం చేయడం, విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల ఇంటి నిర్బంధాన్ని తీసుకోకపోవడం వంటి ఇతర నిబంధనలను విదేశీయులు ఉల్లంఘించారు.[57]
2020 మార్చి 31 నాటికి కోవిడ్ లక్షణాలను చూపించిన 300 మందిలో కనీసం 24 మంది వైరస్ పాజిటివ్ అని తేలింది.[5] సంక్రమణ మూలాలు ఇండోనేషియాకు చెందిన బోధకులు అని భావించారు.[58] సమావేశాలకు హాజరైన వారిలో చాలామంది తమ రాష్ట్రాలకు తిరిగి వీళ్ళారు. స్థానిక ప్రభుత్వాలకు తెలియకుండా వీళ్ళు విదేశీయులకు ఆశ్రయం కల్పించారు.[59] చివరికి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, అస్సాంలలో వ్యాధి వ్యాఒప్తి మొదలైంది. మార్చి 30 నాటికి మొత్తం నిజాముద్దీన్ వెస్ట్ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.[60] జమాత్ హాజరైన అనేక మందిని మర్కజ్ నుండి ఖాళీ చేయించిన తరువాత, వారిలో 167 మంది వలన వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలతో వారిని ఆగ్నేయ ఢిల్లీలోని రైల్వే సదుపాయంలో నిర్బంధించారు. తబ్లీఘీ జమాత్ సమావేశం, భారతదేశంలోని ప్రధాన కరోనావైరస్ హాట్‌స్పాట్‌లలో ఒకటిగా అవతరించింది.[61] 4067 నమోదైన కేసుల్లో 1445 కేసులు హాజరైన వారితోలింకు ఉన్నవేనని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.[5][5] 2020 ఏప్రిల్ 18 న, కేంద్ర ప్రభుత్వం 4,291 కేసులు (భారతదేశంలో మొత్తం 14,378 కోవిడ్ -19 కేసులలో 29.8%) తబ్లీఘీ జమాత్‌తో ముడిపడి ఉన్నాయని, ఈ కేసులు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యాపించాయనీ చెప్పారు.[5]
ఒక పక్కన మహమ్మారి ప్రబలుతోదనే కారణంఓ, ముంబైలో మహారాష్ట్ర పోలీసులు ఈ మత సమావేశాలను నిషేధించగా,[62] ఢిల్లీ పోలీసులు ఈ సంఘటనను ఎలా అనుమతించారనే ప్రశ్నలు తలెత్తాయి.[63] మార్చి 22 నుండి ఢిల్లీలో COVID లాక్డౌన్ అమల్లోకి రావడంతో, నిజాముద్దీన్ మర్కజ్‌లోనే ఇంకా మిగిలి ఉన్న మిషనరీలు అక్కడ చిక్కుకున్నారు. వారి తరలింపు కోసం కార్యకర్తలు అధికారుల సహాయం కోరడం ప్రారంభించారు.[64] ఏప్రిల్ 4 నాటికి, భారతదేశంలో మొత్తం 30% కేసులను సూచించే 1000 కి పైగా కేసులు నిజాముద్దీన్ సంఘటనతో ముడిపడి ఉన్నాయి. తబ్లీఘీ జమాత్ మిషనరీలతో పరిచయం ఏర్పడిన 22,000 మందిని నిర్బంధించాల్సి వచ్చింది.[65] 2020 మార్చి 31 న, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897, సెక్షన్ 269 (వ్యాధి వ్యాప్తి చెందటానికి కారణమైన నిర్లక్ష్య చర్య), 270 లోని సెక్షన్ 3 (నేరానికి జరిమానా) కింద (వ్యాధి వ్యాప్తి చెందే ప్రాణాంతక చర్య), ఐపిసి యొక్క 271 (దిగ్బంధ నియమానికి అవిధేయత), 120 బి (నేరపూరిత కుట్ర శిక్ష) ల కింద ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్, ముహమ్మద్ సాద్ కంధ్లావి తదితరులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.[66][67][68] 2020 ఏప్రిల్ 8 న ఆగ్నేయ ఢిల్లీలోని జాకీర్‌నగర్‌లో తబ్లీఘీ జమాత్ నాయకుడు మౌలానా సాద్ కంధల్వీని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. తాను అతను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నాడు.[69] మసీదులలో దాచడం సహా, వ్యాధి వ్యాప్తికి సహాయపడినందుకు మిషనరీ గ్రూపులోని అనేక ఇతర సభ్యులపై కూడా కేసు నమోదు చేసామని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, ముస్లింలను వేరుచేయడం లేదని భారత ప్రభుత్వం చెప్పింది.[70]
మరింత అధ్యయనం కోసం
మార్చు- Alex Alxiev, Tablighi Jamaat: Jihad's Stealthy Legions Archived 2020-04-02 at the Wayback Machine, Middle East Quarterly, Winter 2005, pp. 3–11
- Agwani, Mohammed (1986). Islamic Fundamentalism in India. Twenty-First Century India Society. OCLC 246335287.
- Alexiev, Alex (2005). "Tablighi Jamaat: Jihad's Stealthy legions". Middle East Quarterly.
- Ali, Jan A. (2012). Islamic Revivalism Encounters the Modern World: A Study of the Tablīgh Jamā‘at. New Delhi: Sterling Publishers. ISBN 978-81-207-6843-7
- Burki, Shireen (2013). "The Tablighi Jama'at:Proselytizing Missionaries or Trojan Horse?". Journal of Applied Security Research. 8: 98–117. doi:10.1080/19361610.2013.738407.
- Kepel, Gilles (2002). Jihad: The Trail of Political Islam. Harvard University Press. ISBN 978-0674010901.
Jihad: The Trail of Political Islam.
- Kepel, Gilles (2004). The War for Muslim Minds: Islam and the West. Cambridge, MA: Belknap Press of Harvard University Press. ISBN 0-674-01575-4. Retrieved 10 August 2009.
- Rabasa, Angel (2004). The Muslim world after 9/11. Santa Monica, CA: Rand. ISBN 0-8330-3712-9. Retrieved 10 August 2009.
- Snehesh Alex Philip, What is Tablighi Jamaat? Organiser of Delhi event behind spike in India’s Covid-19 count Archived 2020-04-10 at the Wayback Machine, The Print, 31 March 2020.
- Roy, Olivier (1994). The Failure of Political Islam. Harvard University Press. ISBN 978-0674291416. Retrieved 2 April 2015.
The Failure of Political Islam muslim world league.
- Sikand, Yoginder (1998). "The Origins and Growth of the Tablighi Jamaat in Britain". Islam and Christian-Muslim Relations. 9 (2): 171–92. doi:10.1080/09596419808721147.
- Sikand, Yoginder (2002). The Origins and Development of the Tablighi Jama'at (1920s–1990s): A cross cultural comparative study. New Delhi: Orient Longman. ISBN 978-8125022985.
- Jenny Taylor, What is the Tablighi Jamaat?, The Guardian, 8 September 2009.
- Stern, Jessica (2000). "Pakistan's Jihad Culture". Foreign Affairs. 79 (6): 115–26. doi:10.2307/20049971. JSTOR 20049971.
లంకెలు
మార్చుమూలాలు
మార్చు- ↑ ఇక్కడికి దుముకు: 1.0 1.1 Pieri, Zacharias (2021). "Part 1: Sunnī Traditions – Tablīghī Jamāʿat". In Cusack, Carole M.; Upal, M. Afzal (eds.). Handbook of Islamic Sects and Movements. Brill Handbooks on Contemporary Religion. Vol. 21. Leiden and Boston: Brill Publishers. pp. 49–72. doi:10.1163/9789004435544_005. ISBN 978-90-04-43554-4. ISSN 1874-6691.
- ↑ Burki, Shireen Khan (2013). "The Tablighi Jama'at: Proselytizing Missionaries or Trojan Horse?". Journal of Applied Security Research. 8 (1). London: Routledge: 98–117. doi:10.1080/19361610.2013.738407. ISSN 1936-1629. S2CID 144466130.
- ↑ Kuiper, Matthew J. (22 February 2018). "Tablighi Jamaʿat - Oxford Islamic Studies Online". www.oxfordbibliographies.com. Oxford University Press. Archived from the original on 3 March 2018. Retrieved 6 January 2021.
- ↑ Khalid Hasan (13 August 2006). "Tableeghi Jamaat: all that you know and don't". Daily Times. Archived from the original on 8 January 2016. Retrieved 21 January 2010.
- ↑ ఇక్కడికి దుముకు: 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 Haahr, Kathryn (13 February 2008). "Spanish Police Arrest Jamaat al-Tabligh Members in Bomb Threat". Jamestown Foundation. Archived from the original on 5 February 2016. Retrieved 24 January 2016.
- ↑ "Islam and women: The case of the Tablighi Jama'at". 27 February 1996. Archived from the original on 25 మార్చి 2009. Retrieved 26 ఏప్రిల్ 2020.
- ↑ ఇక్కడికి దుముకు: 7.0 7.1 Ahmad 1994, p. 518
- ↑ "Growing Islamic State Influence in Pakistan Fuels Sectarian Violence" (in ఇంగ్లీష్).
- ↑ Ahmad 1994, p. 519
- ↑ Ahmad 1994, p. 517
- ↑ "Fadhaa'il A'maal & the truth about Tableegh Jaam'aat. What is Fazaail-e-Aa'maal?". December 2004. Archived from the original on 31 జనవరి 2016. Retrieved 24 January 2016.
- ↑ "The Jamaat Tableegh and the Deobandis: A Critical Analysis of their Beliefs, Books and Dawah by Sajid Abdul-Kayum". Archived from the original on 22 జూన్ 2015. Retrieved 1 July 2015.
- ↑ "Final fatwa of Shaykh 'Abdul-'Azeez ibn Baaz warning against the Jamaa'ah at-Tableegh". Retrieved 4 February 2016.
- ↑ "Jama'atul Tableegh & the Prayer Within Mosques That Contain Graves". Archived from the original on 7 మార్చి 2016. Retrieved 31 July 2014.
- ↑ "Investigative Reports & findings of Saudi Scholars on Tableeghi Jamaat". 22 April 1986. Archived from the original on 15 ఏప్రిల్ 2013. Retrieved 4 February 2016.
- ↑ ఇక్కడికి దుముకు: 16.0 16.1 16.2 16.3 16.4 Takar, Nafees; Zahid, Noor (15 January 2016). "Are Conservative Muslim Tablighi Jamaat Pacifists or Extremists?". VOA News. Archived from the original on 3 January 2020. Retrieved 5 April 2020.
- ↑ Lewis, Paul. "Inside the Islamic group accused by MI5 and FBI". The Guardian. Archived from the original on 2 February 2017. Retrieved 31 July 2014.
- ↑ Silber, Mitchell D. (2011-11-29). The Al Qaeda Factor: Plots Against the West (in ఇంగ్లీష్). University of Pennsylvania Press. pp. 37, 38. ISBN 978-0-8122-0522-0.
- ↑ ఇక్కడికి దుముకు: 19.0 19.1 Pisoiu, Daniela (2011-07-15). Islamist Radicalisation in Europe: An Occupational Change Process (in ఇంగ్లీష్). Routledge. p. 159. ISBN 978-1-136-65065-9.
- ↑ Nahid Afrose Kabir. Young British Muslims: Identity, Culture, Politics and the Media. Edinburgh University Press.
- ↑ Alexiev, Alex (2005-01-01). "Tablighi Jamaat: Jihad's Stealthy Legions". Middle East Quarterly (in ఇంగ్లీష్). Archived from the original on 2020-04-02. Retrieved 2020-04-11.
- ↑ ఇక్కడికి దుముకు: 22.0 22.1 22.2 Burki, Shireen Khan (2013-01-01). "The Tablighi Jama'at: Proselytizing Missionaries or Trojan Horse?". Journal of Applied Security Research. 8 (1): 111. doi:10.1080/19361610.2013.738407. ISSN 1936-1610.
- ↑ Cigar, Norman L.; Kramer, Stephanie E. (2011). Al-Qaida After Ten Years of War: A Global Perspective of Successes, Failures, and Prospects. Quantico, VA: Marine Corps University Press. ISBN 978-0-16-090299-4.
- ↑ ఇక్కడికి దుముకు: 24.0 24.1 24.2 24.3 24.4 24.5 24.6 Alexiev, Alex (Winter 2005). "Tablighi Jamaat: Jihad's Stealthy Legions". Middle East Quarterly. 12 (1): 3–11. Archived from the original on 8 January 2016. Retrieved 11 January 2016.
- ↑ Le Monde (Paris), 25 January 2002.
- ↑ ఇక్కడికి దుముకు: 26.0 26.1 Smith, Craig S. (29 April 2005). "French Islamic group offers rich soil for militancy". The New York Times. Archived from the original on 4 September 2012. Retrieved 23 January 2016.
- ↑ "Tablighi Jama'at". The World Almanac of Islamism. American Foreign Policy Council. Archived from the original on 23 March 2016. Retrieved 28 December 2015.
- ↑ Marc Gaborieau, "Transnational Islamic Movements: Tablighi Jamaat in Politics," ISIM Newsletter (International Institute for the Study of Islam in the Modern World), July 1999, p. 21.
- ↑ "The Future of Political Islam". Foreign Affairs. 2002-03-01. Retrieved 2008-03-28.
- ↑ "Search for a perfect world of Islam". Le Monde diplomatique. 2002-05. Retrieved 2008-03-28.
- ↑ Ahmad (1994), p. 524
- ↑ Burki, Shireen Khan (2013-01-01). "The Tablighi Jama'at: Proselytizing Missionaries or Trojan Horse?". Journal of Applied Security Research. 8 (1): 111. doi:10.1080/19361610.2013.738407. ISSN 1936-1610.
- ↑ B. Raman, "Nawaz in a Whirlpool," South Asia Analysis Group, 10 October 1999.
- ↑ The News (Lahore), 13 February 1995.
- ↑ "Punjab campus hostels out of bounds for Tableeghi Jamaat" , Dawn, 30 January 2016
- ↑ "None of us have fear of corona".
- ↑ "How Tablighi Jamaat event became India's worst coronavirus vector".
- ↑ "'Largest viral vector' — how Tablighi Jamaat spread coronavirus from Malaysia to India".
- ↑ Beech, Hannah (20 March 2020). "None of Us Have a Fear of Corona': The Faithful at an Outbreak's Center". New York Times. Archived from the original on 26 March 2020. Retrieved 3 April 2020.
- ↑ "Despite Covid-19 threat, thousands of Muslim pilgrims gather in Indonesia". The Star. 18 March 2020. Archived from the original on 18 March 2020. Retrieved 21 March 2020.
- ↑ "How Mass Pilgrimage at Malaysian Mosque Became Coronavirus Hotspot". Reuters. 17 March 2020. Archived from the original on 4 April 2020. Retrieved 2 April 2020.
- ↑ "How Sri Petaling tabligh became Southeast Asia's Covid-19 hotspot". New Straits Times. Reuters. 17 March 2020. Archived from the original on 26 March 2020. Retrieved 21 March 2020.
- ↑ CABRERA, Ferdinandh B. (23 March 2020). "19 Filipino tablighs positive for COVID-19 quarantined in Malaysia". Minda News. Archived from the original on 5 April 2020. Retrieved 3 April 2020.
- ↑ "Vietnam reports new case of coronavirus linked to tabligh event". Reuters. 18 March 2020. Archived from the original on 18 మార్చి 2020. Retrieved 3 April 2020 – via Malaysia Kini.
- ↑ Ihsanuddin (19 March 2020). "Istana: Ijtima Ulama Dunia di Gowa Batal, Ribuan Peserta Dipulangkan". Kompas. Archived from the original on 19 March 2020. Retrieved 21 March 2020.
- ↑ Sukumaran, Tashny (19 March 2020). "How the coronavirus spread at Malaysia's tabligh Islamic gathering". South China Morning Post. Archived from the original on 21 March 2020. Retrieved 21 March 2020.
- ↑ Chaudry, Suddaf (4 April 2020). "Coronavirus: Pakistan quarantines Tablighi Jamaat missionaries". Middle East Eye. Archived from the original on 6 ఏప్రిల్ 2020. Retrieved 19 April 2020.
- ↑ "'God Will Protect Us': Coronavirus Spreads Through an Already Struggling Pakistan". New York Times. 1 April 2020. Archived from the original on 1 April 2020. Retrieved 26 March 2020.
- ↑ "Coronavirus: Tablighi Jamaat member in Pakistan stabs policeman as he tries to escape quarantine". OpIndia. 2020-03-31. Archived from the original on 2020-06-11. Retrieved 2020-04-03.
- ↑ ur-Rehman, Zia; Abi-Habib, Maria; Mehsud, Ihsanullah Tipu; Bashir, Saiyna (2020-03-26). "'God Will Protect Us': Coronavirus Spreads Through an Already Struggling Pakistan". The New York Times (in ఇంగ్లీష్). ISSN 0362-4331. Archived from the original on 1 April 2020. Retrieved 2020-04-03.
- ↑ "94 more members of Tableeghi Jamaat tested corona positive". 1 April 2020. Retrieved 6 April 2020.
- ↑ https://tribune.com.pk/story/2203599/9-27-pakistans-covid-19-cases-linked-raiwind-ijtima-report/
- ↑ "2100 foreigners visited India for Tablighi activities this year: MHA". The Economic Times. 31 March 2020. Archived from the original on 19 ఏప్రిల్ 2020. Retrieved 26 ఏప్రిల్ 2020.
- ↑ "Coronavirus: State govts race to curb spread as hundreds from Tablighi meet show symptoms". The Times of India. 1 April 2020. Archived from the original on 1 April 2020. Retrieved 3 April 2020.
- ↑ "IPL, all big events banned in Delhi amid coronavirus outbreak: Manish Sisodia".
- ↑ "Delhi Man Has Coronavirus. All Staff At His Noida Office Quarantined".
- ↑ Singh, Vijaita (31 March 2020). "Home Ministry asked States to identify 824 foreign Tablighi members". The Hindu. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 19 April 2020.
- ↑ "Coronavirus: Search for hundreds of people after Delhi prayer meeting". BBC. 31 March 2020. Archived from the original on 1 April 2020. Retrieved 1 April 2020.
- ↑ Saravanan, S.P. (17 March 2020). "Five tourists from Thailand admitted to isolation ward at Erode hospital". The Hindu. Archived from the original on 18 మార్చి 2020. Retrieved 19 April 2020.
- ↑ Trivedi, Saurabh (30 March 2020). "Coronavirus | 200 people in Nizamuddin develop symptoms; area cordoned off". The Hindu. Archived from the original on 30 March 2020. Retrieved 30 March 2020.
- ↑ "Tablighi Jamaat case: Story behind the Covid hotspot that set cops on a frantic nationwide hunt". The Economic Times. 2 April 2020.
- ↑ Singh, Divyesh (2 April 2020). "When Maharashtra Police cancelled a parallel, bigger Tablighi Jamaat event to avoid Covid-19 spread". India Today. Archived from the original on 4 ఏప్రిల్ 2020. Retrieved 19 April 2020.
- ↑ Pandey, Munish (1 April 2020). "Timeline of how Delhi Police, government made Markaz a ticking time bomb". India Today. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 19 April 2020.
- ↑ "Nizamuddin markaz had sought help from authorities for vacating premises". The Hindu. 31 March 2020. Archived from the original on 31 March 2020. Retrieved 31 March 2020.
- ↑ "30 Per Cent Of Coronavirus Cases Linked To Delhi Mosque Event: Government". NDTV. 4 April 2020.
- ↑ India, Press Trust of (30 March 2020). "Nizamuddin congregation: Arvind Kejriwal orders FIR against maulana". Business Standard India. Business Standard. Archived from the original on 31 March 2020. Retrieved 30 March 2020.
- ↑ "Nizamuddin congregation: Arvind Kejriwal orders FIR against maulana". Retrieved 30 March 2020.
- ↑ "Coronavirus in India: Tablighi Jamaat preacher, others booked for violating govt guidelines on religious gatherings".
- ↑ "Tablighi Jamaat leader Maulana Saad Kandhalvi traced: Delhi Police sources". Retrieved 10 April 2020.
- ↑ Ulmer, Alexandra; Jamkhandikar, Shilpa (17 April 2020). "In Modi's India, virus fallout inflames divisions between Muslims and Hindus". Reuters. Retrieved 18 April 2020.