తల్లిదండ్రులు (1991 సినిమా)

తల్లిదండ్రులు 1991 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించాడు. దీనికి తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.

తల్లిదండ్రులు
(1991 తెలుగు సినిమా)
Talli Tandrulu (1991 film).jpg
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం బాలకృష్ణ,
విజయశాంతి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

వెంకటరామయ్య ( గుమ్మడి ) సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి. కలప వ్యాపారం చేస్తూంటాడు. భార్య పద్మావతి ( జయంతి ), ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో సంతోషకరమైన ఉమ్మడి కుటుంబం అతడిది. ఆనంద్ ( నందమూరి బాలకృష్ణ ), వెంకటరామయ్య చిన్న కుమారుడు. ఏ బాధ్యతలూ తీసుకోని, ఏమీ సంపాదించని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూండే జల్సారాయుడు..అనుకోకుండా అతను ఒక పాఠశాలలో నృత్య ఉపాధ్యాయురాలిగా పనిచేసే కవిత ( విజయశాంతి ) ను కలుస్తాడు. వారిద్దరూ ఒకరికొకరు పూర్తి వ్యతిరేకం. ఎప్పుడూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూంటారు. కానీ ఒక సందర్భంలో, ఆనంద్ కవితతో ప్రేమలో పడతాడు. ఆమె మాత్రం అతను తనను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటుంది.

శివరాం ( సత్యనారాయణ ) వెంకటరామయ్యకు ప్రత్యర్థి వ్యాపారవేత్త, ఒకప్పుడు వెంకటరామయ్య వద్ద కార్మికుడిగా పనిచేసే వాడు. వెంకటరామయ్య, ఆనంద్‌తో ఎప్పుడూ గొడవలు పడేవాడు. కొంత సమయం తరువాత, కవిత ఆనంద్ ప్రేమను అర్థం చేసుకుంటుంది. కాని అతని కుటుంబ సభ్యులు వారి పెళ్ళికి అంగీకరించరు. దాంతో, ఆనంద్ ఇంటిని వదిలిపోయి కవితను పెళ్ళి చేసుకుంటాడు. ఇంతలో, శివరాం వెంకటరామయ్యను భారీ అప్పుల్లో పడవేస్తాడు. ఆస్తి మొత్తం వేలానికి వస్తుంది. మిగిలిన పిల్లలు వెంకటరామయ్యను ఒంటరిగా వదిలివేస్తారు. ఇది అతని గుండెపోటు వస్తుంది. భార్య మరణిస్తుంది. చివరగా, ఆనంద్ వారి రక్షణకు వస్తాడు. అతను తన తల్లిదండ్రుల ప్రతిష్ఠను గౌరవాన్ని ఎలా కాపాడుతాడనేది మిగిలిన కథ.

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

సంగీతంసవరించు

చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. అన్ని పాటలు హిట్లే. కావేరీ ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.

పాటలు:

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."కృష్ణా నవనంద"వేటూరి సుందరరామమూర్తిఎస్పి బాలు, చిత్ర5:17
2."వినవమ్మా"సిరివెన్నెల సీతారామ శాస్త్రిఎస్పి బాలు, సుజాత3:50
3."చామంతి పువ్వంటి"సిరివెన్నెల సీతారామ శాస్త్రిఎస్పి బాలు, చిత్ర4:59
4."చిటికేసే చింతామణీ"సిరివెన్నెల సీతారామ శాస్త్రిఎస్పి బాలు, చిత్ర3:15
5."పందిరి మంచం"వేటూరి సుందరరామమూర్తిఎస్పి బాలు, చిత్ర4:05
Total length:21:26

మూలాలుసవరించు

  1. "Talli Tandrulu (1991)". ఐఎమ్‌డిబి. Retrieved 2020-08-03.{{cite web}}: CS1 maint: url-status (link)