తీన్ మార్ (సినిమా)

(తీన్ మార్ నుండి దారిమార్పు చెందింది)

తీన్ మార్ 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ సినిమాకు జయంత్ సి. పరాన్జే దర్శకత్వం వహించారు. హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ [1] కు రీమేక్ ఈ సినిమా. పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బంద ప్రధాన పాత్రధారులుగా [2] వచ్చిన ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు. తీన్ మార్ గా [3][4][5] టైటిల్ ఖరారు చేయక ముందు ఖుషీగా, లవ్లీ అనే వర్కింగ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సినిమా ఆడియో 21 మార్చి 2011లో [6] విడుదల కాగా, సినిమా 14 ఏప్రిల్ 2011లో విడుదలైంది.

తీన్ మార్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం జయంత్ సి పరాన్జీ
కథ ఇమ్తియాజ్ అలీ
తారాగణం పవన్ కళ్యాణ్, త్రిష
కృతి కర్బంద
ముఖేష్ రిషి
పరేష్ రావల్
ఎమ్.ఎస్.నారాయణ
తనికెళ్ళ భరణి
సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ పరమేశ్వరా ఆర్ట్స్
విడుదల తేదీ 14 ఏప్రిల్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మైఖేల్ వేలాయుధం (పవన్ కళ్యాణ్) సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్లో చెఫ్. ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉండే మైఖేల్ అమ్మాయిలతో సరదగా ఉంటూంటాడు. న్యూయార్క్లో ఉద్యోగం చేయాలి అనేది అతని లక్ష్యం. కేప్ టౌన్ లో పురావస్తు శాస్త్రవేత్తగా ఉంటున్న మీరా శాస్త్రి (త్రిష)తో సహజీవనం చేస్తుంటాడు. ఒక సంవత్సరం తరువాత మీరా ఇండియాకి రావాల్సి రావడంతో దూరంగా ఉంటూ బంధాలను కొనసాగించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో, ఇద్దరి సమ్మతంతో విడిపోతారు. మీరా వృత్తి రీత్యా ఇండియాకు తిరిగి వచ్చేస్తుంది. కేప్ టౌన్ లో రెస్టారెంట్ యజమాని సేనాపతి (పరేష్ రావల్)తో మైఖేల్ కు పరిచయం ఏర్పడుతుంది. మైఖేల్ ప్రేమ వ్యవహారాలు నచ్చని సేనాపతి ప్రేమ విలువ తెలుసుకొమ్మంటూ అతనికి 1981లో వారణాసిలో జరిగిన తన స్నేహితుడు అర్జున్ పాల్వాయ్ (పవన్ కళ్యాణ్) అర్జున్ వసుమతి (కృతి కర్బందా)ల ప్రేమకథను చెప్తుంటాడు. మీరా ఇండియా వెళ్ళిపోయాకా మైఖేల్ మరే అమ్మాయినీ ప్రేమించలేకపోతాడు. తాను మీరాను మర్చిపోవడం కోసం బార్ లో కలిసిన అమ్మాయి మిచెల్ (డాన్ మార్క్స్)తో కలిసి ఉంటాడు. అలాగే మీరాకు ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్, రాజకీయ నాయకుడు సుధీర్ (సోనూ సూద్) ప్రపోజ్ చేస్తాడు. మీరా అతనిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. తను కూడా మైఖేల్ ను మర్చిపోవడానికే. మైఖేల్ ఇండియాకి మీరాను కలవడానికి వచ్చినపుడు ఆమె సుధీర్ ను పెళ్ళి చేసుకుంటోందని తెలిసి బాధపడతాడు. మీరాకు సుధీర్ తో పెళ్ళి అయిపోయాకా తన బాధను మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ లోపుగా మైఖేల్ కు తను కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగంలో కొన్నాళ్ళు ఆనందంగానే పనిచేసినా, మీరాను మర్చిపోలేనని అర్ధం చేసుకుంటాడు. మీరాను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానని అర్ధం కావడానికి అతని అర్జున్ పాల్వాయ్ కథ దోహదం చేస్తుంది. ఆ తరువాత తను చేసిన తప్పులను సరిదిద్దుకుని మీరాను చేరుకోవడమే మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."ఆలె బాలె"భాస్కరభట్లహేమచంద్ర, శ్రావణ భార్గవి 
2."బార్బీ బొమ్మకి చెల్లెలివా"భాస్కరభట్లబెన్ని డయా, సుచిత్ర కార్తీక్ 
3."చిగురి బొణియ"విశ్వవిశ్వ 
4."గెలుపు తలుపులే తీసే"రెహమాన్శ్రీరామచంద్ర 
5."శ్రీ గంగా"రామజోగయ్య శాస్త్రిహేమచంద్ర, శ్రీవర్ధిని 
6."వయ్యారాల జాబిల్లి"రెహమాన్కారుణ్య 

మూలాలు

మార్చు
  1. "Pawan-Trisha film begins shoot". Sify.com. 24 September 2010. Archived from the original on 3 ఏప్రిల్ 2015. Retrieved 4 February 2011.
  2. "Pawan Kalyan next film". ItsOurIndia.com. 31 August 2005. Archived from the original on 12 ఫిబ్రవరి 2011. Retrieved 10 February 2011.
  3. `Teenmaar` Pawan`s next Archived 2015-09-24 at the Wayback Machine. Sify.com (4 February 2011). Retrieved on 2015-06-30.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-12. Retrieved 2015-09-05.
  5. Pawans LAK remake titled Theenmaar – Telugu Movie News Archived 2011-02-05 at the Wayback Machine. Indiaglitz.com (4 February 2011). Retrieved on 2015-06-30.
  6. http://www.bharatwaves.com/news/Teen-Maar-audio-release-on-21st--17789.html


బయటి లంకెలు

మార్చు