తులాభారం (1974 సినిమా)
శ్రీ రమణ చిత్ర బ్యానర్‌పై నటుడు చలం నిర్మించిన ఈ చిత్రం 1974, ఏప్రిల్ 12న విడుదలయ్యింది.
తులాభారం (1974 తెలుగు సినిమా) | |
తులాభారం సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | నాగేంజనేయులు |
తారాగణం | చలం , శారద |
నిర్మాణ సంస్థ | శ్రీరమణ చిత్ర |
భాష | తెలుగు |
సంక్షిప్త చిత్రకథ
మార్చుకలవారి యువకుడు పేద కన్నెపిల్లను ప్రేమించి, రహస్యంగా తాళికట్టి బారిస్టర్ చదువుకోసం విదేశాలకు వెళతాడు.అతను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సమాజం చేత తిరస్కరించబడి బిడ్డను కని, ఆ బిడ్డ చనిపోగా పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యాగృహంలో గడిపి, చివరకు తను చేయని హత్యానేరం మోపబడి కోర్టులో ముద్దాయిగా నిలబడుతుంది. ప్రాసిక్యూటర్‌గా ఉన్న కథానాయకుడు ఆమెను గుర్తించి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడు. ఆమె పతనానికి తనే కారణమని పశ్చాత్తాప పడతాడు.
నటీనటులు
మార్చుపాటలు
మార్చు- ఈ ఊరే నా యిల్లు ఊరంతా నా వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు - పి.సుశీల - రచన: ఆత్రేయ
- ఏ ఊరు ఏ పేరు ఏందేహ నీ కత చిన్నోడా - పి. సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ
- చేరువలోనే దూరములేల రాధమ్మ నా చెంత - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
- రాధకు నీవేర ప్రాణం ఈ రాధకు నీవేర ప్రాణం రాధా హృదయం - పి.సుశీల - రచన: రాజశ్రీ
- నిద్దురపో బాబు నిద్దురపో నిద్దురలో కలతలు మరచిపో - పి.సుశీల - రచన: ఆరుద్ర
- మూగ రాగాలలో ఎన్ని భావాలో ఆ భావాలలో ఎన్ని - పి.సుశీల కోరస్ - రచన: సినారె
- వాణీ ప్రేమ రాణీ వినవేల - పద్మనాభం, వసంత, పిఠాపురం, ఎల్.ఆర్.అంజలి - రచన: రాజశ్రీ
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)