తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2022)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]
కీర్తి పురస్కారాలు (2022) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2021 | |
మొత్తం బహూకరణలు | 46 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2021 ← కీర్తి పురస్కారాలు (2022) → 2023 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
మార్చు2022 సంవత్సర కీర్తి పురస్కారానికి 46మంది ప్రముఖులు జాబితా 2024 మార్చి 13న ప్రకటించబడింది.
2024 మార్చి 20, 21న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాలు అందజేయబడ్డాయి. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్-సాహితీవేత్త డా. మంగారి రాజేందర్ (జింబో) హాజరై పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, విస్తరణ సేవా విభాగం ఇన్ఛార్జి రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.[2][3]
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | దాట్ల దేవదానం రాజు | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | డా. చెన్నమాధవుని శ్రీనివాసరాజు[4] | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | దురికి మోహనరావు | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | కల్వకోట వెంకట సతీష్ బాబు | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | రంగరాజు పద్మజ | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | లలిత రాజ్ | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | మోహన్ సేనాపతి | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | ఆకెళ్ళ శివప్రసాద్ | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | షరీఫ్ గోరా | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | నామని సుజనాదేవి | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | డా. పెరుగు రామకృష్ణ | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | తగుళ్ళ గోపాల్ | వచన కవిత - యువకవి | వెల్చాల కేశవరావు | |
13 | దాస్యం సేనాపతి | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
14 | డా. బుర్రా మధుసూధన్ రెడ్డి | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
15 | డా. జి. రఘురామ శర్మ | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
16 | కొల్లాపురం విమల | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
17 | అనుముల శ్రీనివాస్[5] | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | డా. చేగోని రవి కుమార్ | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
19 | చొప్పదండి సుధాకర్ | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | గరికపాటి కాళిదాసు | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
21 | సి. రామనాథ శర్మ | ఉత్తమ ఉపాధ్యాయుడు | బైరగోని మల్లయ్య గౌడ్ | |
22 | డా. ఆర్.ఎల్.వి. రమేష్ | ఆంధ్ర నాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
23 | డా. కె. శ్రీదేవి | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
24 | ఆచార్య యం. గోనా నాయక్ | భాష | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
25 | గుర్రం సీతారాములు | అనువాదం | రామవరపు శాంతా సుందరి | |
26 | ఎస్.కె. బాబూజి | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
27 | హరిదాసు | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
28 | ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
29 | డా. కె. బాలస్వామి | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
30 | మాడిశెట్టి గోపాల్ | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
31 | డా. పాటిబండ్ల రామమోహన్ రావు | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
32 | యం. బిక్షు నాయక్ | జానపద గాయకుడు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
33 | షేక్ మహబూబ్ జాన్ | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
34 | బి.వి. సత్య గణేష్ | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
35 | మేడిచర్ల ప్రభాకర రావు | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
36 | మృత్యంజయ | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
37 | కొడాలి వెంకటేశ్వరరావు | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
38 | ప్రసన్న కుమారి | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
39 | డా. నూనె వెంకటయ్య | జ్యోతిషం | మాటేటి రామప్ప | |
40 | జాలాది రత్న సుధీర్ | కాల్పనిక సాహిత్యం | నాయని సుబ్బారావు | |
41 | జి.వి.ఎన్. రాజు | వ్యక్తిత్వ వికాసం | గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి | |
42 | డా. ఎస్.పి. భారతి | కూచిపూడి నృత్యం | కర్కాల దేవకమల | |
43 | ఆచార్య చల్లా రామచంద్రమూర్తి | ప్రాచీన సాహిత్యం | బండ్ల సుబ్రహ్మణ్యం | |
44 | డా. జి.వి. రత్నాకర్ | అనువాద సాహిత్యం | నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు | |
45 | గౌరి వేముల | చిత్రలేఖనం | పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు | |
46 | ఎన్వీ రఘువీర్ ప్రతాప్ | తెలుగు జగల్ | డా. తిరుమల శ్రీనివాసాచార్య-స్వరాజ్యలక్ష్మీ |
ఇవికూడా చూడండి
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2018)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2019)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2020)
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2021)
మూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2023-09-13.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.
- ↑ "23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-22. Archived from the original on 2024-03-22. Retrieved 2024-03-22.
- ↑ "సిరిసిల్ల వాసికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం". Sakshi. 2024-03-21. Archived from the original on 2024-03-21. Retrieved 2024-03-21.
- ↑ "విజ్ఞాన సంస్కారం.. కీర్తి పురస్కారం". EENADU. 2024-03-16. Archived from the original on 2024-03-16. Retrieved 2024-03-21.