తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2019)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే ప్రతిభా పురస్కారం.[1] భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది.

ప్రతిభా పురస్కారాలు (2019)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2018
మొత్తం బహూకరణలు 12
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2018ప్రతిభా పురస్కారాలు (2019)2020

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు

మార్చు

2019 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2][3] వీరికి 2022 సెప్టెంబరు 15న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. ఎన్.టి.ఆర్. కళామందిరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య బి. జగదీశ్వర్రావు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఆచార్య వి. వెంకటరమణ, తెలుగు విశ్వవిద్యాలయ వీసీ టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలను సత్కరించారు.[4][5]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 వి.ఆర్‌. విద్యార్థి కవిత్వం
2 పులికొండ సుబ్బాచారి విమర్శ
3 యం. బాలరాజ్‌ చిత్రకళ
4 ఎస్‌. కాంతారెడ్డి శిల్పకళ
5 ఎస్‌. సువర్ణలత నృత్యం
6 డి.వి. మోహనకృష్ణ సంగీతం
7 వి. మురళి పత్రికారంగం
8 మల్లాది గోపాలకృష్ణ నాటకం
9 మొలంగూరి భిక్షపతి జానపదము
10 ముత్యంపేట గౌరీశంకర శర్మ అవధానం
11 డా. జి. పరిమళ సోమేశ్వర్‌ రచయిత్రి
12 వల్లభనేని అశ్వనీ కుమార్‌ కథ/నవల

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి (2018-11-15). "12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు". Archived from the original on 2018-11-15. Retrieved 2022-09-08.
  2. "12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు". EENADU. 2022-08-30. Archived from the original on 2022-09-08. Retrieved 2022-09-08.
  3. "PSTU: 2019 తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రకటన". Sakshi Education. 2022-08-30. Archived from the original on 2022-09-08. Retrieved 2022-09-08.
  4. "తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-16. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  5. "తెలుగువర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానం". EENADU. 2022-09-16. Archived from the original on 2022-09-16. Retrieved 2022-09-17.

ఇతర లంకెలు

మార్చు
  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015) Archived 2021-04-18 at the Wayback Machine