దరువు (సినిమా)

2012 సినిమా
(దరువు నుండి దారిమార్పు చెందింది)

శ్రీ వేంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవితేజ, తాప్సీ[2] జంటగా శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన హాస్యప్రధాన చిత్రం దరువు. మే 25 2012న విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని సాధించింది.[3][4]

దరువు
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ
నిర్మాణం బూరుగుపల్లి శివరామకృష్ణ
కథ శివ
ఆదినారాయణ
చిత్రానువాదం శివ
ఆదినారాయణ
తారాగణం రవితేజ
తాప్సీ
ప్రభు గణేశన్
వెన్నెల కిశోర్
ఫిష్ వెంకట్
శ్రీనివాస రెడ్డి
సాయాజీ షిండే
సంగీతం విజ‌య్ ఆంటోని
నృత్యాలు అశోక్ రాజ్
దినేష్
గణేష్ స్వామి
గీతరచన భాస్కరభట్ల రవికుమార్
బాషాశ్రీ
రామజోగయ్య శాస్త్రి
సుద్దాల అశోక్ తేజ
సంభాషణలు రమేష్ గోపీ
రావిపూడి
ఛాయాగ్రహణం వెట్రి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్
పంపిణీ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
బ్లూ స్కై సినిమాస్
(Nizam)
BlueSky Cinemas
(overseas)[1]
నిడివి 155 నిమిషాలు
భాష తెలుగు

కథ సవరించు

ఈ కథ తెలుగులో గతంలో వచ్చిన యమగోల, యముడికి మొగుడు, యమలీల తదితర చిత్రాల్లాగా యమలోకం నేపథ్యంలో నడుస్తుంది. బుల్లెట్ రాజా (రవితేజ) చిన్న చిన్న నేరాలు చేసి జైలుకెళ్ళి వస్తుంటాడు. అతని సహాయకుడు కాజా (వెన్నెల కిషోర్). ఓ కార్యక్రమంలో శ్వేత (తాప్సి) ని చూసి వెంటనే ప్రేమలో పడిపోతాడు. కానీ శ్వేతకు ఇదివరకే ఓ లోకల్ గూండా అయిన హార్బర్ బాబు (సుశాంత్ సింగ్) తో నిశ్చితార్థం అయ్యుంటుంది. హార్బర్ బాబు రాజాను అడ్డు తొలగించుకోవడానికి అతన్ని చంపేస్తాడు. బుల్లెట్ రాజా యమలోకానికి వెళతాడు. అక్కడ చిత్రగుప్తుడి (ఎమ్మెస్ నారాయణ)ద్వారా తనకు పొరపాటున మరణం సంభవించిందని తెలుసుకుంటాడు. వెంటనే యమధర్మరాజుతో (ప్రభు)తో గొడవపెట్టుకుంటాడు.యముడు ఇక చేసేదేమీ లేక అతని ఆత్మని అనుచరులు బలరాం (సాయాజీ షిండే), శాంతారాం (అవినాష్), పవిత్రానంద (రఘుబాబు) చేత హత్య గావించబడిన హోంమంత్రి రవీంద్ర శరీరంలో ప్రవేశపెడతాడు. అతను తిరిగి బ్రతికిన తర్వాత అతని శతృవులను ఎదుర్కొన్నాడు, అతని తల్లి పద్మావతమ్మ (జయసుధ) ఆశలను ఎలా నెరవేర్చాడన్నది మిగిలిన కథ

తారాగణం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • కళ: ఏ.ఎస్.ప్రకాష్
  • సహ దర్శకులు: సత్యం బాబు, ఆది నారాయణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిత్తూరి శ్రీనివాస్ రావు
  • ప్రెజెంటర్: శ్రీమతి నాగమునీశ్వరి

మూలాలు సవరించు

  1. "Archived copy". Archived from the original on 8 జూలై 2012. Retrieved 7 ఆగస్టు 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Daruvu". indiaglitz. Archived from the original on 14 ఫిబ్రవరి 2012. Retrieved 7 August 2019.
  3. "Ravi Teja's new film Daruvu". ragalahari. Retrieved 7 August 2019.
  4. "Telangana activists damaged Daruvu sets". ragalahari. Retrieved 7 August 2019.